CrimeN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-d82f9a16-ada9-4c9d-bad1-7a6992cae85a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-d82f9a16-ada9-4c9d-bad1-7a6992cae85a-415x250-IndiaHerald.jpgమనుషులు మానవత్వాన్ని మరిచి.. క్రూరమృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఆలోచన ధోరణిని మరిచి క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలకు బానిసవుతున్నారు. తమ పుట్టుకను మరిచి.. పసి పిల్లల ప్రాణాలు తీసేంతవరకు వెళుతున్నారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో ఎక్కడో ఒక చోట నమోదు చేసుకూనే ఉంటోంది.murder {#}local language;Traffic police;policeదారుణం.. బతికున్న శిశువుని ఖననం చేయాలనుకున్నారు..?!దారుణం.. బతికున్న శిశువుని ఖననం చేయాలనుకున్నారు..?!murder {#}local language;Traffic police;policeThu, 12 Aug 2021 21:31:00 GMTమనుషులు మానవత్వాన్ని మరిచి.. క్రూరమృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఆలోచన ధోరణిని మరిచి క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలకు బానిసవుతున్నారు. తమ పుట్టుకను మరిచి.. పసి పిల్లల ప్రాణాలు తీసేంతవరకు వెళుతున్నారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో ఎక్కడో ఒక చోట నమోదు చేసుకూనే ఉంటోంది. స్వార్థం, అవసరం, డబ్బు వ్యామోహంలో పడి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. బతికున్న ప్రాణాన్నే బలి ఇవ్వడానికి పూనుకుంటున్నారు. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండానే పురుట్లోనే గొంతు నులిపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కొందరు దుర్మార్గులు ఓ పసికందు ప్రాణాలు తీయాలని అనుకున్నారు. ఆ చిన్నారిని ఒక కవర్‌లో చుట్టి ఖననం చేయాలని కాటికాపరిని కోరారు.

బతికున్న చిన్నారిని పూడ్చిపెట్టాలని ప్రయత్నించిన ఘటన విశాఖపట్నంలోని జ్ఝానాపురంలో చోటు చేసుకుంది. కాన్వెంట్ జంక్షన్‌లోని హిందూ స్మశాన వాటిక దగ్గర నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. వారిలో చేతిలో క్లాత్‌తో చుట్టిన ఒక శిశువు ఉంది. కాటి కాపరి దగ్గరికి వెళ్లి ఆ శిశువుని ఖననం చేయాలని కోరారు. దీంతో అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకున్న కాటికాపరి ఖననానికి పనులు ప్రారంభించాడు. ఆ తర్వాత స్మశానవాటిక సిబ్బంది పిల్లాడిపై ఉన్న బట్టను తొలగించి చూడగా.. ఆ చిన్నారి ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించాడు.

దీంతో స్మశాన వాటిక సిబ్బంది ఆ నలుగురిని నిలదీశారు. బతికున్న చిన్నారిని ఎందుకు ఖననం చేయాలని ప్రశ్నించడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం సిబ్బంది చిన్నారిని స్థానిక ఏరియా ఆస్పత్రిలో జాయిన్ చేయించి చికిత్స అందజేశారు. అయితే ఆస్పత్రి సిబ్బంది కూడా వీరిపై దురుసుగా వ్యవహరిచింది. దీంతో స్మశాన వాటిక సిబ్బంది స్థానిక కంచరపాలెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ మేరకు జరిగిన విషయాన్ని వెల్లడించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ ఆ చిన్నారు ఎవరూ..? అసలు ఆ పిల్లాడిని ఎందుకు చంపాలని అనుకున్నారు..? ఆ నలుగురు ఎవరూ..? బతికున్న పిల్లాడినే ఎందుకు చంపాలని అనుకున్నారు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



బంపర్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన కుర్ర హీరోయిన్ ?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>