PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp269cf195-035a-4b55-9bff-1d217bdc816a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp269cf195-035a-4b55-9bff-1d217bdc816a-415x250-IndiaHerald.jpgఇవ‌న్నీ ఇలా ఉంటే సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో మాత్రం ప‌క్క ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మంత్రి ప‌ద‌వి కోసం జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే వీరిద్ద‌రు కూడా సీనియ‌ర్లు. పైగా జ‌గ‌న్‌కు అత్యంత ఇష్టులు. ఒక్కొక్క‌రు నాలుగేసి సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్న‌ప్ప‌టి నుంచి కూడా వీరు ఆ ఫ్యామిలీతో అనుబంధం కొన‌సాగిస్తుండ‌డంతో పాటు నాటి నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఎవ‌రో కాదు రాయ‌చోటYSRCP{#}Scheduled caste;Cabinet;Reddy;MLA;Andhra Pradesh;రాజీనామా;srikanth;Minister;YCP;District;CMవైసీపీలో ఇద్ద‌రు బెస్ట్ ఫ్రెండ్స్‌.. ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వి కావాల‌ట ?వైసీపీలో ఇద్ద‌రు బెస్ట్ ఫ్రెండ్స్‌.. ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వి కావాల‌ట ?YSRCP{#}Scheduled caste;Cabinet;Reddy;MLA;Andhra Pradesh;రాజీనామా;srikanth;Minister;YCP;District;CMFri, 13 Aug 2021 17:40:00 GMTఏపీలో మ‌రో మూడు నెల‌ల్లో కేబినెట్ ను ప్ర‌క్షాళ‌న చేస్తున్న‌ట్టు లీకులు వ‌స్తున్నాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడే రెండున్న రేళ్ల త‌ర్వాత మంత్రి వ‌ర్గాన్ని 90 శాతం ప్ర‌క్షాళ‌న చేస్తానని ప్ర‌క‌టించారు. ద‌స‌రాకు ఏపీ కేబినెట్లో మార్పులు, చేర్పులు ఉండ‌వ‌చ్చ‌న్న ప్ర‌చారంతో ఆశావాహులు ఎవ‌రికి వారు త‌మ ప్ర‌య‌త్నాలు తాము ముమ్మ‌రం చేస్తున్నారు. ప‌లు జిల్లాల నుంచి సీనియ‌ర్ల పేర్లు బ‌య‌ట‌కు వినిపిస్తున్్నాయి. ఎవ‌రికి వారు త‌మ స్థాయిలో జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో మాత్రం ప‌క్క ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మంత్రి ప‌ద‌వి కోసం జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే వీరిద్ద‌రు కూడా సీనియ‌ర్లు. పైగా జ‌గ‌న్‌కు అత్యంత ఇష్టులు. ఒక్కొక్క‌రు నాలుగేసి సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్న‌ప్ప‌టి నుంచి కూడా వీరు ఆ ఫ్యామిలీతో అనుబంధం కొన‌సాగిస్తుండ‌డంతో పాటు నాటి నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఎవ‌రో కాదు రాయ‌చోటి ఎమ్మెల్యే, విప్ శ్రీకాంత్ రెడ్డి, ప‌క్క‌నే ఉన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు. వారిద్ద‌రు జ‌గ‌న్ కోసం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బ‌య‌ట‌కు రావ‌డంతో పాటు త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వులు కూడా వ‌దులుకున్నారు. త‌ర్వాత ఉప ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. అయితే ఇప్పుడు అటు శ్రీకాంత్ రెడ్డి, ఇటు శ్రీనివాసులు ఇద్ద‌రూ కూడా మంత్రి ప‌ద‌వి కోసం త‌మ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.
 
ఇక శ్రీకాంత్ రెడ్డికి రెడ్డి కోటా మైన‌స్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక ఎస్సీ కోటాలో శ్రీనివాసుల‌కు ఛాన్స్ ఉంటుంద‌ని ఓ అంచ‌నా ఉంది. మ‌రి శ్రీకాంత్ జ‌గ‌న్‌కు స‌న్నిహితుడు కావ‌డంతో ఆయ‌న‌కు కూడా మంత్రి ప‌ద‌వి పై మోజు ఉంది. మ‌రి జ‌గ‌న్ ఇద్ద‌రిలో ఏం చేస్తారో ?  ఎవ‌రికి కేబినెట్ బెర్త్ ఇస్తారో ?  చూడాలి.





క్లైమాక్స్ కు ఓటుకు నోటు కేసు!

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>