MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun69b2f6ba-cc1c-4c91-b32b-c3f7db0369e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun69b2f6ba-cc1c-4c91-b32b-c3f7db0369e7-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్న ఆ నలుగురిలో అల్లు అరవింద్ ఒకరు అన్న విషయం ఎవరు కాదనలేని సత్యం. అల్లు అర్జున్ అల్లు శిరీష్ లాంటి హీరోలు తన ఇంటిలో ఉన్నప్పటికీ ఒక మూవీ రీమేక్ కోసం అరవింద్ ప్రస్తుతం హీరో అన్వేషణలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మళయాళంలో విజయవంతమైన కథాబలం ఉన్న చిత్రాలను తెలుగులో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం.ప్రస్తుతం ఈ రీమేక్ పరంపర చాలా ఎక్కువగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా తో రీమేక్ చేస్తున్న 'అయ్యప్పనుమ్ కొషియమ్' చిరంజీవి నటించబోతునALLUARJUN{#}Allu Aravind;allu sirish;Hindi;Remake;Geetha Arts;NET FLIX;Yevaru;kalyan;Ram Charan Teja;Thriller;Chiranjeevi;rana daggubati;Industry;Hero;News;Allu Arjun;Cinema;Teluguహీరోల కొరతతో అల్లాడిపోతున్న అల్లు కాంపౌండ్ !హీరోల కొరతతో అల్లాడిపోతున్న అల్లు కాంపౌండ్ !ALLUARJUN{#}Allu Aravind;allu sirish;Hindi;Remake;Geetha Arts;NET FLIX;Yevaru;kalyan;Ram Charan Teja;Thriller;Chiranjeevi;rana daggubati;Industry;Hero;News;Allu Arjun;Cinema;TeluguThu, 12 Aug 2021 11:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్న ఆ నలుగురిలో అల్లు అరవింద్ ఒకరు అన్న విషయం ఎవరు కాదనలేని సత్యం. అల్లు అర్జున్ అల్లు శిరీష్ లాంటి హీరోలు తన ఇంటిలో ఉన్నప్పటికీ ఒక మూవీ రీమేక్ కోసం అరవింద్ ప్రస్తుతం హీరో అన్వేషణలో  ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మళయాళంలో విజయవంతమైన కథాబలం ఉన్న చిత్రాలను తెలుగులో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో  వస్తున్న సాంప్రదాయం.


ప్రస్తుతం ఈ రీమేక్ పరంపర చాలా ఎక్కువగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా తో రీమేక్ చేస్తున్న 'అయ్యప్పనుమ్ కొషియమ్' చిరంజీవి నటించబోతున్న ‘లూసిఫర్’ రీమేక్. రామ్ చరణ్ రైట్స్ తీసుకున్న ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీలు కూడ మళయాళ నుండి రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ‘నాయాట్టు’ అనే మళయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారని  వార్తలు వస్తున్నాయి.


2021లో విడుదలై సక్సస్ సాధించిన ‘నాయాట్టు’ మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ మూవీ ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజై  అనేక మంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కొంతమంది ప్రముఖులు తమ స్వార్ధం కోసం వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంటారు అధికారం చేతిలో ఉంటే నాయకులు ఎవరినైనా ఎలా వేధింపులకు గురి చేస్తారు. అనే పవర్ ఫుల్ రాజకీయ కథాంశంతో రూపొందిప ఈమూవీని తెలుగు తమిళ హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.



అల్లు అరవింద్ సారధ్యంలోని గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ  ఈమూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈమూవీ రీమేక్ కోసం దర్శకులతో చర్చలు జరుపుతున్న అరవింద్ ఈమూవీ కథకు నప్పే హీరో గురించి అన్వేషణలో ఉన్నట్లు టాక్. మెగా కాంపౌండ్ లో అనేకమంది హీరోలు ఉన్నప్పటికీ అల్లు శిరీష్ సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ వారందరిని పక్కకు పెట్టి అరవింద్ మరో హీరో కోసం అన్వేషణలో పడటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..





కోలుకున్న ప్రకాష్ రాజ్..అతనికి థ్యాంక్స్ అంటూ ట్వీట్..!

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>