PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp533c6f0a-a0ab-498b-8dc4-a50d208262b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp533c6f0a-a0ab-498b-8dc4-a50d208262b2-415x250-IndiaHerald.jpgశ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికర పోరుకు తెరలేస్తుంది. త్వరలోనే శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికలతో పాటే శ్రీకాకుళం, నెల్లూరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సింది కానీ...అనివార్య కారణాలతో వాటికి ఎన్నిక వాయిదా పడింది. కానీ తాజాగా వీటికి ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసి నీలం సాహ్ని చూస్తున్నారు. tdp{#}ram pothineni;ATCHANNAIDU KINJARAPU;MP;Srikakulam;Nellore;MLA;politics;Elections;Cheque;TDP;YCP;Varasuduరామ్మోహన్ వర్సెస్ రామ్ మనోహర్...పైచేయి ఎవరిది?రామ్మోహన్ వర్సెస్ రామ్ మనోహర్...పైచేయి ఎవరిది?tdp{#}ram pothineni;ATCHANNAIDU KINJARAPU;MP;Srikakulam;Nellore;MLA;politics;Elections;Cheque;TDP;YCP;VarasuduThu, 12 Aug 2021 02:00:00 GMTశ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికర పోరుకు తెరలేస్తుంది. త్వరలోనే శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికలతో పాటే శ్రీకాకుళం, నెల్లూరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సింది కానీ...అనివార్య కారణాలతో వాటికి ఎన్నిక వాయిదా పడింది. కానీ తాజాగా వీటికి ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసి నీలం సాహ్ని చూస్తున్నారు.

త్వరలోనే శ్రీకాకుళం, నెల్లూరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. అయితే మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. ఈ రెండుచోట్ల వైసీపీ గెలుపుకు పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కాకపోతే నెల్లూరుతో పోలిస్తే శ్రీకాకుళంలో వైసీపీ కాస్త టఫ్ ఫైట్ ఎదురుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళంలో టీడీపీ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది.

పైగా శ్రీకాకుళంలో టీడీపీని గెలిపించే బాధ్యత ఎంపీ రామ్మోహన్ నాయుడు తీసుకున్నారు. అటు అచ్చెన్నాయుడు సపోర్ట్ ఎలాగో ఉంటుంది. రామ్మోహన్ నాయుడుకు శ్రీకాకుళం కార్పొరేషన్‌పై మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో కార్పొరేషన్ పరిధిలో ఎంపీ ఓట్లు రామ్మోహన్‌కు ఎక్కువగానే పడ్డాయి. అయితే రామ్మోహన్‌కు చెక్ పెట్టి, కార్పొరేషన్‌పై వైసీపీ జెండా ఎగరవేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే కార్పొరేషన్‌లో వైసీపీని గెలిపించే బాధ్యత సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వారసుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధర్మాన శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ధర్మాన ప్రస్తుతం యాక్టివ్‌గా రాజకీయాలు చేయడం తగ్గించారు. తనయుడునే నియోజకవర్గంలో తిప్పుతున్నారు. పైగా తనయుడుని ఛైర్మన్ పీఠంలో కూర్చోబెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తన తనయుడుకు శ్రీకాకుళం కార్పొరేషన్ ఛైర్మన్ పీఠం దక్కేలా చేసుకోవడానికి ధర్మాన గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈలోపే తనయుడుని ఫీల్డ్‌లోకి దింపేశారు. రామ్ కూడా కార్పొరేషన్ పరిధిలో పర్యటిస్తూ, ప్రజలని కలుసుకుంటున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో ఉచిత వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయిస్తున్నారు. ఇలా రామ్ దూకుడుగా ఉంటున్నారు. అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి, కార్పొరేషన్‌లో వైసీపీకే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎన్నికల సమయంలో రామ్మోహన్, రామ్ మనోహర్‌ల మధ్య పోరు ఎలా ఉంటుందో చూడాలి.



రామ్మోహన్ వర్సెస్ రామ్ మనోహర్...పైచేయి ఎవరిది?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>