PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp9214406e-7c0e-4a1a-a070-98e6d903a3a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp9214406e-7c0e-4a1a-a070-98e6d903a3a1-415x250-IndiaHerald.jpgఎపుడో నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీయార్ ఉమ్మడి ఏపీకి బంపర్ మెజారిటీతో సీఎం అయిపోయారు. నాడు ఎన్టీయార్ తనకు తిరుగులేదు అనుకున్నారు. కానీ ఒక రాష్ట్రం అధికారాలు పరిమితులు అన్నీ ఆయనకు తెలిసివచ్చేసరికి సర్కారే కూలిపోయింది. కేంద్రం చేతిలో అధికారాలు అన్నీ పెట్టుకుని రాష్ట్రాలను తానే పాలిస్తోందని అప్పట్లో ఎన్టీయార్ అనేవారు bjp{#}Andhra Pradeshజగన్ కి బీజేపీ షాక్ ఇస్తుందా... ?జగన్ కి బీజేపీ షాక్ ఇస్తుందా... ?bjp{#}Andhra PradeshFri, 13 Aug 2021 21:00:00 GMTఎపుడో నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీయార్ ఉమ్మడి ఏపీకి బంపర్ మెజారిటీతో సీఎం అయిపోయారు. నాడు ఎన్టీయార్ తనకు తిరుగులేదు అనుకున్నారు. కానీ ఒక రాష్ట్రం అధికారాలు పరిమితులు అన్నీ ఆయనకు తెలిసివచ్చేసరికి సర్కారే కూలిపోయింది.

కేంద్రం చేతిలో అధికారాలు అన్నీ పెట్టుకుని రాష్ట్రాలను తానే పాలిస్తోందని అప్పట్లో ఎన్టీయార్ అనేవారు. ఇదిలా ఉంటే కేంద్రం మిధ్య అని కూడా ఆయన ఘాటైన మాట కూడా నాడు  వాడేవారు.  నాటి నుంచి నేటి దాకా చూసినా కేంద్రం వైఖరిలో మార్పు అయితే లేదు. ఇవన్నీ పక్కన పెడితే కేంద్రం చేతిలో విశేషమైన అధికారాలు ఉన్నాయి. అక్కడ తలచుకుంటే ఏ రాష్ట్రం మీద అయినా ఆర్టికల్ 360ని ప్రయోగించవచ్చు. మరి ఏపీలో అలాంటి ప్రయోగం చేయమని అంతా కోరుతున్నారు. వారంతా వైసీపీ గిట్టనివారే అనుకున్నా ఏపీలో పరిస్థితులు కూడా అందుకు అవకాశం ఇస్తున్నాయా అంటే అవును అన్న మాట వస్తోంది.

ఏపీలో ప్రతీ నెలా పదివేల కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది. కానీ ప్రభుత్వం  వద్ద కేవలం రెండు వేల కోట్ల రూపాయలే అనాటికి ఉంటున్నాయి. దాంతో గత కొద్ది నెలలుగా ఏపీ సర్కార్ వేతన జీవులకు పెన్షనర్లకు తన డబ్బులు పడక తెగ ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు ఏపీలో చాలా అప్పులు పెరిగిపోయాయి. అవి పరిమితిని దాటేశాయని కూడా చెబుతున్నారు. ఈ ణామాలతో  ఏపీలో ఆర్ధిక అత్యవసర పరిస్థితిని  విధించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. తలచుకుంటే కేంద్రం ఆ పని చాలా ఈజీగా చేయగలదు. అదే కనుక చేస్తే ఏపీ ఆర్ధిక వ్యవహారాలు మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోతాయి. నిజానికి దేశానికి స్వాతంత్రం వచ్చాక  ఇలాంటి ఆర్ధిక అత్యవసర పరిస్థితిని విధించే అవసరం ఏ రాష్ట్రంలోనూ రాలేదు. శాంతిభద్రతల సాకుతో ఆర్టికల్ 360ని ప్రయోగించారు. మరి దీని కనుక ఫస్ట్ టైమ్ ఏపీలో అమలు చేస్తే అది రికార్డు అవుతుంది. జగన్ కి కూడా భారీ షాక్ గా పరిణమిస్తుంది. అలాంటి పనికి బీజేపీ పెద్దలు పూనుకుంటారా అంటే చూడాలి మరి.





జగన్ కి బీజేపీ షాక్ ఇస్తుందా... ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>