MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/look-at-the-star-image-songs-that-cant-be-hit-b6f2ca96-c870-468d-a2fc-af9f4779fcea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/look-at-the-star-image-songs-that-cant-be-hit-b6f2ca96-c870-468d-a2fc-af9f4779fcea-415x250-IndiaHerald.jpgఎంత చక్కగా తీసినా.. సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలి. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా తన ప్రతిభను నిరూపించుకోవాలి. ఏ మాత్రం ఫ్లాప్ వచ్చినా.. వెనుకబడిపోవడం ఖాయం. అందుకే స్టార్ డైరెక్టర్లు సక్సెస్ కోసం ఆరాటపడతారు. ప్రేక్షకులు మాత్రం అలాంటి దర్శకుల సినిమాలు ఎప్పుడొస్తాయా అని ఆరాటపడతారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో అపార ప్రతిభ చూపిన దర్శకులు.. హిట్‌ కోసం ఆరాటపడుతున్నారు. Look at the star image Songs that cant be hit {#}Mani Ratnam;Ram Gopal Varma;maya;Prize;lord siva;Shiva;Indian;Audience;Cinemaస్టార్ ఇమేజ్ ఉన్నోళ్లు..! హిట్ కోసం పడరాని పాట్లు..!స్టార్ ఇమేజ్ ఉన్నోళ్లు..! హిట్ కోసం పడరాని పాట్లు..!Look at the star image Songs that cant be hit {#}Mani Ratnam;Ram Gopal Varma;maya;Prize;lord siva;Shiva;Indian;Audience;CinemaThu, 12 Aug 2021 13:00:00 GMTఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీలో పెద్ద హిట్ లే సాధించారు. ఆయన తీసిన శివ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు మళ్లీ ఆ రేంజ్ లో సినిమాలు తీస్తామోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఒక సినిమాతో కాకపోయినా మరో సినిమాతో అయినా సర్ ప్రైజ్ చేస్తాడోమోనని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ అనుకున్నదొకటి జరుగుతుంది మరొకటి అవుతోంది. వర్మ మాత్రం కాంట్రవర్శీలతోనే గడిపేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అభిమానులని మెప్పించి చాలా ఏళ్లు అవుతోంది. 'రక్తచరిత్ర' తర్వాత వర్మ క్రేజ్ నెమ్మదిగా పడిపోతూ వస్తోంది. ఇక 'గాడ్‌ సెక్స్‌ ట్రూత్, నేక్డ్, థ్రిల్లర్‌' లాంటి సినిమాలు తీశాక వర్మపై విమర్శలు ఎక్కువయ్యాయి. బూతుని అమ్ముకుంటున్నాడని ట్రోల్ కూడా చేశారు నెటిజన్లు. దీంతో రామ్ గోపాల్ వర్మ హిట్స్ కోసం ఆరాటపడుతున్నారు.

ఇక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మణిరత్నం స్టైల్‌కి యూనిక్‌ ఇమేజ్ ఉంది. హీరోతో సంబంధం లేకుండా మణిరత్నం పేరు చూసి సినిమాకి వెళ్లే ఆడియన్స్‌ లక్షల్లో ఉన్నారు. అయితే ఈ మధ్య ఆ లక్షలమంది ఫాన్స్‌ని మెప్పించలేకపోతున్నాడు మణిరత్నం. ఒకప్పుడు వరుస హిట్స్‌తో బాక్సాఫీస్‌కి ఎనర్జీ ఇచ్చిన ఈ క్రియేటివ్ మేకర్ ఇప్పుడు కంపల్సరీగా హిట్‌ కొట్టాల్సిన పరిస్థితిలో పడిపోయాడు. మణిరత్నం 'యువ' వరకు పీక్స్‌లోనే ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన 'గురు, రావణ్, కడల్' అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మధ్యలో 'ఓకే బంగారం'తో ఓకే అనిపించుకున్నా మునుపటి రేంజ్‌లో మాయ చేయలేకపోతున్నాడు. పైగా 'చెలియా, నవాబ్' సినిమాలు కూడా ఆడియన్స్‌ని అంతగా ఆకట్టుకేలేదు.

మణిరత్నం రీసెంట్‌గా 'నవరస' అనే వెబ్‌ సీరీస్‌ నిర్మించాడు. తొమ్మిది కథలతో వచ్చిన ఈ 'నవరస' ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.  దీంతో ఈ దర్శకుడి ఇమేజ్ పడిపోతోంది. మళ్లీ నిలదొక్కుకోవడానికి ఆరాటపడుతున్నాడు.  తాజాగా 'పొన్నియన్ సెల్వన్' అనే హిస్టారికల్ డ్రామా తీస్తున్నాడు. మరి దాదాపుగా 500 కోట్ల బడ్జెట్‌తో భారీగా రూపొందుతోన్న ఈ సినిమాతో అయినా మణిరత్నం బౌన్స్‌ బ్యాక్ అవుతాడా అనేది చూడాలి.





ఈ బాల నటి తండ్రి టాలీవుడ్ టాప్ విలన్..??

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>