PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/talibans03ea61be-79b1-4a5c-8c56-3001566acfd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/talibans03ea61be-79b1-4a5c-8c56-3001566acfd0-415x250-IndiaHerald.jpgఉగ్రవాదం.. భారత్‌ ఎదుర్కొంటున్న కీలమైన సవాల్.. పక్కలో బల్లెంలా పాకిస్తాన్‌ ఇండియాపైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది. పీవోకే నుంచి దేశంలో చొరబడేందుకు 300 మంది వరకూ ముష్కర మూకలు సిద్ధంగా ఉన్నాయని కాశ్మీర్‌ డీఐజీ మొన్ననే ప్రకటించారు.. ఇప్పుడు భారత్‌కు మరో తలనొప్పి అఫ్గాన్ రూపంలో ఎదురవుతోంది. అఫ్గాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆ దేశం నుంచి అమెరికా సైన్యాలు వెళ్లిపోయిన తర్వాత ఒక్కో ప్రాంతాన్నే ఆక్రమిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు పరిస్థితి ఎంత వరకూ వచ్చిందంటే.. చివరకు అఫ్గాన్ ప్రభుత్వం కూడా తాలిబన్లతTALIBANS{#}Capital;Pakistan;Government;American Samoaగాంధారం గందరగోళం.. భారత్‌ పక్కలో మరో బల్లెం..?గాంధారం గందరగోళం.. భారత్‌ పక్కలో మరో బల్లెం..?TALIBANS{#}Capital;Pakistan;Government;American SamoaFri, 13 Aug 2021 09:00:00 GMTఉగ్రవాదం.. భారత్‌ ఎదుర్కొంటున్న కీలమైన సవాల్.. పక్కలో బల్లెంలా పాకిస్తాన్‌ ఇండియాపైకి  ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది. పీవోకే నుంచి దేశంలో చొరబడేందుకు 300 మంది వరకూ ముష్కర మూకలు సిద్ధంగా ఉన్నాయని కాశ్మీర్‌ డీఐజీ మొన్ననే ప్రకటించారు.. ఇప్పుడు భారత్‌కు మరో తలనొప్పి అఫ్గాన్ రూపంలో ఎదురవుతోంది. అఫ్గాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆ దేశం నుంచి అమెరికా సైన్యాలు వెళ్లిపోయిన తర్వాత ఒక్కో ప్రాంతాన్నే ఆక్రమిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు పరిస్థితి ఎంత వరకూ వచ్చిందంటే.. చివరకు అఫ్గాన్ ప్రభుత్వం కూడా తాలిబన్లతో సంధికి సిద్దపడుతోంది.


తాలిబన్లతో అధికారం పంచుకునే ఒప్పందానికి అఫ్గాన్ ప్రభుత్వం తాజాగా ముందుకొచ్చింది. ఖతార్‌లోని అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్ల ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. అఫ్గానిస్థాన్‌లోని ఇప్పటికే కీలక ప్రాంతాలు తాలిబన్ల వశమయ్యాయి. అఫ్గానిస్థాన్‌ భూభాగాల నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన నాటి నుంచి తాలిబన్లు బాగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే అఫ్గాన్‌లోని అనేక భూభాగాలను ఆక్రమించేశారు. తాజాగా రాజధాని కాబూల్‌ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్నీ పట్టణాన్ని కూడా ముష్కర మూకలు ఆక్రమించేశాయి.


కాబూల్‌-కాందహార్‌ జాతీయ రహదారిపై ఈ గజ్నీ నగరం ఉంటుంది.  ఈ కీలక నగరాన్ని తాలిబన్లు ఆక్రమించడంతో ఇక వారిని ఆపలేమని అఫ్గాన్ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే అఫ్గాన్‌ ప్రభుత్వం ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని అనేక ప్రాంతాలు  కోల్పోయింది. అందుకే తాలిబన్లతో కలిసి అధికారం పంచుకునేందుకు ముందుకొస్తోంది. అయితే ఈ పరిణామం ఇండియాకు చేటు చేస్తుంది.. తాలిబన్లతో అఫ్గాన్ ప్రభుత్వం రాజీ పడితే.. ఆ దేశం మరోసారి ముష్కర మూకల కేంద్రం అవుతుంది.


ఇక తాలిబన్లతో పాక్ దోస్తీ సంగతి తెలిసిందే. ఇప్పటికే సరిహద్దుల్లో రెచ్చిపోతున్న పాక్ ముష్కర మూకలు... తాలిబన్ల అండతో మరింతగా రెచ్చిపోవచ్చు.. పాక్ టెర్రరిస్టులు, తాలిబన్లు చేతులు కలిపితే అది భారత్‌కు నష్టదాయకమని విశ్లేషకులు భావిస్తున్నారు.



తెలుగులో "ది ఫ్యామిలీ మ్యాన్-2".. ఎప్పుడంటే?

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>