EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrdd2afd27-9bad-4a0e-b5c8-e65877d76a9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrdd2afd27-9bad-4a0e-b5c8-e65877d76a9e-415x250-IndiaHerald.jpgపేద ప్రజల కోసం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలన్నీ అధికార పక్షానికి ఓట్ల రూపంలో ప్రతిఫలాలను ఇస్తుంటాయి. ప్రభుత్వ ఖజానా నుంచి సంక్షేమ పథకాలకోసం ఖర్చు చేసినా.. ఓట్లు మాత్రం అధికార పార్టీకి అందుతుంటాయి. అయితే అన్ని కార్యక్రమాలను ఒకే గాటన కట్టేయలేం. కొన్ని పథకాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచితే, మరికొన్ని ప్రభుత్వ ఇమేజ్ ని డ్యామేజీ చేస్తాయి. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకం తీవ్ర విమర్శలపాలవుతోంది. kcr{#}Eatala Rajendar;CM;KCR;Telangana;Telangana Rashtra Samithi TRS;Hanu Raghavapudi;central government;Andhra Pradesh;Cinemaకేసీఆర్ కొంపముంచే పథకం అదే..కేసీఆర్ కొంపముంచే పథకం అదే..kcr{#}Eatala Rajendar;CM;KCR;Telangana;Telangana Rashtra Samithi TRS;Hanu Raghavapudi;central government;Andhra Pradesh;CinemaThu, 12 Aug 2021 07:15:54 GMTపేద ప్రజల కోసం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలన్నీ అధికార పక్షానికి ఓట్ల రూపంలో ప్రతిఫలాలను ఇస్తుంటాయి. ప్రభుత్వ ఖజానా నుంచి సంక్షేమ పథకాలకోసం ఖర్చు చేసినా.. ఓట్లు మాత్రం అధికార పార్టీకి అందుతుంటాయి. అయితే అన్ని కార్యక్రమాలను ఒకే గాటన కట్టేయలేం. కొన్ని పథకాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచితే, మరికొన్ని ప్రభుత్వ ఇమేజ్ ని డ్యామేజీ చేస్తాయి. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకం తీవ్ర విమర్శలపాలవుతోంది.

2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తెరపైకి తెచ్చారు. భూమి ఉన్న (సాగులో ఉన్నా, లేకున్నా) ప్రతి రైతుకి ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. ఎకరాకు 5వేల రూపాయల చొప్పున భూమిని బట్టి పెట్టుబడి సాయం అందుతుంది. తెలంగాణలో రైతుబంధు అమలైన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2019 ఎన్నికల లక్ష్యంగా కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశ పెట్టింది. అయితే అది పూర్తిగా రైతులకు అందించే ఆర్థిక సాయం. ఏటా మూడు విడతల్లో మొత్తం 6వేల రూపాయలను కేంద్రం రైతుల ఖాతాల్లో నేరుగా జమచేస్తుంది. దీనికితోడు ఏపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రూ.7500 రైతు ఖాతాల్లో వేస్తోంది.

తెలంగాణ విషయానికొస్తే పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతుబంధు సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే పడుతుంది. అయితే ఎక్కువ పొలం ఉన్నవారికి ఎక్కువ లబ్ధి. సన్న, చిన్నకారు రైతులకు మాత్రం అన్యాయం... అన్నట్టుగా ఉంది ఈ పథకం. కౌలుదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. పొలం ఉన్న భూస్వాములకే రైతు బంధు సొమ్ము అందుతుంది. రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు.. ఇలా చాలామంది రైతు బంధు తీసుకున్నవారు ఉన్నారు. ఆ తర్వాత విమర్శలు రావడంతో.. రైతు బంధు తమకి వద్దనుకుంటే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి తిరిగిచ్చేయండి అంటూ మరో నిబంధన తెరపైకి తెచ్చింది కేసీఆర్ సర్కారు. అయితే దీనికి ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు.

ఇటీవల ఈటల రాజేందర్ కూడా ఈ పథకంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రైతుబంధు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అవసరం లేనివారికి, ఆదాయం ఉన్నవారికి సైతం రైతుబంధు సొమ్ము పడుతోందని, నిజంగా పెట్టుబడి అవసరమైన నిరుపేద రైతు మాత్రం విస్తీర్ణం తక్కువగా ఉండటంతో మోస పోతున్నాడని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ పథకంలో మార్పులు చేర్పులకోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించలేదు. కొత్తగా దళిత బంధ ప్రకటించి మరోసారి ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ప్రభుత్వం, రైతు బంధు విషయంలో తప్పు దిద్దుకుంటుందా, లేక పేదలను కొట్టి పెద్దలకు పెడుతూనే ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.



13న బ‌డ్జెట్ స‌మావేశాలు

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>