EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/rsp2c291f29-482a-4b5d-b50c-a02b730f4bb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/rsp2c291f29-482a-4b5d-b50c-a02b730f4bb6-415x250-IndiaHerald.jpgమాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్ననే నల్గొండ వేదికగా బీఎస్పీలో చేరారు.. ఆయన రాజకీయ అరంగేట్రంతో తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్‌ కోవర్టేనని బీజేపీ ఆరోపిస్తోంది.. లేదు లేదు.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ కోవర్టేనని టీఆర్ఎస్‌ ఆరోపిస్తోంది.. మరి ఇంతకూ ఏది నిజం.. పార్టీలు కుప్పులు తెప్పలుగా ఉన్న తెలంగాణలో అసలు కొత్త పార్టీకి అవకాశం ఉందా.. మరి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ ధైర్యంతో కొత్త పార్టీ పెట్టారు.. రెండు పార్టీలు ఆరోపిస్తున్నట్టు ఆయన నిజంగానే ఎవరrsp{#}praveen;Nalgonda;KCR;Telangana Rashtra Samithi TRS;Red;Party;Bharatiya Janata Party;Ministerఆర్‌.ఎస్. ప్రవీణ్‌ కుమార్‌.. ఎవరి కోవర్టు..?ఆర్‌.ఎస్. ప్రవీణ్‌ కుమార్‌.. ఎవరి కోవర్టు..?rsp{#}praveen;Nalgonda;KCR;Telangana Rashtra Samithi TRS;Red;Party;Bharatiya Janata Party;MinisterThu, 12 Aug 2021 10:00:00 GMTమాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్ననే నల్గొండ వేదికగా బీఎస్పీలో చేరారు.. ఆయన రాజకీయ అరంగేట్రంతో తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్‌ కోవర్టేనని బీజేపీ ఆరోపిస్తోంది.. లేదు లేదు.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ కోవర్టేనని టీఆర్ఎస్‌ ఆరోపిస్తోంది.. మరి ఇంతకూ ఏది నిజం.. పార్టీలు కుప్పులు తెప్పలుగా ఉన్న తెలంగాణలో అసలు కొత్త పార్టీకి అవకాశం ఉందా.. మరి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ ధైర్యంతో కొత్త పార్టీ పెట్టారు.. రెండు పార్టీలు ఆరోపిస్తున్నట్టు ఆయన నిజంగానే ఎవరికైనా కోవర్టుగా పని చేస్తున్నారా..?


ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ కోవర్టని టీఆర్ఎస్  ఆరోపిస్తోంది. ఇందుకు వారు ఓ వాదన చూపుతున్నారు. అదేంటంటే.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన తొలి సభలో బీజేపీని తిట్టలేదు కదా.. ఆయన కేసీఆర్‌నే విమర్శించారు.. అందువల్ల ఆయన బీజేపీ  కోవర్టు అని తేలిపోయింది అంటున్నారు. అంటే బీజేపీని తిట్టనంత మాత్రాన బీజేపీ కోవర్టుగా భావించొచ్చా.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం తెలంగాణలో రాజ్యాధికారం.. ఈ విషయంలో క్లారిటీ ఉంది. మరి తెలంగాణలో రాజ్యాధికారం లక్ష్యం అయినప్పుడు సహజంగానే ఆయన కేసీఆర్‌ను టార్గెట్ చేసుకుంటారు కదా.


ఇక బీజేపీ వాదన విషయానికి వద్దాం.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్‌గా ఉన్నప్పుడు కేసీఆర్ ఆయనకు అన్నివిధాలా సహకరించారని బీజేపీ గుర్తు చేస్తోంది.. నిన్న మొన్నటి వరకూ కేసీఆర్‌ను పొగిడిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆయన్ను విమర్శించడం అంతా డ్రామా అని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కోవర్టని బీజేపీ ఆరోపిస్తోంది. ఇది కూడా డొల్ల వాదనే.. ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు.. అందులోనూ కేసీఆర్ సహకరిస్తున్నప్పుడు  ఆయన్ను తిట్టాల్సిన అవసరం ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఎందుకు ఉంటుంది.. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అందులో తప్పేముంది..


ఈ రెండు పార్టీలో మరో విషయాన్ని మర్చిపోతున్నాయి. వాస్తవానికి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ పార్టీలోకి వచ్చినా రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించేవి.. టీఆర్ఎస్ అయితే ఎమ్మెల్సీ వంటి పదవి.. మంత్రి పదవి ఆఫర్ చేసేవి కూడా.. కానీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సొంతంగానే ప్రయాణించాలనుకుంటున్నారు.. అది ఆయన ఇష్టం.. అందుకే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పై కోవర్టు ముద్రలు వేయడం అంతగా సెట్ కావడం లేదు.



వర్కౌట్ విషయంలో రష్మికని మించిన సమంత..?

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>