PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/isro0e367d37-371e-40d2-b7a9-399281c51be6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/isro0e367d37-371e-40d2-b7a9-399281c51be6-415x250-IndiaHerald.jpgభారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రోకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్రో జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌.. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగంలో మరోసారి విఫలమైంది. ఈ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో జరిగిన జీఎస్‌ఎల్వీ ఎఫ్‌10 ప్రయోగం విఫలమైంది. రాకెట్‌ ప్రయోగం నింగిలోకి బాగానే ఎగసినా.. క్రయోజనిక్‌ దశలో రాకెట్‌లో సమస్య తలెత్తింది. ఈ లోపం కారణంగా వాహకనౌక ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో ప్రయాణించింది. ఈ ప్రయోగం విఫలమైనట్టు ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ప్రకటించారు. మూడో దశలో సాంకేతిక సమసisro{#}history;Nellore;ISROభారత్‌ కు బిగ్ షాక్.. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగం విఫలంభారత్‌ కు బిగ్ షాక్.. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగం విఫలంisro{#}history;Nellore;ISROThu, 12 Aug 2021 07:00:00 GMTభారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రోకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్రో జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌.. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగంలో మరోసారి విఫలమైంది. ఈ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో జరిగిన జీఎస్‌ఎల్వీ ఎఫ్‌10 ప్రయోగం విఫలమైంది. రాకెట్‌ ప్రయోగం నింగిలోకి బాగానే ఎగసినా.. క్రయోజనిక్‌ దశలో రాకెట్‌లో సమస్య తలెత్తింది. ఈ లోపం కారణంగా వాహకనౌక ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో ప్రయాణించింది.


ఈ ప్రయోగం విఫలమైనట్టు ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ప్రకటించారు. మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఆయన వివరించారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌నుంచి ఈ ఉదయం 5.43 గంటలకు ఈ జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10ని ప్రయోగించారు. దీని కోసం మొన్న ఉదయం 3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. 26 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత జీఎస్‌ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్‌ క్రయోజెనిక్‌ దశలో సమస్య తలెత్తింది.. చివరకు ప్రయోగం విఫలమైంది.    


జీఎస్‌ఎల్వీ ప్రయోగాల్లో ఇప్పటికీ ఇస్రో తడబడుతూనే ఉంది. పీఎస్‌ఎల్వీ ప్రయోగాల్లో ఎదురులేని ఇస్రో జీఎస్‌ఎల్వీ ప్రయోగాల్లో మాత్రం సత్తా చాటలేకపోతోంది. ఈ జీఎస్‌ఎల్వీ రాకెట్ జీఐశాట్‌-1 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టాలని ఇస్రో భావించింది. ఈ జీఐశాట్‌-1 ఉప గ్రహం ద్వారా భూపరిశీలన అంశాలను తెలుసుకోవాలని ఇస్రో ప్రణాళిక సిద్దం చేసింది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాల విజయవంతంలో భారత్‌కు ఘనమైన చరిత్ర ఉన్నా.. జీఎస్‌ఎల్వీ ప్రయోగాల విషయంలో మాత్రం ఇస్రోకు ఇబ్బందులు తప్పడం లేదు.


మరి జీఎస్‌ఎల్వీ ప్రయోగాల్లో ఇస్రో ఎందుకు విఫలం అవుతోంది.. పీఎస్‌ఎల్వీల్లో ఎందుకు సక్సస్ అవుతోంది. ఈ విషయాలను పరిశీలిస్తే.. జీఎస్‌ఎల్వీలో వేల కిలోల ప్లేలోడ్‌లను భూ స్థిర కక్ష్యలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం క్రయోజనిక్ ఇంజిన్‌ ను వాడతారు. ఈ క్రయోజనిక్‌ టెక్నాలజీలో ఇంకా ఇస్రో రాటు దేలాల్సి ఉంది.  ఇస్రో తర్వలోనే ఈ లోపాన్ని అధిగమించాలని ఆశిద్దాం.



మ‌రో మూడున‌గ‌రాల్లో సుప్రీం ధ‌ర్మాస‌నాలు?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>