EditorialRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/morning-raga-137eaea0-edec-4f1f-9110-f15ff8d180fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/morning-raga-137eaea0-edec-4f1f-9110-f15ff8d180fe-415x250-IndiaHerald.jpgమీ జీవితాన కొన్ని శ్లోకాలు ఇటువం టివి ప‌ల‌క‌రించాలి అని కోరుకోండి.. ప్రేమ అనే ఉన్న‌తిని కోరు కోండి..జ్ఞానం అనే గొప్ప సం ప‌ద‌ను కోరుకోండి..ఏం కోరుకోవాలో తె ల్సుకున్నాక ఏం వ‌ద్దు అని అనుకోవాలో కూడా ని ర్ణ‌యించుకుని,మీతో చివ‌రి దాకా ఉండే ఉద్వేగాల జాబితాలో,మీరు నెర‌వేర్చ‌ని ప‌నుల జాబితాలో,మీ..మీ..త‌ప్పులు రా సుకునే జాబితాలో కాస్త‌యినా నిజాయితీకి ప్రా ధాన్యం ఇవ్వ‌డమే మీకు మీరు ప్ర‌క‌టించే ఆద‌ర్శం.. morning raga {#}jeevitha rajaseskhar;prema;Love;Air;Research and Analysis Wing;Anandamమార్నింగ్ రాగా :.....జీవితాద‌ర్శం అంటే?మార్నింగ్ రాగా :.....జీవితాద‌ర్శం అంటే?morning raga {#}jeevitha rajaseskhar;prema;Love;Air;Research and Analysis Wing;AnandamThu, 12 Aug 2021 07:46:27 GMTఆద‌ర్శం అంటే
ఆగిపోవ‌డం కాదు
ప్ర‌యాణించ‌డం

మంచి భాష
మంచి వ్య‌క్తిత్వం
మంచి అనుకునే నిర్మాణం

ఇవ‌న్నీ ఎక్క‌డున్నాయో

వెత‌క‌డం

వెత‌క‌డం కాదు వికాసం ఒక ఆద‌ర్శం
బ‌త‌క‌డం ఒక ఆద‌ర్శం

రామ‌త‌త్వం ఆద‌ర్శం అంటారు క‌దా!అడ‌వి నుంచి అడ‌వి వ‌ర‌కూ చేసే ప్ర‌యాణాన్నీ, న‌మ్ముకున్న సిద్ధాంతాన్నీ మ‌నిషి త‌న మూ లాల్లో దాచుకుని తీర‌డం ఆద‌ర్శం. మంచి భాష..జీవితాన్ని దిద్దిన భాష‌,అమ్మ‌నాన్న‌లు నేర్పిన భాష..ఉన్న‌త శిఖ‌రాల చెంత గాలి తెమ్మెర‌ల‌తో,పిల్ల గాలుల‌తో సంభాషించిన భాష..ఆ భాష ఉన్న‌తికి కార‌ణం.వెల్లువకు కార‌ణం..


నిబ‌ద్ధ‌త ఒక్క‌టే ప్రామాణికం..

its a one kind of impact..క‌నుక ఉన్న‌తికి నోచుకున్న ప్ర‌భావం అంతా మీ జీవి తాన ఆద‌ర్శ‌మే!The Least and the Highest Sense of your Life Is Also may impact on Others..న‌డ‌క‌ను మ‌రిచి,ప‌రు గులు తీసిన క్ష‌ణాలు..ప‌రుగుల్లో గాయాలూ..ప‌రు గుల్లో చీము,నెత్తురలతో కూడిన సంఘ‌ర్ష‌ణ‌లూ అన్నీ వినీ..చూసీ.. చ‌దివేక..బ‌తికిన కాలం..గ‌డిపిన జీవితం..మ‌ట్టి మూలాల్లో దా గిన మ‌నుషుల గురిం చి ఏం రాస్తుంది అని అనుకున్నాను.ఆత్మ ప్ర‌బోధానుసారం బ‌త‌క‌డంలో ఇంత‌వ‌ర‌ కూ నిబ‌ద్ధ‌త ఒక్క‌టే ప్రా మాణికం..The Most Committed and Convinced Versions Are More Great Things In Our Lives.

...............ఆద‌ర్శం అంటే

ఒక‌రికి అంద‌నంత ఎత్తు..చేర‌నంత దూరం.

