EditorialRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india-021b25ae-882a-4367-bde2-208b28f7d38c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india-021b25ae-882a-4367-bde2-208b28f7d38c-415x250-IndiaHerald.jpgఇప్పుడు 75 ఏళ్ల భార‌తావ‌ని మ‌న‌తో మాట్లాడుతుంది.జీవన్ముక్తం అయిన దారిలో మాట్లాడుతుంది.విజ‌యీ విశ్వ‌తి రంగా ప్యారా..ఝండా ఉంఛా ర‌హే హ‌మారా అని పాడుకొమ్మ‌ని ఆదేశిస్తుంది.దేశానికి శిర‌స్సువంచ‌డం బాధ్య‌త..శిర‌సావ‌హించిన బాధ్య‌త‌ను నెత్తిన పెట్టుకుని ప్ర‌యాణించండి అది క‌ర్త‌వ్యం..దేశానికి కానుక‌లు ఇవ్వాలి అని అంటారా?indiaమార్నింగ్ రాగా : పంద్రాగ‌స్టు కానుక‌లు ఉన్నాయా?మార్నింగ్ రాగా : పంద్రాగ‌స్టు కానుక‌లు ఉన్నాయా?indiaWed, 11 Aug 2021 10:20:00 GMTమ‌ట్టి నుంచి మ‌నిషి వ‌ర‌కూ
ఒక దేశాన్ని కప్పి ఉంచే
భావం క‌లిపి ఉంచే భావం
కూడా ఇదే..

భ‌క్తి అనే ప‌దాన్ని విరిచేయ‌కండి
దేశాన్ని ప్రేమిస్తే భ‌క్తి అన్న ప‌దం
ఒక ప్రబోధ అయి తీరుతుంది
ఈ దేశాన్ని ప్రేమించే స్థితిలో
లేని వారిని వెలివేయండి
అదే మీరు ఇచ్చే ఈ పంద్రాగ‌స్టు కానుక

సామ్రాజ్య వాద దాహాన్ని
మ‌నం నిలువ‌రించాలి

తెల్ల‌దొర‌ల ఆగ‌డాలు నిలువ‌రించాలి
కొత్త చైత‌న్య పోక‌డ‌ల్లో ప‌రిఢ‌విల్లాలి

దేశం కోసం త్యాగం ఎంత గొప్ప‌దో
చాటి చెప్పిన వారికి వంద‌నాలు చెల్లించాలి

ఇప్పుడు 75 ఏళ్ల భార‌తావ‌ని మ‌న‌తో మాట్లాడుతుంది.జీవన్ముక్తం అయిన దారిలో మాట్లాడుతుంది.విజ‌యీ విశ్వ‌తి రంగా ప్యారా..ఝండా ఉంఛా ర‌హే హ‌మారా అని పాడుకొమ్మ‌ని ఆదేశిస్తుంది.దేశానికి శిర‌స్సువంచ‌డం బాధ్య‌త..శిర‌సావ‌హించిన బాధ్య‌త‌ను నెత్తిన పెట్టుకుని ప్ర‌యాణించండి అది క‌ర్త‌వ్యం..దేశానికి కానుక‌లు ఇవ్వాలి అని అంటారా? ఏం వ‌ద్దు స‌ర్..దేశాన్ని పీడించే పేద‌రికాలు పీడించే సంప‌న్న వర్గాలు క‌లిసి ఓ ఒప్పందానికి వ‌స్తే..ఒక స‌మాన‌త అన్న‌ది సృష్టి... ఆ సృష్టి వికాసమే ఈ దేశం. మీరు ఆ ప‌ని చేయ‌డం మ‌రువ‌కండి. ఇదే కానుక.

దేశానికి ప‌చ్చ‌ని నేలలు కావాలి దేశానికి పొంగి పొర‌లు న‌దులు కావాలి న‌దులు న‌డయాడే చోటు విలసిల్లిన నాగ‌రిక‌త‌ల  ప్రాధాన్యాలు మాన‌వ మ‌నుగ‌డ‌ను కాపాడేందుకు ఉప‌యోగ‌ప‌డాలి..ఇవేవీ లేని దేశంలో మ‌నం ఉన్నా లేకున్నా ఒక్క‌టే.. నా దేశాన్ని పీడించే రాజకీయ శక్తుల నుంచి పొందే విముక్తి నాకు గ‌ర్వ‌కార‌ణం అయి ఉంటుంది. నాలో చైత‌న్యం నింపి ఉంటుంది అని భార‌తీయులు అనుకుంటే చాలు స‌ర్..ఇంకేం వ‌ద్దు.. కానీ ఆ స్థాయిలో దేశం లేన‌ప్పుడు కొన్ని వేల పంద్రాగ‌స్టులు కూడా ఉన్నా లేకున్నా నా దృష్టిలో ఒక్క‌టే...పాడి పంట‌ల దేశం.. క‌ల‌ల పంట‌ల దేశం... నేల పొంగి నింగి దాకా త‌న సందేశాన్ని వినిపింప‌జేసిన దేశం..చుక్క‌ల్లో దిక్కుల్లో ఒక్క‌టిగా నిలిచిన దేశం. అది భ‌విత‌కు సంకేతం.. భాగ్య విదాత‌లు ఎక్కడున్నారో వెత‌కాలి.. అదే ఈ దేశానికి కానుక.

 



ఏపీలో బాంబ్ బ్లాస్ట్స్ కలకలం!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>