BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagc2d3d7a0-cbbc-4602-acec-56def4fc2d59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagc2d3d7a0-cbbc-4602-acec-56def4fc2d59-415x250-IndiaHerald.jpgక‌రోనా మూడో ద‌శ ప్ర‌మాదం పొంచివున్న నేప‌థ్యంలో వినాయ‌కచ‌వితితోపాటు ఇత‌ర పండ‌గ‌ల సంద‌ర్భంగా ప్ర‌జ‌లు గుమిగూడ‌కుండా చూడాల‌ని తెలంగాణ హైకోర్టు సూచించింది. గ‌త సంవ‌త్స‌రం జ‌న‌స‌మూహాల‌కు అనుమ‌తివ్వ‌లేద‌ని, అలాగే ఈ ఏడాది కూడా క‌ఠిన‌చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీచేసింది. హుస్సేన్‌సాగ‌ర్‌లో వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేయ‌డానికి అనుమ‌తివ్వ‌రాద‌ని, గ‌తంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌డంలేదంటూ న్యాయ‌వాది వేణుమాధ‌వ్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిtag{#}court;Telanganaవినాయ‌క నిమ‌జ్జ‌నం ఎలా?వినాయ‌క నిమ‌జ్జ‌నం ఎలా?tag{#}court;TelanganaThu, 12 Aug 2021 08:20:00 GMT
క‌రోనా మూడో ద‌శ ప్ర‌మాదం పొంచివున్న నేప‌థ్యంలో వినాయ‌కచ‌వితితోపాటు ఇత‌ర పండ‌గ‌ల సంద‌ర్భంగా ప్ర‌జ‌లు గుమిగూడ‌కుండా చూడాల‌ని తెలంగాణ హైకోర్టు సూచించింది. గ‌త సంవ‌త్స‌రం జ‌న‌స‌మూహాల‌కు అనుమ‌తివ్వ‌లేద‌ని, అలాగే ఈ ఏడాది కూడా క‌ఠిన‌చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీచేసింది. హుస్సేన్‌సాగ‌ర్‌లో వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేయ‌డానికి అనుమ‌తివ్వ‌రాద‌ని, గ‌తంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌డంలేదంటూ న్యాయ‌వాది వేణుమాధ‌వ్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ హిమ కోహ్లి, జ‌స్టిస్ బి.విజ‌య‌సేన్‌రెడ్డితో కూడిన ధ‌ర్మానం విచారించింది. నిమ‌జ్జ‌నంపై తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తెలియ‌జేసేందుకు కొంత గ‌డువు కావాల‌ని స్పెష‌ల్ జీపీ హ‌రీంద‌ర్ విజ్ఞ‌ప్తిచేయ‌గా ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదాల‌డిగారు.. మేం స‌మ‌యం ఇచ్చాం.. మీ నిర్ణ‌యాన్ని వినాయ‌క‌చ‌వితి అయిపోయిన త‌ర్వాత చెబుతారా? అంటూ నిల‌దీసింది. వారంరోజుల్లో ప్ర‌భుత్వం నిర్ణ‌యం చెప్పాలంటూ కేసును మ‌రోవారానికి వాయిదా వేసింది.





13న బ‌డ్జెట్ స‌మావేశాలు

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>