BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag15e687a4-cb90-4ff5-bb9f-ab6b60d11c68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag15e687a4-cb90-4ff5-bb9f-ab6b60d11c68-415x250-IndiaHerald.jpg శ్రీ‌కాకుళం జిల్లా కొత్తూరు మండ‌లం పొనుటూరులో విషాద సంఘ‌ట‌న జ‌రిగింది. పొలంలోకి అడ‌వి పందులను నిరోధించ‌డం కోసం వేసిన విద్యుత్తు వైర్లు త‌గిలి ఇద్ద‌రు యువ‌కులు మ‌ర‌ణించారు. వీరిని కొత్త‌గూడ గ్రామానికి చెందిన విలియం, ఆకాష్‌గా గుర్తించారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శ్రీ‌కాకుళం ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. జిల్లాలో అడ‌విపందుల‌వ‌ల్ల పొలాల్లో వేసిన పంట‌లు ధ్వంస‌మైపోతున్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌తోపాటు అట‌వీ శాఖాధికారుల‌కు కూడా రైతtag{#}Postmortem;akash;police;Districtఅయ్యో పాపం.. శ్రీ‌కాకుళంలో విషాదం!అయ్యో పాపం.. శ్రీ‌కాకుళంలో విషాదం!tag{#}Postmortem;akash;police;DistrictFri, 13 Aug 2021 09:44:00 GMT
శ్రీ‌కాకుళం జిల్లా కొత్తూరు మండ‌లం పొనుటూరులో విషాద సంఘ‌ట‌న జ‌రిగింది. పొలంలోకి అడ‌వి పందులను నిరోధించ‌డం కోసం  వేసిన విద్యుత్తు వైర్లు త‌గిలి ఇద్ద‌రు యువ‌కులు మ‌ర‌ణించారు. వీరిని కొత్త‌గూడ గ్రామానికి చెందిన విలియం, ఆకాష్‌గా గుర్తించారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శ్రీ‌కాకుళం ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. జిల్లాలో అడ‌విపందుల‌వ‌ల్ల పొలాల్లో వేసిన పంట‌లు ధ్వంస‌మైపోతున్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌తోపాటు అట‌వీ శాఖాధికారుల‌కు కూడా రైతులు ఎన్నోసార్లు విన్న‌వించారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫు నుంచి ఎటువంటి చ‌ర్య‌లు లేక‌పోవ‌డంతో పంట‌ను కాపాడుకోవ‌డానికి రైతులే త‌మ పొలాల్లో అడ‌వి పందులు రాకుండా అడ్డుగా విద్యుత్తు వైర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే విద్యుత్తు స‌ర‌ఫ‌రా స‌మ‌యంలో వేళ‌లు కూడా క్ర‌మ‌ప‌ద్ధ‌తి ప్ర‌కారం లేక‌పోవ‌డంతో విద్యుత్తు స‌ర‌ఫ‌రా ఉన్న‌ప్పుడు మ‌నుషులు కూడా వీటిబారిన ప‌డిన సంఘ‌ట‌న‌లు గ‌తంలో ఎన్నో జ‌రిగాయి. తాజాగా కొత్త‌గూడ‌కు చెందిన విలియం, ఆకాష్ కూడా మృతిచెంద‌డం అంద‌రినీ క‌లిచివేస్తోంది.






రెండు గుంటలు వర్సెస్‌ 2 వేల ఎకరాలు...గెలుపు ఎవరది ?

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>