PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ministers2c426a09-490b-474e-814e-e90784da4753-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ministers2c426a09-490b-474e-814e-e90784da4753-415x250-IndiaHerald.jpgవైసీపీ సర్కార్ సగం పాలన పూర్తి అవుతోంది. మిగిలిన సగం ముందుంది. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న మాట మంత్రి వర్గ విస్తరణ. నిజానికి విస్తరణ అంటేనే చాలా లెక్కలు ఉంటాయి. అవి కూడికలు, తీసివేతలు. ఇలా చాలా చిక్కులు ఉంటాయి. ఆ రాజకీయ గణిత శాస్త్రాన్ని ఎంతలా చదివినా కూడా ఎవరికీ అర్ధం కాదు jagan ministers{#}KCRఅయిదేళ్ళూ ఈ మంత్రులేనా ?అయిదేళ్ళూ ఈ మంత్రులేనా ?jagan ministers{#}KCRThu, 12 Aug 2021 21:06:19 GMTవైసీపీ సర్కార్ సగం పాలన పూర్తి అవుతోంది. మిగిలిన సగం ముందుంది. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న మాట మంత్రి వర్గ విస్తరణ. నిజానికి విస్తరణ అంటేనే చాలా లెక్కలు ఉంటాయి.

అవి కూడికలు, తీసివేతలు. ఇలా చాలా చిక్కులు ఉంటాయి. ఆ రాజకీయ గణిత శాస్త్రాన్ని ఎంతలా చదివినా కూడా ఎవరికీ అర్ధం కాదు. ఇక చరిత్ర ఒకసారి తిరగేస్తే అర్ధమయ్యే విషయం ఒక్కటే. మంత్రి వర్గ విస్తరణ తరువాతనే అసమ్మతులు అసంతృప్తులు పెరిగి చివరికి ప్రభుత్వాలకు చెల్లు చీటీ రాసేశాయి. 1978 నుంచి 1983 వరకూ ఏకంగా ముఖ్యమంత్రులు, మంత్రులు మారడం వల్లనే కాంగ్రెస్ చిత్తు కింద ఓడింది. సేమ్ సీన్ 1989 నుంచి 1994 మధ్యలో కూడా రిపీట్ అయింది. ఇక ఎన్టీయార్ హయాంలో కూడా 1989లో ఒకేసారి మొత్తం మంత్రులను తొలగించడం వల్లనే ఓడిపోయారని అంటారు. మంత్రి పదవి కేసీయార్ కి ఇవ్వకుండా చంద్రబాబు చేసినందువల్లనే ఉమ్మడి ఏపీకి మళ్ళీ బాబు సీఎం కాలేదు అన్న మాటా ఉంది.

ఇవన్నీ చూసుకున్నపుడు జగన్ అర్జంటుగా మంత్రి వర్గ విస్తరణ చేయాలా అన్న చర్చ కూడా వస్తోంది. ప్రస్తుత మంత్రుల మీద జనంలో పెద్దగా వ్యతిరేకత లేదు. పైగా వారు జనంలోకి వెళ్ళి గట్టిగా తిరిగిన సందర్భాలు లేవు. దానికి కారణం కరోనా. ఇలా రెండేళ్ళ పాటు కరోనా ఎవరినీ ఏమీ చేయనివ్వలేదు. ఇపుడు ఈ అసాధారణమైన పరిస్థితినే ఆసరాగా చేసుకుని ఈ మంత్రులను మరో రెండున్నరేళ్ళు కంటిన్యూ చేస్తే పోయేది ఏముందు అన్న మాట కూడా ఉంది. మంత్రివర్గ విస్తరణ పేరిట తేనే తుట్టె కదపకుండా ఉండడమే మేలు అన్నది వైసీపీ హితైషుల నుంచి వినిపిస్తున్న  మాట. ఎందుకంటే విస్తరణ అంటూ జరిగితే మొత్తం వంద మంది దాకా ఆశావహులు ఉన్నారు. జరగకపోతే ఏ గొడవా లేదు మరి.





అయిదేళ్ళూ ఈ మంత్రులేనా ?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>