PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bi-pole-elections32e9446d-b84f-4c19-89fe-4c174b51d75d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bi-pole-elections32e9446d-b84f-4c19-89fe-4c174b51d75d-415x250-IndiaHerald.jpgగ‌త కొన్ని రోజుల నుంచి తెలంగాణ‌లో హుజురాబాద్ ఎన్నిక‌లపై ఉత్కంఠ నెల‌కొంది. అదిగో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి అన్న‌ట్టుగా అటు సోష‌ల్ మీడియా ఇటు ఎల‌క్ట్రానిక్ మీడియా ఊద‌ర‌గొట్టాయి. ఎవ‌రికి న‌చ్చిన తీరుగా వారు రాసుకున్నారు. ఎందుకంటే స్వేచ్ఛా దీనికి ముఖ్య కార‌ణం. దీనికి త‌గ్గ‌ట్టుగా పోటీలో ఉండే ఆయా పార్టీల అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క‌ట‌న కూడా చకా చ‌క్ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు, కొన్ని పార్టీలు త‌మ పార్టీ అభ్య‌ర్థిని కూడా ప్ర‌క‌టించాయి. అయితే, హుజురాబాద్ ఎన్నిక‌ల షెడ్యూలును ప్ర‌క‌టిస్తార‌ని అంతా హ‌డావుడbi pole elections{#}Election Commission;media;రాజీనామా;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;central government;Party;Huzurabadహుజురాబాద్ ఉప ఎన్నిక‌ల‌ ఆల‌స్యం ఎవ‌రికి అమృతం.. ఎవ‌రికి విషం..?హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల‌ ఆల‌స్యం ఎవ‌రికి అమృతం.. ఎవ‌రికి విషం..?bi pole elections{#}Election Commission;media;రాజీనామా;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;central government;Party;HuzurabadFri, 13 Aug 2021 14:42:20 GMT గ‌త కొన్ని రోజుల నుంచి తెలంగాణ‌లో హుజురాబాద్ ఎన్నిక‌లపై ఉత్కంఠ నెల‌కొంది. అదిగో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి అన్న‌ట్టుగా అటు సోష‌ల్ మీడియా ఇటు ఎల‌క్ట్రానిక్ మీడియా ఊద‌ర‌గొట్టాయి. ఎవ‌రికి న‌చ్చిన తీరుగా వారు రాసుకున్నారు. ఎందుకంటే స్వేచ్ఛా దీనికి ముఖ్య కార‌ణం. దీనికి త‌గ్గ‌ట్టుగా పోటీలో ఉండే ఆయా పార్టీల అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క‌ట‌న కూడా చకా చ‌క్ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు, కొన్ని పార్టీలు త‌మ పార్టీ అభ్య‌ర్థిని కూడా ప్ర‌క‌టించాయి.

 అయితే, హుజురాబాద్ ఎన్నిక‌ల షెడ్యూలును ప్ర‌క‌టిస్తార‌ని అంతా హ‌డావుడి చేశారు. ఎన్నిక‌ల‌కు వేళాయెరా.. అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ అంచ‌నాలు ఊహాగానాల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం నీళ్లు పోసింది. త్వ‌ర‌లో నిర్వ‌హించాల్సిన ఉప ఎన్నిక‌ల మీదా.. రానున్న కొద్ది నెల‌ల్లో జ‌ర‌గాల్సిన 5 రాష్ట్రాల ఉప ఎన్నిక‌ల మీద ఆయా పార్టీల అభిప్రాయాల్ని వెల్ల‌డించాల‌ని కోరుతూ తాజాగా ఈసీ దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆయా పార్టీల‌కు లేక రాసింది. దీంతో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల నిర్వ‌హ‌ణ రెండూ ఆల‌స్యం కానున్నాయ‌ని ఎన్నిక‌ల సంఘం ప‌రోక్షంగా సంకేతాలిచ్చింది.

  ఎన్నిక‌ల ఆల‌స్యం కొంద‌రికి ప్ల‌స్‌, కొందరికి మైన‌స్ కానుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ప్ర‌ధానంగా ఈట‌ల వ‌ర్సెస్ టీఆర్ఎస్ పోటీ న‌డుస్తోంది. అయితే ఈట‌ల ఆత్మ‌గౌర‌వం పేరుతో టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్య‌మ‌యింది. ఇదే ఊపులో ఈట‌ల ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టాడు. ఆత్మ‌గౌరవం, టీఆర్ఎస్ ఉన్న వ్య‌తిరేక‌త ఈట‌ల‌కు బ‌లం కానుంది. కానీ ఎన్నిక‌లు త్వ‌ర‌గా జ‌రిగే ఈ సెంటిమెంట్ ఈట‌ల‌కు అమృతంగా మారుతుంది. ఎన్నిక‌లు ఆల‌స్య‌మ‌యితే అధికార పార్టీ వ్యూహ‌ల‌తో ఈట‌ల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.


  నిజానికి చెప్పాలంటే అధికార టీఆర్ఎస్‌కు ఎన్నిక‌లు ఎంత ఆల‌స్య‌మ‌యితే అంత మంచిది. ఎందుకంటే ప్ర‌త్య‌ర్థుల‌ను త‌మ ప్ర‌భుత్వ వ్యూహాలు, ప‌థ‌కాలు, స్కీమ్ ల‌తో ఎలా ఉక్కిరి బిక్కిరిచేయాల‌నే ఆలోచ‌న‌కు స‌మ‌యం దొరుకుతుంది. మెల్ల‌మెల్ల‌గా ఈట‌ల సెంటిమెంట్‌ను ప్ర‌జ‌లు మ‌ర్చిపోయే అవ‌కాశం ఉంది. అదే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం హుజురాబాద్ ఎన్నిక‌ను నిర్వ‌హిస్తే మిగ‌తా ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది.  దీంతో ఆచి తూచి ఆలోచ‌న చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. అయితే, ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ఎలాంటి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చేందుకు అవ‌కాశం లేదు. మొత్తంగా చూసుకుంటే ఉప ఎన్నిక‌ల ఆల‌స్యం వ‌ల్ల కొన్ని పార్టీల‌కు సానుకూలంగా, కొన్ని పార్టీల‌కు ప్ర‌తికూలంగా మారే అవ‌కాశం ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.










చిరు రికార్డ్ బ్రేక్ చేసిన బాలీవుడ్ హీరో ఎవరంటే?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!

75వ పంద్రాగస్టు : భారతీయత - భారతీయుడు గొప్పోడే, మరి తప్పెవరిది?

రేవంత్‌ కోవర్ట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>