EditorialVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/farmers-slavariescbad8abc-add2-4039-aa60-a621d0fc118f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/farmers-slavariescbad8abc-add2-4039-aa60-a621d0fc118f-415x250-IndiaHerald.jpgలక్షల రూపాయల సంపదను ఇచ్చే పంట పొలాలు మునిగిపోతే ప్రభుత్వాలు ఇచ్చే ముష్టి మూడు వేలు, ఆరు వేల(అది కూడా 99% మందికి రాదు) కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తాడు. నెత్తీ నోరూ బాదుకుంటాడు. ఆ గండం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాక మ‌ళ్లీ.. అదే ప‌ని! చేతిలో చిల్లిగ‌వ్వ లేక పోయినా.. తల తాకట్టు పెట్టైనా వేలు - లక్షలు తెచ్చి మళ్ళీ పంట వేస్తాడు.. మ‌ళ్లీ న‌ష్టాలు వ‌స్తే.. ప్ర‌భుత్వాల ద‌యాదాక్షి ణ్యాల‌పైనే ఆధార‌ప‌డ‌తాడు. అదేస‌మ‌యంలో ఎరువులు, పురుగు మందుల ద్రోహాలు.. అన్న‌దాత‌ను నిలువునా కాల్చేస్తున్నాయి. అన్నీ బ్లాక్ మారfarmers slavaries{#}Bharateeyudu;Guntur;Government;Mandula;Telangana75వ పంద్రాగస్టు : భారతీయత - భారతీయుడు గొప్పోడే, మరి తప్పెవరిది?75వ పంద్రాగస్టు : భారతీయత - భారతీయుడు గొప్పోడే, మరి తప్పెవరిది?farmers slavaries{#}Bharateeyudu;Guntur;Government;Mandula;TelanganaFri, 13 Aug 2021 10:32:00 GMTఓ దేశంలో 911 నెంబర్ పనిచేయకపోతే అల్లకల్లోలం అయిపోవచ్చు, ఇంకో దేశంలో ప్రతినెలా ప్రభుత్వం ఇచ్చే సోషల్ సెక్యూరిటీ(పింఛ‌న్‌) డబ్బులు పడకపోతే దాదాపు సగానికి పైగా కుటుంబాలు రోడ్డుమీద కొచ్చే యొచ్చు.. కానీ నా దేశంలో.. నా భారతదేశంలో.. ఎవ‌డు ఏం చేసినా - చెయ్యకపోయినా సగటు భారతీయుడు మాత్రం రెక్కలు ముక్కలు చేసుకుని పని చేస్తూనే ఉంటాడు. సంపదను, విలువను సృష్టిస్తూనే ఉంటాడు. ఆ సంపదను దాదాపు 60 శాతం పైగా ఉన్న ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, లంచాలు, మామ్మూళ్లు అంటూ  నాయకులు, ప్రభుత్వాల ఎదన పోస్తూనే ఉంటాడు.  

లక్షల రూపాయల సంపదను ఇచ్చే పంట పొలాలు మునిగిపోతే ప్రభుత్వాలు ఇచ్చే ముష్టి మూడు వేలు, ఆరు వేల(అది కూడా 99% మందికి రాదు) కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తాడు. నెత్తీ నోరూ బాదుకుంటాడు. ఆ గండం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాక మ‌ళ్లీ.. అదే ప‌ని! చేతిలో చిల్లిగ‌వ్వ లేక పోయినా.. తల తాకట్టు పెట్టైనా వేలు - లక్షలు తెచ్చి మళ్ళీ పంట వేస్తాడు.. మ‌ళ్లీ న‌ష్టాలు వ‌స్తే.. ప్ర‌భుత్వాల ద‌యాదాక్షి ణ్యాల‌పైనే ఆధార‌ప‌డ‌తాడు. అదేస‌మ‌యంలో ఎరువులు, పురుగు మందుల ద్రోహాలు.. అన్న‌దాత‌ను నిలువునా కాల్చేస్తున్నాయి.

