MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sravanamasama47b45ae-63fb-4d81-b66d-e50abc215d91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sravanamasama47b45ae-63fb-4d81-b66d-e50abc215d91-415x250-IndiaHerald.jpgభారత హిందూ శాస్త్ర ప్రకారం తెలుగు క్యాలెండర్ లో ఒక్కో నెల ఒక్కో ప్రాముఖ్యత, విశిష్టత ను కలిగి ఉండడం విశేషం.. చైత్రమాసంతో ప్రారంభం అయ్యే తెలుగు నెల క్యాలెండర్, ఉగాది పండుగతో తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇక తర్వాత వెంటనే శ్రీరామనవమిని జరుపుకొని ,హిందువులు పెళ్లి శుభకార్యాలను జరపడానికి సిద్ధం అవుతారు. ఇక పెళ్లిళ్లు అయినా ఎంతో మంది ఆడపిల్లలు ఆషాడమాసంలో అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరుతారు. ఇక ఆషాడమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం మొదట్లోనే ఆడవారు తమ అత్తవారింటికి చేరుకుంటారు. కార్తీకమాసంలో సోమవారSRAVANAMASAM{#}naga;monday;sun;tuesday;prema;Husband;Telugu;Love;marriageశ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?SRAVANAMASAM{#}naga;monday;sun;tuesday;prema;Husband;Telugu;Love;marriageThu, 12 Aug 2021 09:22:58 GMTభారత హిందూ శాస్త్ర ప్రకారం తెలుగు క్యాలెండర్ లో ఒక్కో నెల ఒక్కో ప్రాముఖ్యత, విశిష్టత ను కలిగి ఉండడం విశేషం.. చైత్రమాసంతో ప్రారంభం అయ్యే తెలుగు నెల క్యాలెండర్, ఉగాది పండుగతో తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇక తర్వాత వెంటనే శ్రీరామనవమిని జరుపుకొని ,హిందువులు పెళ్లి శుభకార్యాలను జరపడానికి సిద్ధం అవుతారు. ఇక పెళ్లిళ్లు అయినా ఎంతో మంది ఆడపిల్లలు ఆషాడమాసంలో అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరుతారు. ఇక ఆషాడమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం మొదట్లోనే ఆడవారు తమ అత్తవారింటికి చేరుకుంటారు. కార్తీకమాసంలో సోమవారం ఎంత పవిత్రతను సంతరించుకుంటుందో, శ్రావణ మాసంలో మంగళవారం , శుక్రవారాలు కూడా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.


శ్రావణమాసం లక్ష్మీపార్వతిలకు అంత ప్రీతికరమైనది. ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ముత్తయిదువులు గౌరీమాతను పూజిస్తూ ఉంటారు. మంగళగౌరీ వ్రతంలో భాగంగానే ఎన్నో వ్రతాలు, నోములు చేపడుతూ ఉంటారు. సంతాన, సౌభాగ్యాలను ఆ తల్లి కాపాడుతుందని ఆడవారి నమ్మకం. ఈ శ్రావణ మాసాన్ని నవో మాసం అని కూడా అంటారు. నవో అనగా ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, నాగ చతుర్థి, ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహజయంతి వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా.. మనఃకారకుడు అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసము అనీ, ఈ మాసంలో సూర్యుడు సంచరించి నక్షత్రాల ప్రభావం మూలకంగా మన మీద ప్రభావం చూపుతుంది . తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందట.


ఇక కొత్తగా పెళ్లైన కోడళ్ళ చేత అత్తవారు ఈ గౌరీ వ్రతాన్ని చేయిస్తారు. ఈ గౌరీ వ్రతం చేయడం వల్ల సంతానం, సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు, అత్తమామల ఆశీర్వాదం ఎల్లవేళలా కలుగుతుందట. అంతేకాదు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఇంటి ఆడవారు ఇంట్లో ఉన్న అత్తమామల మీద, భర్త మీద ,సంతానం మీద ఎంత  ప్రేమ చూపిస్తే,  లక్ష్మీదేవి అంత కటాక్షాన్ని చూపిస్తుందట. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోయి, ఇంట్లో అంతా ప్రశాంతత వాతావరణం నెలకొంటుందని ఆనాటి పెద్దలు ఆలోచన..

ఇక పురాణకాలంలో ఒకసారి చారుమతి అనే ఒక మహిళ అందరితో అనుకువుగా ,ఇంటికొచ్చిన బంధుమిత్రులతో స్నేహపూర్వకంగా, అత్తమామలతో గౌరవంగా కొనసాగింది. కాబట్టి ఆమెను లక్ష్మీదేవి కటాక్షించిందని, అందుకే ఆ రోజు నుంచి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి గౌరీ పూజ చేయాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. మహిళలు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మసలు కోవడం వల్ల ఐశ్వర్యాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయట.



వర్కౌట్ విషయంలో రష్మికని మించిన సమంత..?

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>