MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anr9abbd3c9-e554-480f-acf7-4589fae5df82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anr9abbd3c9-e554-480f-acf7-4589fae5df82-415x250-IndiaHerald.jpgఏయన్నార్ సినీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీగా ప్రేమాభిషేకాన్ని చెప్పుకోవాలి. ఈ సినిమా ఆంధ్రా కర్నాటక రాష్ట్రాలలో ఏకంగా అయిదు వందల రోజుల పాటు ఆడి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రేమాభిషేకం ఏయన్నార్ సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతమైన చిత్రంగానూ పేర్కొంటారు. anr{#}Cinemaప్రేమాభిషేకం... మధ్యలో ఆపేయాలనుకున్నారా... ?ప్రేమాభిషేకం... మధ్యలో ఆపేయాలనుకున్నారా... ?anr{#}CinemaThu, 12 Aug 2021 20:00:00 GMTఏయన్నార్ సినీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీగా ప్రేమాభిషేకాన్ని చెప్పుకోవాలి. ఈ సినిమా ఆంధ్రా కర్నాటక రాష్ట్రాలలో ఏకంగా అయిదు వందల రోజుల పాటు ఆడి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రేమాభిషేకం ఏయన్నార్ సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతమైన చిత్రంగానూ పేర్కొంటారు.

అలాంటి  ప్రేమాభిషేకం మూవీని షూటింగ్ మధ్యలో ఆపేయాలని అనుకున్నారా. నిజంగా ఇది వింతగానే ఉంటుంది కదా. అయితే ఆ ప్రయత్నం జరిగిందిట. ఈ మూవీని అక్కినేని నాగేశ్వరరావు తన సొంత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ పతాకం మీద నిర్మించారు. ఈ మూవీకి శ్రీవారి ముచ్చట్లు షూటింగ్ టైమ్ లోనే అక్కినేని  ఓకే చెప్పేశారు. ఇక ప్రేమాభిషేకం మూవీ షూటింగ్ కూడా మొదలైంది. కొంత జరిగాకా అక్కినేనికి అనుమానం వచ్చిందట. ఈ కధ దేవదాస్ మూవీ కధలాగానే ఉంది అని.

దాంతో అప్పటికే దేవదాస్ మళ్లీ పుట్టాడు అన్న సినిమా దాసరి డైరెక్షన్ లో చేసి ఉండడంతో మళ్ళీ అదే సినిమా అవుతుందా అన్న అనుమానంతో ఆపేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారుట. అది ఆయన సన్నిహితుల ద్వారా నాటి నిర్మాత కాకర్ల క్రిష్ణకు తెలిసిందిట. ఆయన దాసరినారాయణరావు వద్దకు వెళ్ళి ఈ విషయం ప్రస్థావిస్తే ఆయన అలాంటిదేమీ లేదు. మన సినిమా స్టోరీయే భిన్నం. ఇది కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పారుట.

ఆ తరువాత కధకు పట్టు ఉండేలా అద్భుతమైన డైలాగ్స్ ని కూడా దాసరి రాశారుట. ఇక ఏడు పాటలు కూడా ఆణిముత్యాలు. శ్రీదేవి, జయసుధ లాంటి టాప్ స్టార్  హీరోయిన్స్, మంచి కాస్టింగ్, అధ్బుతమైన టెక్నీషియన్స్ ఇవన్నీ కలసి ప్రేమాభిషేకాన్ని ఎక్కడో నిలబెట్టాయి. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడమే కాదు. చరిత్రలో నిలిచే చిత్రమైంది. ఆ వివరాలను అలనాటి నిర్మాత కాకర్ల క్రిష్ణ ఒక చానల్ ఇంటర్వ్యూలో చెప్పుకురావడంతో ప్రేమాభిషేకం వెనకాల ఇంత కధ ఉందా అని అందరికీ తెలిసింది.





అయిదేళ్ళూ ఈ మంత్రులేనా ?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>