MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr--20c46de2-2fee-46b5-8e74-f1b0f8b55e69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr--20c46de2-2fee-46b5-8e74-f1b0f8b55e69-415x250-IndiaHerald.jpgటాలీవూడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ పేరుకి ఓ చరిత్ర ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ముందు కథానాయకుడిగా.. ఆ తర్వాత మహానాయకుడిగా ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఆయన ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ అని చెప్పాలి మరి.NTR {#}Makar Sakranti;January;history;Lavakusa;Maha;NTR;Tollywood;Cinemaఎన్టీఆర్ - ఏఎన్నార్ ని విడదీసిన సినిమా ఇదే..??ఎన్టీఆర్ - ఏఎన్నార్ ని విడదీసిన సినిమా ఇదే..??NTR {#}Makar Sakranti;January;history;Lavakusa;Maha;NTR;Tollywood;CinemaFri, 13 Aug 2021 07:10:00 GMTటాలీవూడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ పేరుకి ఓ చరిత్ర ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ముందు కథానాయకుడిగా.. ఆ తర్వాత మహానాయకుడిగా ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఆయన ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ అని చెప్పాలి మరి. అయితే మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు, ఇలా నాయకులు, ప్రతినాయకులు అందరూ ఎన్టీఆర్ లే. అంతేకాదు.. ఎన్టీఆర్ ని అభిమానిచ్చే వారికీ ఆయన ఒక్క యుగపురుషుడిలా కనిపిస్తూ ఉంటారు.

అయితే నందమూరి తారక రామారావు నతించిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అనే చెప్పాలి. ఇక సినీ ఇండస్ట్రీలో ఒక్క సంవత్సరం ఎన్టీఆర్ పని అయిపోయింది కొందరు అభిప్రాయానికి వచ్చారంట. కాగా.. అలాంటి వాళ్లకు చెంపపెట్టు గా తీసిన సినిమానే "దానవీరశూరకర్ణ". అంతేకాదు.. తాను తలుచుకుంటే ఎలాంటి సినిమాలు చేస్తాను అన్నదానికి ఇదే నిదర్శనం అని చెప్పాలి.

ఇక జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన దానవీరశూరకర్ణ టాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా.. ఎన్టీఆర్ దర్శకుడిగా, నిర్మాతగా ఉంటూ మూడు పాత్రలు వేస్తూ ప్రపంచంలో ఏ నటుడు చేయలేని సాహసం చేశారు. ఇక కేవలం 43 రోజుల్లోనే దానవీరశూరకర్ణ లాంటి అద్భుతాన్ని నిర్మించారు.

అంతేకాదు.. ఈ సినిమా కారణంగానే ఎన్టీఆర్- ఏఎన్నార్ విడిపోయారని అప్పట్లో టాక్ వినిపించింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో ఎన్టీఆర్- ఏఎన్నార్ ను మహా వీరుడు అయిన కర్ణ పాత్రను పోషించమని అడిగారట. దానికి ఏఎన్నార్ ఒప్పుకోలేదంట. అదికాక  కృష్ణుడి పాత్రను అయిన సరే పోషించమని అడిగితే అందుకు కూడా ఆయన ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి..మంచి స్నేహితులుగా ఉన్న ఎన్టీఆర్- ఏఎన్నార్ శత్రువులుగా మారిపోయారని అప్పట్లో టాక్ వినిపించింది. వీరిద్దరూ సుమారు 10 నుంచి 12 సంవత్సరాల తరువాత మళ్ళి కలిసిపోయారని సినీ ప్రముఖులు చెబుతుంటారు.



కొత్త జిల్లాల ఏర్పాటుపై వరంగల్‌లో డివైడ్‌ టాక్

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>