MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shilpa-shetty-6990f645-0c3c-4692-bff4-2942cca0544e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shilpa-shetty-6990f645-0c3c-4692-bff4-2942cca0544e-415x250-IndiaHerald.jpgశిల్పా శెట్టి కష్టాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. శిల్పాశెట్టి, ఆమె తల్లి సునంద శెట్టి ఉత్తర ప్రదేశ్‌లో వెల్‌నెస్ వ్యాపారం మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లక్నోలో నమోదైన రెండు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుల (ఎఫ్ఐఆర్)పై దర్యాప్తు చేయాలని పోలీసులు ఆలోచిస్తున్నారట. ఒమాక్స్ హైట్స్ నివాసి జ్యోత్స్న చౌహాన్, మరొక వ్యక్తి రోహిత్ వీర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్, హజ్రత్‌గన్‌లో కేసులు నమోదు చేశారు. లక్నో పోలీసుల బృందం మోసం కేసులో తల్లీ కూతుళ్లను ప్రశ్నించడానికి ముంబైకి వShilpa Shetty;{#}jyotsna;shilpa;Veer Singhh;Lucknow;Nijam;kiran;Traffic police;Mumbai;policeశిల్పా శెట్టికి మరో దెబ్బ... ముంబైకి లక్నో పోలీసులు !శిల్పా శెట్టికి మరో దెబ్బ... ముంబైకి లక్నో పోలీసులు !Shilpa Shetty;{#}jyotsna;shilpa;Veer Singhh;Lucknow;Nijam;kiran;Traffic police;Mumbai;policeThu, 12 Aug 2021 17:11:03 GMTశిల్పా శెట్టి కష్టాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. శిల్పాశెట్టి, ఆమె తల్లి సునంద శెట్టి ఉత్తర ప్రదేశ్‌లో వెల్‌నెస్ వ్యాపారం మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లక్నోలో నమోదైన రెండు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుల (ఎఫ్ఐఆర్)పై దర్యాప్తు చేయాలని పోలీసులు ఆలోచిస్తున్నారట. ఒమాక్స్ హైట్స్ నివాసి జ్యోత్స్న చౌహాన్, మరొక వ్యక్తి రోహిత్ వీర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్, హజ్రత్‌గన్‌లో కేసులు నమోదు చేశారు. లక్నో పోలీసుల బృందం మోసం కేసులో తల్లీ కూతుళ్లను ప్రశ్నించడానికి ముంబైకి వెళ్తున్నట్టు సమాచారం. శెట్టి ద్వయం కోసం రెండు పోలీస్ స్టేషన్లు విచారణ కోసం ఇప్పటికే నోటీసులు పంపాయట. కానీ ఈ వార్తలన్నీ అవాస్తవం అంటున్నారు ఆ సంస్థ ఛైర్‌పర్సన్.

అయితే "ఐఓఎస్ఐఎస్"  వెల్నెస్ సెంటర్‌కి ఈ తల్లీ కూతుళ్ళకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ ఛైర్‌పర్సన్ కిరణ్ బావా తన సోషల్ మీడియాలో ధృవీకరించారు. ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందుతున్నవి నిరాధారమైన పుకార్లు అని, శిల్పా శెట్టి, ఆమె తల్లిపై కేసు నమోదు అయ్యిందనే దారుణమైన కథనాలలో నిజం లేదని వెల్లడించారు.

శిల్పా శెట్టి, ఆమె తల్లి చాలా కాలం క్రితం తన కంపెనీతో స్నేహపూర్వకంగా విడిపోయారని కిరణ్ బావా స్పష్టం చేశారు. 'అవమానకరమైన కంటెంట్' తన బ్రాండ్ సద్భావనను దెబ్బతీస్తుందని కూడా అన్నారు.

"ఐఓఎస్ఐఎస్" స్పా & వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా నేను ఈ పోస్ట్‌ని చేస్తున్నాను. దయచేసి దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయండి. పోస్ట్ చేసే ముందు వాస్తవాలను తెలుసుకోండి. "శ్రీమతి శిల్పా శెట్టి, ఆమె తల్లి శ్రీమతి సునంద శెట్టికి ఐఓఎస్ఐఎస్ తో ఎలాంటి సంబంధం లేదు. మేము చాలా కాలం క్రితం స్నేహపూర్వకంగా విడిపోయాము. కాబట్టి దయచేసి పుకార్లను వ్యాప్తి చేయడం మానేయండి. నేను సింగిల్ పేరెంట్ ని. కష్టపడి పనిచేసే ప్రొఫెషనల్. ఐఓఎస్ఐఎస్ నా బిడ్డ, నేను సంవత్సరాలుగా నిర్మించిన బ్రాండ్. సంబంధిత అధికారులతో వాస్తవాలను నిర్ధారించడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనిపై అప్పటివరకు చేసిన పోస్టులను తొలగించాలని నేను వినయంగా కోరుతున్నాను, ఎందుకంటే ఈ విషయం బొంబాయి హైకోర్టులో ఉంది. ఇక్కడ మాకు అనుకూలంగా ఆదేశాలు ఉన్నాయి" అంటూ పోస్ట్ చేశారు.