PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/huzurabad-ktr-faraway-reason61d6b412-05fe-4f70-9b3b-4aa590bde0db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/huzurabad-ktr-faraway-reason61d6b412-05fe-4f70-9b3b-4aa590bde0db-415x250-IndiaHerald.jpgతెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి కేటీఆర్‌ వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఉన్న ఆయన.. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా అక్కడ పార్టీ గెలుపు బాధ్యతలను తీసుకోవాలి. అయితే ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉపఎన్నికకు కేటీఆర్‌ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. మెదక్ జిల్లా మంత్రి అయిన హరీష్ రావుకు కేసీఆర్ హుజురాబాద్ బాధ్యతలు అప్పగించారు. హుజూరాబాద్‌లో పార్టీ గెలుపు కోసం మొన్నటివరకు తెరవెనుక పనిచేసిన హరీష్ రావు ఇప్పుడు నేరుగానే రంగంలోకి దిగారుhuzurabad ktr faraway reason{#}KTR;Medak;Chakram;Kanna Lakshminarayana;Eatala Rajendar;KCR;Telangana Rashtra Samithi TRS;Party;Minister;CMహుజూరాబాద్‌కు కేటీఆర్‌ దూరం అందుకేనా?హుజూరాబాద్‌కు కేటీఆర్‌ దూరం అందుకేనా?huzurabad ktr faraway reason{#}KTR;Medak;Chakram;Kanna Lakshminarayana;Eatala Rajendar;KCR;Telangana Rashtra Samithi TRS;Party;Minister;CMThu, 12 Aug 2021 10:51:00 GMTతెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి కేటీఆర్‌ వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఉన్న ఆయన.. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా అక్కడ పార్టీ గెలుపు బాధ్యతలను తీసుకోవాలి. అయితే ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉపఎన్నికకు కేటీఆర్‌ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. మెదక్ జిల్లా మంత్రి అయిన హరీష్ రావుకు కేసీఆర్ హుజురాబాద్ బాధ్యతలు అప్పగించారు. హుజూరాబాద్‌లో పార్టీ గెలుపు కోసం మొన్నటివరకు తెరవెనుక పనిచేసిన హరీష్ రావు ఇప్పుడు నేరుగానే రంగంలోకి దిగారు. హుజూరాబాద్ లో అడుగుపెట్టి అక్కడ పరిస్థితులను టీఆర్ఎస్‌కు అనుకూలంగా మారుస్తున్నారు.

మాములుగా అయితే అలాంటి ఎన్నికల బాధ్యతలన్నీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ చూసుకోవాలి. కేటీఆర్‌కే అన్ని ఎన్నికల బాధ్యతలను ఇస్తూ వచ్చిన సీఎం కేసీఆర్ ఈసారి మాత్రం కొడుకు కన్నా అల్లుడు హరీష్ రావుకే ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. హరీష్ రావు ఇప్పుడు హుజూరాబాద్ లో చక్రం తిప్పుతున్నారు. మొత్తం అన్ని పార్టీల నేతలను టీఆర్ఎస్ లోకి చేర్పిస్తున్నారు. ఈటల రాజేందర్ పై విమర్శలు గుప్పిస్తూ ఆయనను నైతికంగా ఒంటరిని చేసే బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తున్నారు. ఈటల వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌ రావు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు ప్రచారంలో భాగంగా ట్రబుల్‌ షూటర్‌ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు.

ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉప ఎన్నికల బాధ్యతల నుంచి దూరంగా పెట్టడంపై ఇప్పుడు టీఆర్ఎస్‌లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. హుజూరాబాద్‌లో గెలుపు అంత సులువు కాదు కాబట్టే.. ముందు జాగ్రత్తగా ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావును రంగంలోకి దించారని అంతర్గత చర్చల్లో చెవులు కొరుక్కుంటున్నారు. అయితే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ గెలుపు కష్టంగా ఉన్నందువల్లే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారనీ, ఒకవేళ అక్కడ పార్టీ ఓడిపోయినా నెపాన్ని హరీష్ రావు మీదకు నెట్టి కేటీఆర్‌ను సేఫ్ చేసేలా సీఎం కేసీఆర్ స్కెచ్‌ గీశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.



హెలికాప్టర్ ప్రమాదం..8 మంది మిస్సింగ్?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>