మంచి వ్య‌క్తిత్వం ఎక్క‌డి నుంచి ఎక్క‌డిదాకా..ఆలోచించండి..మంచి క‌ళ ఎక్క‌డి నుంచి ఎక్క‌డి వ‌ర‌కూ..మీరు మాట్లాడ‌డం..మీరు ఇత‌రులను గెలిపించ‌డం అన్న‌వి మీ..మీ.. జీవితాద‌ర్శాలు ఎందుకు కాకూడ‌దు.?ఒక ప్ర‌భుత్వాస్ప‌త్రి ప్రాంగణాన మ‌ధ్యాహ్న వేళ‌ ల్లో ప‌ల‌కరించే అన్నం ముద్ద మీదే ఎందుకు కాకూడదు...?ఇప్పుడు చెప్పండి డ‌బ్బు లుంటే ఏం చేస్తారు..?ఒక న‌దిని దాటి సంద్ర పు హోరులో మీ జీవితం చిక్కుకున్నాక... మీ..మీ..బాధ్య‌త‌లు అన్న‌వి చిన్న‌వి అవుతాయి..మీ ఆనందాలు చిన్న‌బోతాయి.ఆద ర్శం అంటే ఒక‌రికి అంద‌నంత ఎత్తు..చేర‌నంత దూరం.కొల‌వ‌లేని తీరం..ఇంకా ఏవేవో అనుకుంటారా?హా..హా..కానేకాదు...


అంతిమ ఆద‌ర్శం అని రాయండి

.....................మీరు..అన్నారెవ‌రో!


కొన్నింటిని వదిలి వ‌చ్చేక ప్ర‌క్షాళ‌న‌కు నోచుకున్న క్ష‌ణాల‌నూ.. కాలాల‌నూ..జ్ఞాప‌కాల నూ..అనంతం అయిన ప్ర‌పంచంలో ఎక్క‌డె క్కడో విసిరేయ‌క దాచుకోవ‌డంలో కూడా ఆనందం ఉంది.ఆద‌ర్శం కూడా ఉంది.మీ..మీ..జీవి తాల్లో అమ్మా,నాన్నా,సంస్కృతీ వా రు నేర్పిన నిబ‌ద్ధ‌త నెత్తిన పెట్టుకుని పూజించిన ఓ గొప్ప సంద‌ర్భ‌మే మీ వ‌ర‌కూ మీరు ఆచ‌రించ‌ద‌గిన ఆద‌ర్శం.స‌త్యాన్ని న‌మ్ము కున్నాక ఆ.. ప్ర‌యాణంలో సంబంధిత బాధ‌లో..దుఃఖం లో..ఎవ్వరెవ్వ‌రో నిల‌దీస్తారు.ఎవ్వ‌రెవ్వ‌రో ఎదురవుతారు..నీవు నీ న‌మ్మ కాల‌ను ప్ర‌క‌టించ‌డం క‌న్నా వాటి నిరూప‌ణ‌ల్లో ఉండ‌డం కూడా ఓ ఆత్మ సంబం ధ  సౌంద‌ర్య ఆవిష్క‌ర‌ణ..అదే ఆద‌ర్శం..అంతిమ ఆద‌ర్శం అని రాయం డి మీరు..అ న్నారెవ‌రో!

............అదే రేప‌టి వేళ
వీధి చివ‌రి గుడిలో వినిపించే శ్లోకం

జీవితంలో ఒంట‌రిగా తోచిన‌ప్పుడు తోడుండే ఊహ..తోడు లేని కొన్ని బంధాలు ఇవ‌ న్నీ కొన్ని బాధ‌ల‌కు కార‌ణం అవుతాయి. మ నుషుల ప్ర‌తిభా,జ్ఞానం అన్న‌వి ఇప్ప‌టికీ ఇంకా ఒక‌రి అసూయ‌కో,లేదా ఒక‌రిని దూరం పె ట్టేందుకో ప‌నికి వ‌స్తున్నాయి. ఎందుక నో ఈ క‌రోనా కాలాలు ఈ క‌ల్లోలితాలు వాటిని మారుస్తున్నాయి అని అనుకోను.మార్చేందుకు చేసే ప్ర‌య‌త్నంలో ఎవ్వ‌రున్నా అ లాంటి గొప్ప  సంస్క‌ర‌ణ‌కు కాలం అ నుకూలించడం కూడా ఓ గొప్ప మార్పున‌కు సంకేత‌మే..ఆ మార్పు జీవితాద‌ర్శం.జీవితాద ర్శం అంటే అహంతో కానీ దుఃఖంతో కానీ బాధ‌పెట్ట‌కుండా ఎవ‌రినీ నొప్పించ‌కుండా ఉండ‌డ‌మే!అటువంటి రోజు మీ జీవితాల్లో ప‌లక రించడం అన్న‌ది త‌ప్ప‌క ఉండాలి. మీ దైనందిన జీవితం ఏం కోరుకుంటుంది..ప్ర‌తిభ‌ను న‌మ్ముకునే వారిని ఏ విధంగా మీరు గౌర‌వి స్తున్నారు.తమ జీవిత కాలం నిర్ల‌క్ష్యంతో కాలం గ‌డిపేసే వారిని మీరు అంగీక‌రిస్తున్నారా లేదా దూరం పెడు తున్నారా ఇవన్నీ తె ల్సుకోవ‌డంలోనే సిస‌లు  బా ధ్య‌త ఉంది.ఆద‌ర్శం అంటే వెనుకటి కాలంలో వ‌దిలేసిన పేజీ కావొచ్చు..కానీ అదే రే ప‌టి వేళ వీధి చివ‌రి గుడిలో వినిపించే శ్లోకం.

