PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganf05c43e9-901f-48a6-bbeb-a1d8a6e8b7fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganf05c43e9-901f-48a6-bbeb-a1d8a6e8b7fd-415x250-IndiaHerald.jpgఅమరావతి : వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపడుతున్నామని ఈ సందర్భంగా సీఎం జగన్‌ పేర్కొన్నారు. జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలని... సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సహితం రికార్డులు అప్‌డేట్‌ కావాలని వెల్లడించారు. భూమి కార్డులను రైతులకుcm jagan{#}Survey;November;CMజూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలి : సీఎం జగన్జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలి : సీఎం జగన్cm jagan{#}Survey;November;CMThu, 12 Aug 2021 17:58:19 GMTఅమరావతి : వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష  పథకంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు.  వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపడుతున్నామని ఈ సందర్భంగా సీఎం జగన్‌ పేర్కొన్నారు.  జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు  సీఎం జగన్‌. అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలని... సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సహితం రికార్డులు అప్‌డేట్‌ కావాలని వెల్లడించారు.  

భూమి కార్డులను రైతులకు ఇవ్వాలని... డ్రోన్లు సహా ఇతర టెక్నికల్‌ మెటీరియల్‌ను అవసరమైన మేర కొనుగోలు చేయాలని ఆదేశించారు సీఎం జగన్‌.  దీనికోసం నిపుణుల సేవలు వినియోగించుకోవాలని.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు సీఎం జగన్‌.  దేశంలోనే సమగ్ర భూ సర్వే పూర్తి చేసిన తొలి రాష్ట్రం గా నిలుస్తుందని..సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశం కావాలని ఆదేశించారు సీఎం. సర్వేపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని... అలాగే స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లోకూడా దీనిపై సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సంబంధిత విభాగాల అధికారులతో కూడా సమగ్ర సర్వే పై సమీక్ష చేస్తానని తెలిపిన సీఎం జగన్‌..  సర్వే ఆఫ్‌ ఇండియాతో కూడా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. వారి సహకారాన్ని కూడా తీసుకోవాలని పేర్కొన్న ఆయన... సర్వే రాళ్లు కొరత లేకుండా చూడాలి భూగర్భ గనులశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సకాలంలో వాటిని అప్పగించాలన్నారు  సీఎం జగన్‌. అయితే.. నాలుగు ప్లాంట్లులో నవంబరు నుంచి సర్వేరాళ్లు ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు.  అధికారులు.. రోజుకు ఒక్కో ప్లాంట్లు నుంచి 4వేలు చొప్పున రోజుకు 16వేల సర్వేరాళ్లు ఉత్పత్తి చేస్తామని తెలిపారు భూగర్భగనులశాఖ అధికారులు.



బ్రేకింగ్: తెరాస, వైసీపీకి ఎన్నికల సంఘం లేఖ...? ఎన్నికలకు ఎలా వెళ్దాం...?

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>