అన్నీ బ్లాక్ మార్కెటింగ్‌! అంతా అవినీతి కంపు. ఇక‌, ఇన్ని క‌ష్టాలు.. దాటుకుని.. సాగు చేసినా.. మార్కెట్‌లో కొనుగోలు చేసేవారు క‌నిపించ‌రు. క‌నిపించినా.. ఏదో ఒక వంక‌తో.. దేశ రైతాంగ చెమ‌ట‌ను దోచుకునేవారే. కానీ. ప్ర‌భుత్వాలు మాత్రం.. అన్నీ బాగానే చేస్తున్నాం.. ఇది రైతు రాజ్యం అని చెప్పుకొంటూనే ఉన్నాయి. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం.. రైత‌న్న‌ల ప‌రిస్థితి దారుణంగానే ఉంది. ``రైతు నాగ‌లి మోస్తున్నాడు.. క్రీస్తు.. శిలువ మోసిన‌ట్టు!`` అన్న గుంటూరు శేషేంద్ర శ‌ర్మ వాక్యాలు.. అక్ష‌రాలా.. ఈ దేశ రైతాంగం ఎదుర్కొంటు న్న ప‌రిస్థితికి అద్దం ప‌డ‌తాయి.

కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి.. రైతుల పాలిట అశ‌నిపాతంగా మారింద‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తీ లేదు. క‌ష్టాల్లో ఉన్న రైతుల‌ను ఆదుకునేందుకు, ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలో న‌ష్ట‌పోయిన అన్న‌దాత‌కు అండ‌గా నిలిచేందుకు శ‌త విధాల ఆలోచించే ప్ర‌భుత్వాలు.. అదే రైతు పేరుతో బ‌డా కంపెనీల‌కు ప్ర‌జాధనాన్ని ఉదారంగా ఇచ్చేస్తున్న‌రంటే.. సాగు ప‌ట్ల‌, సేద్యం ప‌ట్ల వారికి ఉన్న చిత్త శుద్ధిని క‌ళ్ల‌కు క‌డుతుంది. ఎరువుల స‌బ్సిడీ అంటారు. వాటికి ఇన్ని వేల కోట్లు కేటాయిస్తున్నామ‌ని చెబుతారు. తీరా వాటిని.. బ‌డా కంపెనీల‌కు ధారాద‌త్తం చేస్తున్నారు.

ఒక స‌ర్వే ప్ర‌కారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎరువులు, పురుగు మందులు, విత్త‌నాల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు మెజారిటీ రాజ‌కీయ నేత‌ల చేతుల్లోనే ఉన్నాయి. అంటే.. దీనిని బ‌ట్టి.. రైతుల క‌ష్టం దోపిడీ ఎక్క‌డ జ‌రుగుతోందో ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. రైతుల కోసం ఇచ్చే నిధులు నేరుగా వారి ఖాతాల్లో జ‌మ‌చేయాల‌ని.. పెట్టుబ‌డుల‌కు-గిట్టుబాటుకు మ‌ధ్య స‌మ‌తూకం ఉండాల‌ని మూడు ద‌శాబ్ధాల కింద‌టే స్వామినాథ‌న్ క‌మిటీ సిఫార‌సు చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిని అమ‌లు చేసే నాయ‌కులు దేశం కొర‌వ‌డ్డారు.కానీ, వారంతా అన్న‌దాత ప‌క్ష‌పాతులుగా అభివ‌ర్ణించుకుంటారు. ఇదీ మ‌న దేశం. 75 వ‌సంతాలు పూర్తి చేసుకున్న స్వ‌తంత్ర భార‌త దేశం.





పవన్, రేణు ల పెళ్లి వెనక అసలు రహస్యాలు

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

'జనసేనాని' అది చేస్తే జనంలో హీరోనే ?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>