.............ఆ..సాకార ద‌శ‌ను

స్థిరం చేయ‌డ‌మే సంక‌ల్పం..

మీ జీవితాన కొన్ని శ్లోకాలు ఇటువం టివి ప‌ల‌క‌రించాలి అని కోరుకోండి.. ప్రేమ అనే ఉన్న‌తిని కోరు కోండి..జ్ఞానం అనే గొప్ప సం ప‌ద‌ను కోరుకోండి..ఏం కోరుకోవాలో తె ల్సుకున్నాక ఏం వ‌ద్దు అని అనుకోవాలో కూడా ని ర్ణ‌యించుకుని,మీతో చివ‌రి దాకా ఉండే ఉద్వేగాల జాబితాలో,మీరు నెర‌వేర్చ‌ని ప‌నుల జాబితాలో,మీ..మీ..త‌ప్పులు రా సుకునే జాబితాలో కాస్త‌యినా నిజాయితీకి ప్రా ధాన్యం ఇవ్వ‌డమే మీకు మీరు ప్ర‌క‌టించే ఆద‌ర్శం.. బొమ్మ‌ను నేను వ‌దిలేపోలేదు..సంబంధిత క‌ళ‌కు దూరంగా జ‌రిగేను అంతే!అని అంటాడో పేరొందిన ఇట‌లీ చిత్ర‌కారుడు..అవును!ఇదే చ‌దివేను..జీవితాన్ని కూడా ఎవ్వ‌రూ వ‌దిలే ప్ర‌స‌క్తే ఉండదు కాస్త దూ రంగా జరిగి కొత్త జీవితాల‌ను ఏ విధంగా ప్రారంభించాలో ఇత‌రుల‌కు నేర్ప‌డం ఓ బాధ్య‌త అని గుర్తిస్తే చాలు..నేర్ప‌డం బా ధ్య‌త.. నెర‌వేర్చ‌డం ఆద‌ర్శం..ఆ..సాకార ద‌శ‌ను స్థిరం చేయ‌డ‌మే సంక‌ల్పం..

ఆ వెలుగూ నేనే...

.......ఆ చీక‌టీ నేనే...

మీలో ఆ సంక‌ల్పం ఉంటే ఆ సాకార ద‌శ మీదే!ఆ అనిత‌ర అంటే ఇతరుల‌కు సాధ్యం కాని సంక‌ల్పం మీదే..ఆ వెలుగు మీద‌యితే ముందున్న చీక‌టి మీరే ఎందుకు  కాకూడ‌దు..ప్ర‌తిభ వికసిస్తే వీధి చివ‌ర వెలుగులు జీవితా ల్లోకి వ‌స్తాయి..నేల మాత్ర‌మే ఆలపిం చే గొప్పనైన గానం చెంత నేనున్నాను..మీరు కూడా ఉండండి..వ‌దిలిపోవ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని అని చ‌దివేను..కేవ‌లం ఆ భావ న ఒక్క‌టే  తోడుండే ఊహ..జ‌స్ట్ ల‌వ్ ద ప‌ర్టిక్యుల‌ర్ హై పోథిటిక‌ల్ వెర్ష‌న్ ఆల్సో..ఆ..పంథాలో ఎవరికి వారే ప్ర‌క‌టించ‌ని ఆద‌ర్శాలు ఎన్ని ఉంటాయో!ఆ వెలుగూ ఆ చీక‌టీ నేనే...కాదు మీరే!

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


ఆ హీరో సినిమా కోసం సోనాక్షి అంత అడుగుతోందా ..??

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>