PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-new-cabinet-expansion19f2ff68-8150-4482-bd35-b7080e23fb06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-new-cabinet-expansion19f2ff68-8150-4482-bd35-b7080e23fb06-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ప్రజల్లో ఇప్పటికే పేరును తెచ్చుకున్నాడు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తూ చా తప్పకుండా నెరవేరుస్తూ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన ముద్ర వేయాలని ఎన్నో నూతన విధానాలను తీసుకొచ్చాడు. AP-NEW-CABINET-EXPANSION{#}dr rajasekhar;Chevireddy Bhaskarareddy;Nellore;Andhra Pradesh;Reddy;News;Chittoor;Minister;Jagan;YCPఏపీ న్యూ క్యాబినేట్: ఆశావహులకు నిరాశ తప్పదా ?ఏపీ న్యూ క్యాబినేట్: ఆశావహులకు నిరాశ తప్పదా ?AP-NEW-CABINET-EXPANSION{#}dr rajasekhar;Chevireddy Bhaskarareddy;Nellore;Andhra Pradesh;Reddy;News;Chittoor;Minister;Jagan;YCPThu, 12 Aug 2021 20:58:00 GMTజగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ప్రజల్లో ఇప్పటికే పేరును తెచ్చుకున్నాడు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తూ చా తప్పకుండా నెరవేరుస్తూ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన ముద్ర వేయాలని ఎన్నో నూతన విధానాలను తీసుకొచ్చాడు. ఇందులో భాగంగానే నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం రోజునే అందరి మంత్రుల చేత కేవలం రెండున్నరేళ్ల వరకే వారి పదవీకాలం ఉంటుందని పత్రమును తీసుకున్నారని తెలిసింది. ఆ దశ రానే వచ్చింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నందున మంత్రి వర్గ విస్తరణను త్వరలోనే చేపట్టనున్నారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఉన్న మంత్రులలో దాదాపుగా 18 మంది మంత్రి పదవులను కోల్పోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అందరి మంత్రులలో వణుకు మొదలైంది. మొదటి మంత్రి విస్తరణలో ఎలాగయితే సామాజికవర్గాలను అనుసరించి కేటాయింపులు చేశారో ఇప్పుడు అదే విధంగా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. వీరిలో ఆ 18 మంది మంత్రులెవరనే విషయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఇప్పటికే మంత్రులుగా ఉన్న వారిలో కొంతమంది సేఫ్ అవుతున్నట్లు తెలిసిందే. కాబట్టి వాళ్ళు తల కింద గుడ్డేసుకుని పడుకోవచ్చు. అయితే కొత్త వారిని ఎవరిని తీసుకుంటారనే దానిపై ఇప్పటికే కొన్ని లీక్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వారికి కూడా ఆల్రెడీ సమాచారం అందిందని వార్త. మొదటి మంత్రివర్గ కూర్పు సమయం నుండి కొంత మంది ఆశావహులు ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు.

కానీ వారిలో కొంతమందికి మంత్రి పదవి దక్కినా మరి కొంత మందికి మళ్ళీ మొండిచేయే అని ప్రముఖుల వాదన. వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారున్నారు. వీరికి రెడ్డి సామాజికవర్గమే అడ్డుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే వారి జిల్లాలలో రెడ్డి మంత్రులు కొనసాగుతుండడంతో వీరికి భంగపాటు తప్పేలా లేదు. మరి జగన్ ఈ సారి కూడా మంత్రివర్గ విస్తరణలో తన మార్క్ చూపిస్తారా లేదా భారీ మార్పులేమైనా ఉంటాయా అన్నది చూడాలి.





అయిదేళ్ళూ ఈ మంత్రులేనా ?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>