PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/telangana7e6afb6b-cda0-4161-827b-dad29d850d92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/telangana7e6afb6b-cda0-4161-827b-dad29d850d92-415x250-IndiaHerald.jpgతెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షాను గవర్నర్‌ కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులను ప్రధాని, హోం మంత్రికి తమిళిసై వివరించారు. తాను రాసిన 'పీఎం అండ్ పీఎం' పుస్తకాన్ని గవర్నర్‌ ప్రధానికి అందజేశారు. వాటిలో తానూ ప్రత్యక్షంగా చూసిన అనుభవాలను పొందుపరిచారు. రెండ్రోజుల పర్యటనలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని గవర్నర్‌ కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. కోవిడ్ విపత్కర సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అన్నtelangana{#}Tamilisai Soundararajan;Mandula;Prime Minister;war;oxygen;Narendra Modi;students;Telangana;Delhi;Varsham;Minister;Coronavirusకేసీఆర్ సర్కార్ పై గవర్నర్ ఫిర్యాదు?కేసీఆర్ సర్కార్ పై గవర్నర్ ఫిర్యాదు?telangana{#}Tamilisai Soundararajan;Mandula;Prime Minister;war;oxygen;Narendra Modi;students;Telangana;Delhi;Varsham;Minister;CoronavirusFri, 13 Aug 2021 09:23:27 GMTతెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పర్యటనలో ప్రధాని  మోడీ, హోం మంత్రి అమిత్‌ షాను గవర్నర్‌ కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులను ప్రధాని, హోం మంత్రికి తమిళిసై వివరించారు.  తాను రాసిన 'పీఎం అండ్ పీఎం' పుస్తకాన్ని గవర్నర్‌ ప్రధానికి అందజేశారు. వాటిలో తానూ ప్రత్యక్షంగా చూసిన అనుభవాలను పొందుపరిచారు. రెండ్రోజుల   పర్యటనలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని గవర్నర్‌ కలిశారు.  ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. కోవిడ్ విపత్కర సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహకారం అందిందని...ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రం సమర్థవంతంగా అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.  

మందుల సరఫరా, ఆక్సిజన్ సరఫరా అన్ని విషయాలను కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సహాయ సహకారాలు అందించిందని కొనియాడారు. అయితే.. ఈ పర్యటనలో తెలంగాణ సర్కార్‌ పై పొగడ్తల వర్షం కురిపించారు గవర్నర్‌. తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ ను ఎదుర్కోవడంలో సమర్థంగా పని చేసిందని చెప్పిన గవర్నర్‌... రాష్ట్రప్రభుత్వం వ్యాక్సినేషన్ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. కరోనాను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసిందని... హైటెక్ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానాన్ని అనుభవాన్ని పుదుచ్చేరిలో ఉపయోగించుకున్నామని... తెలంగాణ పుదుచ్చేరి మధ్య మంచి  అనుబంధాన్ని ఏర్పడటానికి ఈ కార్యక్రమం తోడ్పడిందని వివరించారు.

 రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలను పూర్వ విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నామని.. తాము చదువుకున్న యూనివర్సిటీలకు పూర్వ విద్యార్థులు ఏదో రూపంలో సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు గవర్నర్‌.  రాష్ట్రంలోనీ గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పిన గవర్నర్‌... ఇందులో భాగంగానే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని వెల్లడించారు. అయితే.. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్‌ తెలంగాణ సర్కార్‌ పై ఎదైనా... ఫిర్యాదు చేస్తారని అందరూ భావించినా... గవర్నర్‌ మాత్రం పొగడ్తల వర్షం కురిపించింది. కరోనా విషయంలో తెలంగాణ సర్కార్‌ విఫలమైందని ప్రతిపక్షాలు అంటుంటే.. గవర్నర్‌ మాత్రం గొప్పలు చెప్పడం మరో రాజకీయ చర్చకు తెరలేపింది. అయితే.. ఇవన్నీ కేసీఆర్‌-మోడీ మధ్య రహస్య ఒప్పందాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  





అయ్యో పాపం.. శ్రీ‌కాకుళంలో విషాదం!

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>