PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-politics9f66f47d-ebf8-4461-8704-f6dbdddab9a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-politics9f66f47d-ebf8-4461-8704-f6dbdddab9a9-415x250-IndiaHerald.jpgచంద్రబాబు రాజకీయ జీవితం సంకట దశలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. గతంలో తన పాలనతో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఇటు ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ది పథంలో నడిపినా ఎందుకో ప్రజలు 2019 ఎన్నికల్లో మార్పును ఆశించి యువ నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అందలం ఎక్కించారు. AP-POLITICS{#}Yuva;Andhra Pradesh;CBN;Jagan;TDP;Hanu Raghavapudi;MLA;Partyఒక్క ఛాన్స్ అన్న జగన్ ను... ఒక్కసారికే పరిమితం చేస్తారా ?ఒక్క ఛాన్స్ అన్న జగన్ ను... ఒక్కసారికే పరిమితం చేస్తారా ?AP-POLITICS{#}Yuva;Andhra Pradesh;CBN;Jagan;TDP;Hanu Raghavapudi;MLA;PartyThu, 12 Aug 2021 09:00:00 GMTచంద్రబాబు రాజకీయ జీవితం సంకట దశలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. గతంలో తన పాలనతో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఇటు ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ది పథంలో నడిపినా ఎందుకో ప్రజలు 2019 ఎన్నికల్లో మార్పును ఆశించి యువ నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అందలం ఎక్కించారు. అది కూడా మామూలు మెజారిటీతో కాదు ఏకంగా 153 ఎమ్మెల్యే లను మరియు 23 ఎంపీలను గెలిపించి చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని వైసీపీకి అందించారు. కానీ జగన్ పాలనలో సంక్షేమ పథకాలు సక్రమంగా జరుగుతున్నప్పటికీ అభివృద్ది పరంగా మరియు పాలనలో జగన్ అనుభవ లేమి స్పష్టంగా కనబడుతోంది. దీనితో కొంత మేరకు కొన్ని ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 

ఈ విషయాన్ని కరెక్ట్ గా వాడుకుని ప్రతిపక్ష పార్టీ రేసులోకి రావాలని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఈ అవకాశాన్ని వాడుకోవాలని టీడీపీ నాయక వర్గం సైతం కోరుకుంటోంది. జగన్ చేస్తున్న పొరపాట్లను ప్రజల దృష్టికి తీసుకెళ్లి టీడీపీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఏపీలో 2023 లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు ప్రణాలికలు చేసుకోకపోతే ఏపీలో టీడీపీ మనుగడ కష్టమైపోతుంది అని పొలిటికల్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ను ఒక్కసారికే పరిమితం చేయాలని చంద్రబాబు అండ్ కో కు ప్రముఖుల రాజకీయ నాయకులు సలహాలు ఇస్తున్నారు.

కానీ చంద్రబాబు వ్యవహార శైలి ఈ విధంగా ఉందో...ఏమి ఆలోచిస్తున్నారా పార్టీ నాయకులకు కూడా అర్థం కావడం లేదు. కానీ ఇప్పటి నుండే ఒక ప్లాన్ ప్రకారం వర్క్ ఔట్ చేస్తేనే రానున్న ఎన్నికల్లో టిడిపికి విజయావకాశాలు ఉంటాయని తెలుస్తోంది. మరి చంద్రబాబు అండ్ బ్యాచ్ ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా ఎప్పటిలాగే వీడియో కాల్ మీటింగ్ లాక్ పరిమితం అవుతారా చూడాలి.



వివేకా హత్య కేసు కొలిక్కి!

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>