MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/burra-heats-up-for-chiranjeevi-6bfbb53d-14fd-41bc-8ea7-95480cfc434d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/burra-heats-up-for-chiranjeevi-6bfbb53d-14fd-41bc-8ea7-95480cfc434d-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఏ సమయంలో 'లూసిఫర్' రీమేక్ మొదలుపెట్టాడో గానీ, ఎన్ని రోజులైనా ఆ సమస్యలు తీరడం లేదు. దర్శకులు మారినా.. లాక్‌డౌన్‌లతో కావల్సినంత సమయం దొరికినా.. మెగాస్టార్ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. చేయాల్సిన మార్పులన్నీ చేసేశారు. అన్నీ ఓకే కానీ ఆ ఒక్క సమస్యకు ఆన్సర్ మాత్రం దొరకడం లేదు. Burra heats up for Chiranjeevi {#}Sonakshi Sinha;suhasini;Yuva;Tamilnadu;Heroine;Audience;Remake;Chiranjeevi;Telugu;Cinemaచిరంజీవికి బుర్ర హీటెక్కిపోతోంది..!చిరంజీవికి బుర్ర హీటెక్కిపోతోంది..!Burra heats up for Chiranjeevi {#}Sonakshi Sinha;suhasini;Yuva;Tamilnadu;Heroine;Audience;Remake;Chiranjeevi;Telugu;CinemaFri, 13 Aug 2021 22:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' రీమేక్‌కి సైన్ చేసి దాదాపు రెండేళ్లు పూర్తవుతోంది. మొదట సుజిత్‌కి ఈ రీమేక్ బాధ్యతలని అప్పగించారు. అయితే మళయాళీ కథని తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా మార్చలేకపోతున్నాడని ఈ యువ దర్శకుడిని తప్పించారు. ఆ తర్వాత చాలామంది దర్శకులను పరిశీలించి ఎట్టకేలకు తమిళనాడు నుంచి మోహన్‌రాజాని రంగంలోకి దించారు. 'లూసిఫర్' బాధ్యతలను ఆయన భుజంపై పెట్టేశారు.

మోహన్‌రాజా ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాక స్పీడ్ పెంచేశారు. కథలో చాలా మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. సినిమా కూడా లాంచ్ అయ్యింది. అయితే ఈ మార్పులు చేర్పులకి తగ్గ ఆర్టిస్టులని తీసుకురావడం కష్టమవుతోందట. మళయాళంలో మోహన్‌లాల్‌కి హీరోయిన్ లేదు. కానీ మెగాస్టార్ కోసం హీరోయిన్‌ని క్రియేట్ చేశారు. ఇప్పుడీ క్రియేటివిటీకి న్యాయం చేసే హీరోయిన్‌ ఎంత వెతికినా కనిపించడం లేదట.

మోహన్‌రాజా 'లూసిఫర్' రీమేక్‌లో హీరోయిన్ కోసం నయనతారని సంప్రదిస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరిగింది. కానీ నయన్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇప్పుడు సోనాక్షి సిన్హాని కాంటాక్ట్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ రీమేక్‌కి సోనాక్షి మూడున్నర కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేసిందని ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి 'లూసిఫర్'కి హీరోయిన్ మాత్రమే కాదు, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌ కూడా దొరకడం లేదట. ఈ మూవీలో సిస్టర్‌ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఈ ప్రామినెంట్‌ రోల్‌కి న్యాయం చేసే హీరోయిన్‌ ఇంకా దొరకలేదని తెలుస్తోంది. కొన్నాళ్లు సుహాసిని పేరు వినిపించినా, అప్పట్లో హిట్ పెయిర్‌ అనిపించుకున్న వీళ్లిద్దరు అన్నాచెల్లెల్లుగా నటిస్తే ఆడియన్స్‌ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి ఈ క్వశ్చన్స్ అన్నింటికి మోహన్‌రాజా ఎలాంటి ఆన్సర్స్‌ ప్రిపేర్ చేస్తున్నాడో చూడాలి. ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకొని ఉన్నారు.  చూద్దాం..ముందు ముందు ఏం జరుగబోతోందో. చిరు ఎప్పుడు ఆ టెన్షన్ నుంచి రిలాక్స్ అవుతారో.

'



మెగాస్టార్ కూడా రూట్ మార్చేసాడు.. కానీ..?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>