MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sanjay-lele-bansali207bd749-56d8-4711-9550-1bc378e0aff7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sanjay-lele-bansali207bd749-56d8-4711-9550-1bc378e0aff7-415x250-IndiaHerald.jpg ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీ నుంచి వెబ్ సిరీస్‌ల వైపు ఎక్కువ‌గా అడుగులు ప‌డుతున్నాయి. అందులో భాగంగానే భార‌త దేశంలోనే గొప్ప ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన సంజ‌య్ లీలా భ‌న్సాలీ కూడా వెబ్ సిరిస్ ను రూపొందించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. `హీరా మండి ` సిరిస్ భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తొలుత సినిమాగా తీయాల‌నుకున్నా ఈ ప్రాజెక్ట్ ను ఇప్పుడు వెబ్ సిరిస్‌గా రూపొందించ‌బోతు న్నారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ త‌న కెరీర్‌లో `దేవ‌దాస్‌sanjay lele bansali{#}rajeev;contract;Alia Bhatt;NET FLIX;Cinemaవంద‌ల కోట్ల‌తో వెబ్ సిరిస్‌.. భ‌న్సాలీ ప్లాన్ అదేనా?వంద‌ల కోట్ల‌తో వెబ్ సిరిస్‌.. భ‌న్సాలీ ప్లాన్ అదేనా?sanjay lele bansali{#}rajeev;contract;Alia Bhatt;NET FLIX;CinemaThu, 12 Aug 2021 10:58:14 GMT    ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీ నుంచి వెబ్ సిరీస్‌ల వైపు ఎక్కువ‌గా అడుగులు ప‌డుతున్నాయి. అందులో భాగంగానే భార‌త దేశంలోనే గొప్ప ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన సంజ‌య్ లీలా భ‌న్సాలీ కూడా వెబ్ సిరిస్ ను రూపొందించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. `హీరా మండి ` సిరిస్ భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తొలుత సినిమాగా తీయాల‌నుకున్నా ఈ ప్రాజెక్ట్ ను ఇప్పుడు వెబ్ సిరిస్‌గా రూపొందించ‌బోతు న్నారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ త‌న కెరీర్‌లో `దేవ‌దాస్‌`, `రామ్‌లీలా`, `బాజీరావ్ మ‌స్తానీ` , ప‌ద్మావ‌త్‌` లాంటి సినిమాలు అత్యుత్త‌మ చిత్రాలుగా నిలిచాయి.


    సంజ‌య్ లీలా భ‌న్సాలీ పాతికేళ్ల చ‌రిత్ర‌లో ఆయ‌న చేసిన సినిమాలు చాలా త‌క్కువ‌. మూడు, నాలుగు సంవ‌త్స‌రాల స‌మ‌యం తీసుకుని ఒక సినిమాను రూపొందిస్తారు. కానీ ఆ చిత్రాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. `ప‌ద్మావ‌త్‌` సినిమా త‌రువాత స‌ల్మాన్‌ఖాన్ తో ఓ సినిమా చేయాల‌నుకున్నారు సంజ‌య్ లీలా భ‌న్సాలి. కానీ ప‌లు కార‌ణాల‌తో ఆ సినిమా ముందుకు క‌ద‌ల్లేదు. దీంతో ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో `గంగూభాయ్ క‌తియావాడి` అనే గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాను రూపొందించాడు భ‌న్సాలి. ఇప్పుడు విడుద‌ల‌కు సిద్దంగా ఉంది `గంగూభాయ్ క‌తియావాడి`.


అయితే, త‌న తదుప‌రి సినిమా కోసం సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే  `హీరా మండి` వెబ్ సిరిస్‌ను తీయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్‌కు చెందిన తార‌లు న‌టించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వెబ్ సిరిస్‌ను నెట్ ఫ్లిక్స్ భాగ‌స్వామ్యంతో భారీగా బ‌డ్జెట్ పెట్టి ఈ సిరిస్‌ను నిర్మించ‌డానికి ఒప్పందం కుదిరింది. వంద‌ల కోట్ల తో తీయ‌నున్న ఈ ప్రాజెక్ట్ పై హైప్ మ‌రింత పెరిగింది. భార‌త దేశానికి స్వాతంత్య్రం రాక‌ముందు ఉన్న ప‌రిస్థితుల ఆధారంగా ఈ సిరిస్‌ను తీయ‌నున్నారు.
   
     సంజ‌య్‌లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న గంగూభాయ్ క‌తియావాడి గ‌తంలో వివాద‌స్ప‌దంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో గంగూభాయ్‌ను కించ‌ప‌రిచేలా స‌న్నివేశాలున్నాయ‌ని పేర్కొంటూ ఆమె ద‌త్త పుత్రుడు రాజీవ్ షా కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశాడు. గ‌త కొద్ది రోజుల క్రితం విడుద‌ల‌యిన ట్ర‌యిల‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంది.
     








హైదరాబాద్ లో వ్యాక్సిన్ చుక్కలు చూపిస్తుందా...?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>