EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/obc-bill15a730dc-ebc3-41ec-872d-b45838a15ce0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/obc-bill15a730dc-ebc3-41ec-872d-b45838a15ce0-415x250-IndiaHerald.jpgఓసీబీ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలపగా బుధవారం రాజ్యసభ ఆమోదించింది. దీంతో ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లనుంది. అయితే ఈ ఓబీసీ బిల్లుపై చాలా మందికి అవగాహన లేదు.. ఈ ఓబీసీ బిల్లు ఉద్దేశ్యం ఏంటి.. దీనివల్ల బీసీలకు ఒరిగేదేంటి.. అంతకు ముందు ఏం ఉంది.. ఈ బిల్లు తర్వాత ఏం మారుతోంది.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా మందికి తెలియవు. ఈ బిల్లుతో ఓబీసీలకు కొత్తగా రిజర్వేషన్లు వచ్చాయని చాలా మంది అపోహ పడుతున్నారు. ఈ ఓబీసీ బిల్లు ద్వారా కొత్తగా ఎలాంటి రిజర్వేషన్లు రాలేదు. మరి ఈobc bill{#}Parliment;tuesday;Backward Classes;wednesdayబీసీల కొంప ముంచనున్న ఓబీసీ బిల్లు.. ఎలాగంటే..?బీసీల కొంప ముంచనున్న ఓబీసీ బిల్లు.. ఎలాగంటే..?obc bill{#}Parliment;tuesday;Backward Classes;wednesdayThu, 12 Aug 2021 00:00:00 GMTఓసీబీ బిల్లును  పార్లమెంట్ ఆమోదించింది. మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలపగా బుధవారం రాజ్యసభ ఆమోదించింది. దీంతో ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లనుంది. అయితే ఈ ఓబీసీ బిల్లుపై చాలా మందికి అవగాహన లేదు.. ఈ ఓబీసీ బిల్లు ఉద్దేశ్యం ఏంటి.. దీనివల్ల బీసీలకు ఒరిగేదేంటి.. అంతకు ముందు ఏం ఉంది.. ఈ బిల్లు తర్వాత ఏం మారుతోంది.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా మందికి తెలియవు.  


ఈ బిల్లుతో ఓబీసీలకు కొత్తగా రిజర్వేషన్లు వచ్చాయని చాలా మంది అపోహ పడుతున్నారు. ఈ ఓబీసీ బిల్లు ద్వారా కొత్తగా ఎలాంటి రిజర్వేషన్లు రాలేదు. మరి ఈ కొత్త బిల్లుతో ఏం వచ్చింది అంటే.. గతంలో బీసీల జాబితాలు రూపొందించుకునే స్వేచ్చ రాష్ట్రాలకు ఉండేది..  2018లో కేంద్రం ఆ స్వేచ్ఛను రాష్ట్రాల నుంచి తీసేసుకుంది. బీసీ జాబితాలు రూపొందించే అధికారం కేవలం కేంద్రానికే వచ్చేసింది. ఇప్పుడు మళ్లీ ఆ నిర్ణయాన్ని తిరగదోడుతున్నారు. మళ్లీ రాష్ట్రాలకు బీసీల జాబితాలు రూపొందించుకునే అవకాశం కల్పిస్తున్నారు.


అంటే సింపుల్‌గా పాత నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారంతే.. అయితే ఈ బీసీ బిల్లుతో బీసీలకు  పెద్దగా లాభం లేకపోగా.. కొన్ని నష్టాలు ఉన్నాయి. అవేంటంటే.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ల కోసం ఉన్నత కులాలను కూడా బీసీల జాబితాలో చేర్చే ప్రమాదం ఉంది. సాధారణంగా అణగారి ఉన్న కులాలను బీసీల్లో చేర్చడానికి అభ్యంతరం లేదు. కాని ఆ పేరుతో ఇతర ఉన్నత కులాలను  బిసిలలో చేర్చితే మరింత నష్టం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే.. బీసీల విషయంలో రాష్ట్రాలకు ఈ స్వేచ్ఛ ఇచ్చిన కేంద్రం ఎస్.సి, ఎస్టి రిజర్వేషన్ ల విషయంలో  కేంద్రం ఇలా చేయడం లేదు.


అందుకే.. రాష్ట్రాలు రాజకీయ అవసరాల కోసం ఉన్నత కులాలను బిసిలలో చేర్చే ప్రమాదం ఉంది. ఆ విధంగా పార్లమెంట్ ఆమోదించిన ఓబీసీ బిల్లు వల్ల బిసిలకు నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అంతే కాదు. బిసిల కోటా పెంచుకుండా.. వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా.. ఇతర కులాలను బీసీల్లో చేర్చడం వల్ల ఇప్పటికే ఉన్న కులాలకు నష్టమే తప్ప లాభం ఉండదు.



వైసీపీలో ఆ రచ్చ ఏంది? కొంపముంచుతారా?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>