CrimeVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/dead-da781efe-f2e1-4630-a9a1-7c943d5cc07a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/dead-da781efe-f2e1-4630-a9a1-7c943d5cc07a-415x250-IndiaHerald.jpgఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌... మత్తెక్కించి.. ముగ్గులోకి దించే ముదనష్టపు బ్యాచ్‌... ఆ తర్వాత అసలు రంగు బయటపెట్టి డబ్బుకోసం కాల్చుకుతింటారు. పరువు తీస్తామని బెదిరించి ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల మరీ శృతిమించిపోయాయి. ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్‌ యవతులకు కొందరు డబ్బు ఇచ్చి వ్యవహారాలు సెటిల్‌ చేసుకుంటే మరికొందరు పరువు పోతుందని ప్రాణాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ లంగర్‌ హౌజ్‌కు చెందిన యువకుడు ఇలాగే బలైపోయాడు. డేటింగ్‌ యాప్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు 24 ఏళ్ల యువకుడు తర్వాత వ్యవహారంcrime{#}Shruti;naina;sruthi;police;Kurradu;Uriయువతితో యువకుడు నగ్నంగా వీడియో కాల్స్...చివరికి?యువతితో యువకుడు నగ్నంగా వీడియో కాల్స్...చివరికి?crime{#}Shruti;naina;sruthi;police;Kurradu;UriFri, 13 Aug 2021 08:47:43 GMTఆన్‌ లైన్‌ డేటింగ్‌ యాప్‌... మత్తెక్కించి.. ముగ్గులోకి దించే ముదనష్టపు బ్యాచ్‌... ఆ తర్వాత అసలు రంగు బయట పెట్టి డబ్బు కోసం కాల్చుకు తింటారు. పరువు తీస్తామని బెదిరించి ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల మరీ శృతి మించి పోయాయి.  ఇలాంటి బ్లాక్‌ మెయిలింగ్‌ యవతులకు కొందరు డబ్బు ఇచ్చి వ్యవహారాలు సెటిల్‌ చేసుకుంటే మరికొందరు పరువు పోతుందని ప్రాణాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ లంగర్‌ హౌజ్‌ కు చెందిన యువకుడు ఇలాగే బలైపోయాడు.  

డేటింగ్‌ యాప్‌ లో ఓ యువతి తో పరిచయం పెంచుకున్నాడు 24 ఏళ్ల యువకుడు తర్వాత వ్యవహారం వీడియో కాల్స్‌ వరకు వెళ్లింది. ఈ క్రమం లో ఆమె తో న్యూడ్‌ గా మాట్లాడేవాడు. అయితే వీడియోలన్నీ రికార్డ్‌ చేసిన ఆ డేటింగ్‌ ఫిమేల్‌ కోబ్రా... డబ్బు కోసం బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో తన వద్ద ఉన్నదంతా ఊడ్చి ఆమెకు ఇచ్చాడు. అయినా ఆ రాక్షసి బెదిరింపులు ఆగలేదు.  ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో చివరకు ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రాడు చనిపోవడం తో కుటుంబం తీవ్ర విషాదం లో మునిగిపోయింది.  వివరాలు సేకరించిన క్రైమ్ పోలీసులు బ్లాక్‌ మెయిలర్‌ కోసం ఆరా తీస్తున్నారు. అసలు ఆ యువతి తో ఎలా పరిచయం అయింది... ఎందుకు ఆ యువకున్నే ఆ యువతి టార్గెట్‌ చేసింది ? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  ఇంకా ఆ యువతి.. ఎవరిని టార్గెట్ చేసిందనే కోణం లోనూ దర్యాప్తు చేస్తున్నారు.  ఇలాంటి యాప్‌ల పట్ల యువకులు అప్రమత్తంగా ఉండాలని... లేదంటే అనర్ధాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక నైనా యువత ఇలాంటి... మోసాలకు పాల్పడవద్దని చెబుతున్నారు.



బోల్ ఇండియా - విద్యలో రాజకీయం 100%, రాజకీయంలో విద్యా 0 %

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>