PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/devenin-uma-related-enquiry-speedupf6c36c24-d702-4743-aab9-115d41083de9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/devenin-uma-related-enquiry-speedupf6c36c24-d702-4743-aab9-115d41083de9-415x250-IndiaHerald.jpgఅక్రమ మైనింగ్ వ్యవహారాన్ని పరిశీలించేందుకు వెళ్లి అరెస్ట్‌ అయిన టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహారం రాజమండ్రి సెంట్రల్ జైలును వదలడం లేదు. దేవినేని ఉమ జైలులో ఉన్నది వారం రోజుల లోపే. అయినప్పటికీ అక్కడ దేవినేని ఉన్న సమయంలో ఆయనకు పండ్లు, ఫోన్‌లో మాట్లాడే అవకాశం కల్పించారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. జైలు సూపరింటెండెంట్‌ రాజారావును బదిలీ చేయడంతో ఆయన ఈ అంశంపై వివరణ ఇచ్చారు. అందులో తన ప్రమేయం లేదని, పైగా తాను ఆ సమయంలో సెలవులో ఉన్నానని చెప్పడంతో తాజాగా సెంట్రల్ జైలులో విచారణ ప్devenin uma related enquiry speedup{#}devineni avinash;Rajahmundry;rahul;Rahul Sipligunj;Vishakapatnam;News;Ministerరాజమండ్రి జైలును వీడని దేవినేని ఉమ వ్యవహారం!రాజమండ్రి జైలును వీడని దేవినేని ఉమ వ్యవహారం!devenin uma related enquiry speedup{#}devineni avinash;Rajahmundry;rahul;Rahul Sipligunj;Vishakapatnam;News;MinisterThu, 12 Aug 2021 10:00:00 GMTఅక్రమ మైనింగ్ వ్యవహారాన్ని పరిశీలించేందుకు వెళ్లి అరెస్ట్‌ అయిన టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహారం రాజమండ్రి సెంట్రల్ జైలును వదలడం లేదు. దేవినేని ఉమ జైలులో ఉన్నది వారం రోజుల లోపే. అయినప్పటికీ అక్కడ దేవినేని ఉన్న సమయంలో ఆయనకు పండ్లు, ఫోన్‌లో మాట్లాడే అవకాశం కల్పించారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. జైలు సూపరింటెండెంట్‌ రాజారావును బదిలీ చేయడంతో ఆయన ఈ అంశంపై వివరణ ఇచ్చారు. అందులో తన ప్రమేయం లేదని, పైగా తాను ఆ సమయంలో సెలవులో ఉన్నానని చెప్పడంతో తాజాగా సెంట్రల్ జైలులో విచారణ ప్రారంభమైంది. ఒక ప్రజాప్రతినిధి అల్లుడికి ఈ వ్యవహారంలో జోక్యం ఉందని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని జైలు సూపరింటెండెంట్ రాజారావు అంటున్నారు. అసలు ఆ సంఘటన జరిగిన రోజున తాను సెలవులో ఉన్నానని, తనకు సంబంధం లేదని, తనను అన్యాయంగా బలి చేశారని ఆయన జైళ్లశాఖ ఉన్నతాధికారులకు వివరించారు. దీనిపై జైళ్ల శాఖ ఉన్నతాధికారులు విశాఖపట్నం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను విచారణకు  నియమించారు. రాజారావు.. తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని విశాఖ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో మంగళ, బుధవారాల్లో విచారణ నిర్వహించినట్లు సమాచారం అందింది. గత నెల 29 తేదీన జరిగిన కార్యకలాపాలను సీసీ కెమెరా ఫుటేజీని ఆయన పరిశీలించి, నివేదిక తయారు చేస్తున్నారని తెలిసింది.

కాగా గతనెల 29వ తేదీన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఒక ప్రజాప్రతినిధి అల్లుడుగా ఉన్న ద్వితీయ శ్రేణి అధికారి పర్యవేక్షణ చేశారని చెబుతున్నారు. ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. సెంట్రల్ జైలులో ఆ రోజున జరిగిన కార్యకలాపాలపై ఇప్పటికే ఆధారాలతో సహా రాజమండ్రి సెంట్రల్ జైలు మాజీ సూపరింటెండెంట్ రాజారావు ఫిర్యాదు చేయడంతో.. వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణాధికారిగా ఉన్న రాహుల్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.



వర్కౌట్ విషయంలో రష్మికని మించిన సమంత..?

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>