CrimeN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/dead-be6ef9aa-f16e-4f4f-bb68-0d7ece12243a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/dead-be6ef9aa-f16e-4f4f-bb68-0d7ece12243a-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో ఆసుపత్రి సీన్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. నిజ జీవితంలోను అలాంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. కాకపోతే బతికున్న వ్యక్తికి ట్రీట్​మెంట్​ చేస్తుంటే చనిపోయారు.dead {#}Khammam;Bhadradri;Reddy;Chiranjeevi;Telanganaఠాగూర్ సినిమాని రిపీట్ చేసిన వైద్యులు.. ఎక్కడంటే..??ఠాగూర్ సినిమాని రిపీట్ చేసిన వైద్యులు.. ఎక్కడంటే..??dead {#}Khammam;Bhadradri;Reddy;Chiranjeevi;TelanganaFri, 13 Aug 2021 10:05:00 GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో ఆసుపత్రి సీన్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. నిజ జీవితంలోను అలాంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. కాకపోతే బతికున్న వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తుంటే చనిపోయారు. ఇక అప్పటికే పేషెంట్ బంధువులు చాలా డబ్బులు కట్టేశారు. దాంతో ఒకవేళ రోగి చనిపోయారని తెలిస్తే.. ఎక్కడ గడొవ చేస్తారోనని బయపడ్డారో.. లేక అది వాళ్ల రొటీన్లో భాగమూ తెలియదు కానీ, డ్రామా మొదలు పెట్టారు.

అయితే రోగి కండీషన్ సీరియస్గా ఉందంటూ.. వెంటనే పెద్దాసుత్రికి తీసుకెళ్లాలని హడావుడి మొదలు పెట్టారు. ఇక వైద్యుల తీరుపై అనుమానం వచ్చిన రోగి బంధువులు.. వెళ్లి పేషెంట్ను చూడగా అప్పటికే మృతి చెందింది. దాంతో ఆసుపత్రి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. వైద్యుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలి నిండు ప్రాణం బలైంది. ఇక దానిని కప్పిపుచ్చుకోవడానికి చనిపోయిన పేషెంట్ పరిస్థితి క్రిటికల్‌గా ఉందంటూ సదరు ఆస్పత్రి వైద్యులు హంగామా చేశారు.

ఇక కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో గత ఐదురోజుల క్రితం సుజాతనగర్‌ రెడ్డి పాలెంకు చెందిన ముసుగు మల్లమ్మ(75) జాయిన్ చేశారు. అయితే తొంటికి ఫ్రాక్షర్ అయిందన్న నేపథ్యంలో వైద్యులు ఆపరేషన్ చేశారంట. కాగా.. 5 రోజుల పాటు చికిత్స చేసి.. వేల రూపాయల బిల్లు కట్టించుకున్నారు. ఇక చివరకు వైద్యం వికటించి మల్లమ్మ ప్రాణాలు కోల్పోయింది.

దాంతో వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్‌ను తీసుకెళ్లాలి.. కండీషన్ క్రిటికల్‌గా ఉందంటూ వైద్యులు హంగామా సృష్టించారు. వైద్యుల తీరుపై అనుమానం వచ్చిన కుటుంబీకులు మల్లమ్మ వద్దకు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయినట్టు గ్రహించి.. ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. ఇక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏంటని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక.. వెంటనే ఆస్పత్రిని సీజ్ చేయాలని ఆందోళన చేశారు.



బంపర్ ఆఫర్ కొట్టేసిన అంజలి.. పెద్ద సినిమాలో అవకాశం..!

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>