PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/phone-calls8373c9b8-be23-43cf-b7c9-5829e2c65ee3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/phone-calls8373c9b8-be23-43cf-b7c9-5829e2c65ee3-415x250-IndiaHerald.jpgప్రస్తుతం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ లీకేజీల వ్యవహారం హాట్ హాట్ గా నలుగుతోంది. అవును... ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇదే విషయంపై డిస్కషన్. ఇంకా చెప్పాలంటే ఫోన్ లో మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి. ఏ ఫోన్ మాట్లాడితే.. ఏ తంటా వస్తుందో అని భయం. భయానికి మీనింగే తెలియదన్నట్లుగా ఉన్న వైసీపీ నేతలే.. ఇప్పుడు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎవరితో ఏం మాట్లాడామో.. అది ఎవరు విన్నారో... దానిని ఎవరు బయటపెడతారో అని దినదిన గండం నూరేళ్ల ఆయుషు మాదిరి బతికేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ఆడియా లీకేజీల వ్Phone Calls{#}Sattenapalle;Thadikonda;Sri Venkateswara Bhakti Channel;Capital;Y. S. Rajasekhara Reddy;festival;Interview;MLA;Yevaru;sree;Audio;Smart phone;Party;Industry;Jagan;YCPవైసీపీలో హాట్ టాపిక్ గా ఫోన్ లీకేజీలువైసీపీలో హాట్ టాపిక్ గా ఫోన్ లీకేజీలుPhone Calls{#}Sattenapalle;Thadikonda;Sri Venkateswara Bhakti Channel;Capital;Y. S. Rajasekhara Reddy;festival;Interview;MLA;Yevaru;sree;Audio;Smart phone;Party;Industry;Jagan;YCPWed, 11 Aug 2021 15:39:00 GMTవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ లీకేజీల వ్యవహారం హాట్ హాట్ గా నలుగుతోంది. అవును... ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇదే విషయంపై డిస్కషన్. ఇంకా చెప్పాలంటే ఫోన్ లో మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి. ఏ ఫోన్ మాట్లాడితే.. ఏ తంటా వస్తుందో అని భయం. భయానికి మీనింగే తెలియదన్నట్లుగా ఉన్న వైసీపీ నేతలే.. ఇప్పుడు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎవరితో ఏం మాట్లాడామో.. అది ఎవరు విన్నారో... దానిని ఎవరు బయటపెడతారో అని దినదిన గండం నూరేళ్ల ఆయుషు మాదిరి బతికేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ఆడియా లీకేజీల వ్యవహారం వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఆడియో లీకేజీ వ్యవహారంలో ముందుగా బలైంది ఎవరూ అంటే... అంతా ఠక్కున చెప్పే పేరు సినీ నటుడు పృధ్వీరాజ్. వైఎస్ జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్ గా నిలిచిన పృధ్వీ రాజ్.. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక పదవి దక్కింది. శ్రీ వేంకటేశ్వర భక్తీ ఛానల్ ఛైర్మన్ గా అవకాశం దక్కించుకున్న పృద్వీరాజ్... కొద్ది రోజుల పాటు బాగానే ఉన్నారు. అయితే ఓ పండుగ సందర్భంగా ఆయన ఎస్వీబీసీ ఛానల్ కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన రిహాల్సస్ వీడియో ముందుగా బయటకు రావడంతో.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పరువు పోయింది. ఆ తర్వాత ఛానల్ లో పనిచేసే ఓ మహిళతో ఆయన మాట్లాడిన ఆడియో టేప్ పెను దుమారం రేపింది. చివరికి ఆయన తన పదవినే వదులుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ ఆడియో టేప్ ఆమె రాజకీయ జీవితానికే ఓ మచ్చగా మిగిలిపోయింది. పేకాట శిబిరం నిర్వహించుకునేందుకు అనుమతులు కావాలని సొంత పార్టీ కార్యకర్తలు చేసిన ఫోన్... దానిపై సాగిన బేరసారాల ఆడియో మొత్తం కూడా అప్పట్లో పెద్ద హల్ చల్ చేసింది. ఆమె పేరు కూడా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఇదంతా సొంత పార్టీ నేతల కుట్ర అని తానే స్వయంగా ప్రకటించారు కూడా. ఇప్పుడు తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఆడియో లీకేజ్ బాధితుల జాబితాలో చేరారు. ఓ మహిళతో మాట్లాడినట్లుగా ఓ ఆడియా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అసలే అమాత్య పదవి ఆశిస్తున్న అంబటికి ఇది ఇప్పుడు పెద్ద అవరోధంగా మారింది. అది తన ఆడియో కాదని... ఎవరో గిట్టని వాళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రెండు రోజులుగా అంబటి గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలకు పట్టుకున్న గుబులల్లా ఒకటే.. ఫోన్ టాకింగ్. ఎవరితో ఏం మాట్లాడితే... ఏం తంటా వస్తుందో అని భయం.





అసలు దేవుడున్నాడా?.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఏమంటున్నారంటే?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>