MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouliccbb35d4-a842-4374-b5c6-484b2bf1f0d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouliccbb35d4-a842-4374-b5c6-484b2bf1f0d8-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కోసం ఉక్రేయిన్ లో ఉన్నాడు. ఈ షెడ్యూల్ పూర్తి కావడానికి మరో పదిరోజులు సమయం పడుతూ ఉండటంతో రాజమౌళి ఆలోచనలు అన్నీ మళ్ళీ మారిపోయాయి అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ లీకుల ప్రకారం ఇప్పుడు మళ్ళీ రాజమౌళి వ్యూహాలు మారిపోయినట్లు టాక్.ఇప్పటి వరకు ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తేదీ అక్టోబర్ 13 అని ప్రకటన వచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ వ్యూహాలు మార్చుకుని ఈమూవీని ఈ సంవత్సరం క్రిస్మస్ రేస్ లో కానీ లేదంటే వచ్చే సంవత్సరం రిపబ్లిక్ డే నాడు కానీ విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనrajamouli{#}Aamir Khan;Christmas;Ukraine;Makar Sakranti;Rajamouli;October;Coronavirus;Allu Arjun;Cinemaసంక్రాంతి సినిమాలకోసం రాజమౌళి సరికొత్త రాజీ !సంక్రాంతి సినిమాలకోసం రాజమౌళి సరికొత్త రాజీ !rajamouli{#}Aamir Khan;Christmas;Ukraine;Makar Sakranti;Rajamouli;October;Coronavirus;Allu Arjun;CinemaFri, 13 Aug 2021 09:00:00 GMT
ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కోసం ఉక్రేయిన్ లో ఉన్నాడు. ఈ షెడ్యూల్ పూర్తి కావడానికి మరో పదిరోజులు సమయం పడుతూ ఉండటంతో రాజమౌళి ఆలోచనలు అన్నీ మళ్ళీ మారిపోయాయి అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ లీకుల ప్రకారం ఇప్పుడు మళ్ళీ రాజమౌళి వ్యూహాలు మారిపోయినట్లు టాక్.


ఇప్పటి వరకు ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తేదీ అక్టోబర్ 13 అని ప్రకటన వచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ వ్యూహాలు మార్చుకుని ఈమూవీని ఈ సంవత్సరం క్రిస్మస్ రేస్ లో కానీ లేదంటే వచ్చే సంవత్సరం రిపబ్లిక్ డే నాడు కానీ విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలను తన సన్నిహితులతో పంచుకుంటున్నట్లు టాక్. ఇలా రాజమౌళి వ్యూహాలు మారిపోవడానికి అనేక కారణాలు ప్రభావితం చేస్తున్నాయి అంటున్నారు.


దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ థర్డ్ వేవ్ భయాలు ఇంకా అందర్నీ వెంటాడుతూనే ఉన్నాయి. ఈ భయాలు పూర్తిగా తగ్గకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి రాజమౌళి కోరుకున్న బిజినెస్ కానీ లేదంటే కలక్షన్స్ కాని  రావు. దీనితో ఈ మూవీని అన్ని భయాలు తీరిన తరువాత మాత్రమే విడుదల చేస్తే మంచిదని రాజమౌళి ఇప్పటికే ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు అని అంటున్నారు.


అయితే రాజమౌళి కొత్త వ్యూహాలకు అనేక అడ్డంకులు ఎదురు కాబోతున్నాయి. ఇప్పటికే క్రిస్మస్ కు అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అంతేకాకుండా అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ కూడ క్రిస్మస్ ను నమ్ముకుంది. ఇప్పటికే డేట్స్ ప్రకటించుకున్న సంక్రాంతి సినిమాలను డిస్ట్రబ్ చేయము అని రాజమౌళి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న యూనిట్ ఇండియాకు వచ్చి చాల లోతుగా ఆలోచించిన తరువాత ఒక స్థిర నిర్ణయం తీసుకుని క్రిస్మస్ కాకుంటే సంక్రాంతి సినిమాలకు అడ్డు రాకుండా రిపబ్లిక్ డే ను కార్నర్ చేయాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు..





తెలుగులో "ది ఫ్యామిలీ మ్యాన్-2".. ఎప్పుడంటే?

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>