MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shivathmika-rajashekarad8ce554-dc51-413e-9425-9e0f9d3563f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shivathmika-rajashekarad8ce554-dc51-413e-9425-9e0f9d3563f5-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ శివాత్మిక రాజశేఖర్, ఆనంద్ దేవరకొండ హీరోగా, కెవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'దొరసాని' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో చిన్న దొరసాని పాత్రలో ఈ ముద్దుగుమ్మ నటనకు విమర్శకుల నుండి మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. పల్లెటూరి నేపథ్యంలో జరిగే ప్రేమ కథ లో శివాత్మిక రాజశేఖర్ చేసిన నటనను చూసిన చాలా మంది ఈ ముద్దుగుమ్మ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తోంది అని అనుకున్నారు. కాకపోతే శివాత్మిక మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్Shivathmika rajashekar{#}Arjun;Rajasekhar Sivatmika;Anand Deverakonda;Dorasani;Prema Katha;BEAUTY;Kollywood;Remake;Blockbuster hit;Heroine;Telugu;News;Director;Cinemaమంచి సినిమాను కోల్పోయిన శివాత్మిక రాజశేఖర్..!మంచి సినిమాను కోల్పోయిన శివాత్మిక రాజశేఖర్..!Shivathmika rajashekar{#}Arjun;Rajasekhar Sivatmika;Anand Deverakonda;Dorasani;Prema Katha;BEAUTY;Kollywood;Remake;Blockbuster hit;Heroine;Telugu;News;Director;CinemaThu, 12 Aug 2021 13:20:00 GMTఅందాల ముద్దుగుమ్మ శివాత్మిక రాజశేఖర్, ఆనంద్ దేవరకొండ హీరోగా, కెవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'దొరసాని' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది.  ఈ సినిమాలో చిన్న దొరసాని పాత్రలో ఈ ముద్దుగుమ్మ నటనకు విమర్శకుల నుండి మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల  నుండి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. పల్లెటూరి నేపథ్యంలో  జరిగే ప్రేమ కథ లో శివాత్మిక రాజశేఖర్ చేసిన నటనను  చూసిన చాలా మంది  ఈ ముద్దుగుమ్మ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తోంది అని అనుకున్నారు.  కాకపోతే శివాత్మిక మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే ఎంచుకొని ముందుకు పయనిస్తోంది.

అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు తెలుగు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు  రెడీ అవుతోంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ బ్యూటీ ఒక మంచి అవకాశాన్ని  కోల్పోయిందట. మలయాళం లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'కప్పెల' మూవీ ని తెలుగులో డెబ్యూ డైరెక్టర్ టి రమేష్ రీమేక్ చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. సిద్ధు జొన్నల గడ్డ, అర్జున్ దాస్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో మొదటగా శివాత్మిక రాజశేఖర్ నే హీరోయిన్ గా తీసుకోవాలని చిత్రబృందం అనుకున్నారట. అయితే శివాత్మక వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆమె స్థానంలో ఈ సినిమాలో మలయాళ నటి అనిక సురేంద్రన్‌ను చిత్ర బృందం ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో  శివాత్మిక రాజశేఖర్ మంచి అవకాశాన్ని చేజార్చుకుంది అంటూ చిత్ర వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'పంచతంత్రం' అనే సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు 'ఆనందం విలయదుం వీడు' అనే సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.



ఈ బాల నటి తండ్రి టాలీవుడ్ టాప్ విలన్..??

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>