PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp6e400b37-0053-4dcf-aadf-7594443fccc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp6e400b37-0053-4dcf-aadf-7594443fccc2-415x250-IndiaHerald.jpgమొదట నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా కూడా ఒకటి... ఈ జిల్లాలో ఎప్పుడు టీడీపీకి అనుకూల ఫలితాలే వచ్చేవి...కానీ గత ఎన్నికల్లో మాత్రం ఈ జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. వైసీపీ సత్తా చాటినా సరే టీడీపీ కాస్త బలంగానే కనిపిస్తోంది. ఆ పార్టీ తరుపున స్ట్రాంగ్ నాయకులు ఉన్నారు కాబట్టి, మళ్ళీ పార్టీ త్వరగానే పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో మాత్రమే టీడీపీని నడిపించే నాయకుడు ఎవరో క్లారిటీ రావడం లేదు. tdp{#}bharathi old;murali;Telugu Desam Party;local language;TDP;YCP;CBN;Party;Hanu Raghavapudi;Srikakulamమాజీ స్పీకర్ వారసురాలుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా?మాజీ స్పీకర్ వారసురాలుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా?tdp{#}bharathi old;murali;Telugu Desam Party;local language;TDP;YCP;CBN;Party;Hanu Raghavapudi;SrikakulamWed, 11 Aug 2021 03:00:00 GMTమొదట నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా కూడా ఒకటి... ఈ జిల్లాలో ఎప్పుడు టీడీపీకి అనుకూల ఫలితాలే వచ్చేవి...కానీ గత ఎన్నికల్లో మాత్రం ఈ జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. వైసీపీ సత్తా చాటినా సరే టీడీపీ కాస్త బలంగానే కనిపిస్తోంది. ఆ పార్టీ తరుపున స్ట్రాంగ్ నాయకులు ఉన్నారు కాబట్టి, మళ్ళీ పార్టీ త్వరగానే పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో మాత్రమే టీడీపీని నడిపించే నాయకుడు ఎవరో క్లారిటీ రావడం లేదు.

అలా టీడీపీకి నాయకుడు లేని నియోజకవర్గం వచ్చి రాజాం. మొదట నుంచి రాజాంలో టీడీపీకి పెద్దగా అనుకూల పరిస్తితులు ఉండవు. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఓడిపోతూనే వస్తుంది. కానీ ఇప్పుడుప్పుడే నియోజకవర్గంలో వైసీపీపై వ్యతిరేకిత పెరుగుతుండటంతో టీడీపీకి కలిసొచ్చేలా ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులుపై కాస్త వ్యతిరేకిత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జోగులు వల్ల రాజాంకు ఒరిగిందేమీ లేదు.

ప్రభుత్వ పథకాలు మినహా, ఇక్కడ కొత్తగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏమి కనిపించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజాంలో టీడీపీకి అనుకూలంగా రాజకీయం మారుతుంది. కానీ వైసీపీకి ఉన్న మైనస్‌ని ఉపయోగించుకోలేని స్థితిలో టీడీపీ ఉంది.

ఎందుకంటే రాజాంలో టీడీపీని నడిపించే నాయకుడు ఎవరో ఇంతవరకు క్లారిటీ లేదు. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తరుపున మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున కొండ్రు మురళి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక మురళి టీడీపీలో అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే రాజాం టీడీపీ బాధ్యతలు తన వారసురాలు గ్రీష్మకు ఇవ్వాలని మాజీ స్పీకర్, టీడీపీ అధిష్టానాన్ని ఎప్పటినుంచో కోరుతున్నారు. కానీ చంద్రబాబు ఇంతవరకు ఇన్‌చార్జ్‌ని పెట్టలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో రాజాం బాధ్యతలు మాజీ స్పీకర్ ఫ్యామిలీకే అప్పగించడానికి చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.



మాజీ స్పీకర్ వారసురాలుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>