PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/rsp-tention-trs9cc96b53-e7a8-4d9f-97f5-efacab4ae8b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/rsp-tention-trs9cc96b53-e7a8-4d9f-97f5-efacab4ae8b7-415x250-IndiaHerald.jpgబహుజన సమాజ్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌.. ఇటీవల నల్లగొండలో నిర్వహించిన సభ.. అధికార టీఆర్ఎస్‌లో అంతర్మథనం మొదలయ్యేలా చేసిందా? గులాబీ పార్టీ వర్గాలు. దళిత సమాజం అంత తమవైపే ఉందనుకున్న గులాబీ దళానికి.. ఇటీవల నల్లగొండలో ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నిర్వహించిన బహిరంగసభ ఊహించని షాక్ ఇచ్చిందా? నిజానికి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌ను మొన్నటివరకు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మాత్రమే చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్, గులాబీ నేతలు మొన్నటి నల్లగొండ సభతో వాస్తవ పరిస్థితి ఏమిటో గ్రహించారనrsp tention trs{#}pragathy;praveen;Government;Telangana Chief Minister;Telangana Rashtra Samithi TRS;CM;Partyటీఆర్ఎస్‌లో ఆర్ఎస్‌పీ టెన్షన్‌!టీఆర్ఎస్‌లో ఆర్ఎస్‌పీ టెన్షన్‌!rsp tention trs{#}pragathy;praveen;Government;Telangana Chief Minister;Telangana Rashtra Samithi TRS;CM;PartyFri, 13 Aug 2021 11:04:27 GMTబహుజన సమాజ్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌.. ఇటీవల నల్లగొండలో నిర్వహించిన సభ.. అధికార టీఆర్ఎస్‌లో అంతర్మథనం మొదలయ్యేలా చేసిందా? గులాబీ పార్టీ వర్గాలు. దళిత సమాజం అంత తమవైపే ఉందనుకున్న గులాబీ దళానికి.. ఇటీవల నల్లగొండలో ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నిర్వహించిన బహిరంగసభ ఊహించని షాక్ ఇచ్చిందా? నిజానికి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌ను మొన్నటివరకు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మాత్రమే చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్, గులాబీ నేతలు మొన్నటి నల్లగొండ సభతో వాస్తవ పరిస్థితి ఏమిటో గ్రహించారనే చర్చ జరుగుతోంది. అనతి కాలంలోనే రాజకీయాల్లో వచ్చిన ప్రవీణ్‌ కుమార్‌ను పెద్దగా దళితులు నమ్మే పరిస్థితి లేదని అంచనా వేశారు. అయితే నల్లగొండ సభకు భారీ స్థాయిలో ప్రజలు హాజరుకావడంపై టీఆర్ఎస్ పార్టీలో చర్చ మొదలైంది.

కొత్త పథకంతో దళితులంతా టీఆర్ఎస్ వైపు నిలబడతారని భావించినప్పటికీ దళిత యువత ఉత్సాహంగా నల్లగొండ సభకు హాజరుకావడం దేనికి సంకేతం అనే చర్చ జరుగుతోంది. భారీ ఖర్చుతో పథకాన్ని రూపొందించినా, ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చినా ప్రవీణ్ కుమార్‌ వైపు మొగ్గు చూపడంపై విశ్లేషణలు మొదలయ్యాయి. సమీప భవిష్యత్తులో దళిత ఓటు బ్యాంకు విషయంలో టీఆర్ఎస్ వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అనే తీరులో ఆలోచించాల్సి వస్తుందేమో అనే అభిప్రాయాన్ని ఒకరిద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే దళిత బంధును స్వాగతిస్తూనే ప్రవీణ్ కుమార్ సభకు ఎందుకు వెళ్లారు. అలా వెళ్లినవారెవరు? లాంటి అంశాలపై చర్చ జరుగుతోంది. నిరుద్యోగులా? విద్యాధికులా? ప్రభుత్వం పట్ల వ్యతిరేకత? లేదా అసంతృప్తి ఉన్నవారా? ఇలా అనేక కోణాల్లో విశ్లేషణ జరుగుతోంది.

దళితుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టినా అనూహ్యంగా నల్లగొండ సభకు భారీ స్థాయిలో హాజరుకావడం టీఆర్ఎస్‌ను సందేహాల్లో ముంచెత్తింది. సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రిలో 76 మంది దళితులకు 7.6 కోట్లు మంజూరు చేసింది కళ్లముందు కనిపిస్తున్నా.. ఆ సభకు కేవలం దళితులే హాజరుకావడం టీఆర్ఎస్‌ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. సభకు ఎంత మంది హాజరయ్యారనే దానికంటే అది జరిగిన తీరు, వారిలో కనిపించిన ఉత్సాహాన్ని టీఆర్ఎస్ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే ప్రవీణ్ కుమార్‌ను ఎదుర్కొనేందుకు నియోజకవర్గాల వారీగా ఉన్న దళితులకు మరింత దగ్గర అయ్యేందుకు సీఎం కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని టీఆర్ఎస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.



'పుష్ప' ఫస్ట్ సాంగ్ : 'దాక్కో దాక్కో మేక' అంటూ కేక పుట్టించిన డిఎస్పీ .... !!

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

'జనసేనాని' అది చేస్తే జనంలో హీరోనే ?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>