PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawana43e69bc-f4ba-4713-918c-923e67949e46-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawana43e69bc-f4ba-4713-918c-923e67949e46-415x250-IndiaHerald.jpgఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, టీడీపీ-జనసేన పొత్తుపై ఆసక్తికర విశ్లేషణలు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే, 2014 ఫలితాలు రిపీట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల, ఈ రెండు పార్టీలకు డ్యామేజ్ జరిగింది. పైగా ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌లు కలిసి పోటీ చేయకపోతే, మళ్ళీ వైసీపీకే అడ్వాంటేజ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. pawan{#}Vijayawada;Perni Nani;Alla Ramakrishna Reddy;Air;Cheque;Janasena;Hanu Raghavapudi;Guntur;avanthi srinivas;YCP;TDP‘సైకిల్’తో సేనాని...’ఫ్యాన్’ మంత్రులకు ఉక్కపోతే?‘సైకిల్’తో సేనాని...’ఫ్యాన్’ మంత్రులకు ఉక్కపోతే?pawan{#}Vijayawada;Perni Nani;Alla Ramakrishna Reddy;Air;Cheque;Janasena;Hanu Raghavapudi;Guntur;avanthi srinivas;YCP;TDPFri, 13 Aug 2021 03:00:00 GMTఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, టీడీపీ-జనసేన పొత్తుపై ఆసక్తికర విశ్లేషణలు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే, 2014 ఫలితాలు రిపీట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల, ఈ రెండు పార్టీలకు డ్యామేజ్ జరిగింది. పైగా ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌లు కలిసి పోటీ చేయకపోతే, మళ్ళీ వైసీపీకే అడ్వాంటేజ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు బలంగా ఉన్న జగన్‌ని ఎదురుకునే బలం చంద్రబాబుకు పూర్తిగా లేదు. కానీ పవన్ సపోర్ట్ ఇస్తే మాత్రం చంద్రబాబు, జగన్‌కు చెక్ పెట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. వీరు కలిస్తే పలు జిల్లాలో ఫలితాలు తారుమారైపోతాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

ఇదే సమయంలో టీడీపీ, జనసేన కలిస్తే కొందరు మంత్రులకు చెక్ పడటం గ్యారెంటీ అని అంటున్నారు. అలా రెండు పార్టీలు కలిస్తే మంత్రులకు గెలుపు కష్టమవుతుందని తెలుస్తోంది. సైకిల్‌తో సేనాని జట్టు కడితే గెలుపు ఇబ్బంది అయ్యే మంత్రుల్లో పేర్ని నాని ముందు వరుసలో ఉంటారు. గత ఎన్నికల్లో ఈయన మచిలీపట్నం నుంచి కేవలం 5 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీపై గెలిచారు. ఇక్కడ జనసేనకు 18 వేల ఓట్లు వరకు వచ్చాయి. అంటే టీడీపీ-జనసేన కలిస్తే పేర్ని పరిస్తితి ఏమయ్యేదో చెప్పాల్సిన పని లేదు.

అలాగే టీడీపీ-జనసేనలు కలిస్తే విజయవాడ వెస్ట్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్, ఏలూరులో ఆళ్ళ నాని, ఆచంటలో రంగనాథరాజు, అమలాపురంలో పినిపే విశ్వరూప్, కాకినాడలో కన్నబాబు, రామచంద్రాపురంలో వేణుగోపాల్, భీమిలిలో అవంతి శ్రీనివాస్‌లకు గెలుపు చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ మంత్రులు గెలిచిన నియోజకవర్గాల్లో టీడీపీ మీద వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే జనసేనకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాబట్టి సైకిల్‌తో సేనాని కలిస్తే ఈ వైసీపీ మంత్రులకు ఫ్యాన్ గాలి సరిపోక ఉక్కపోత తప్పదు.



‘సైకిల్’తో సేనాని...’ఫ్యాన్’ మంత్రులకు ఉక్కపోతే?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>