PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rice-spoon-ginnis-record2a7f2140-54ee-4208-b03d-0b631321d2cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rice-spoon-ginnis-record2a7f2140-54ee-4208-b03d-0b631321d2cc-415x250-IndiaHerald.jpg కొందరు చేతులతో అద్భుతాలు చేస్తారు. అద్భుత నైపుణ్యం అనేది చేతిలో ఉన్నా కూడా చాలా మంది ప్రతిభ అనేది వెలుగులోకి రాదు. అసలు వారి ప్రతిభను ఎవరూ కూడా గుర్తించరు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉండడంతో కళాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వారికి తగిన గుర్తింపు దక్కుతోంది. తాజాగా చెక్కతో అతి సూక్ష్మ స్పూన్‌ రికార్డు కెక్కింది. తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు దొంతంశెట్టి బాలనాగేశ్వరరావు చెక్క స్పూన్ తో గిన్నిస్‌ రికార్డులోకెక్కారు. స్వర్ణకారుడిగా పని చేస్తున్న ఆయనుrice, spoon, ginnis record{#}media;East;District;Athadu;January;Mandapetaఈ చెక్క స్పూన్ కి అరుదైన గౌరవం...?ఈ చెక్క స్పూన్ కి అరుదైన గౌరవం...?rice, spoon, ginnis record{#}media;East;District;Athadu;January;MandapetaWed, 11 Aug 2021 14:00:00 GMTమీడియా ఉండడంతో కళాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వారికి తగిన గుర్తింపు దక్కుతోంది. తాజాగా చెక్కతో అతి సూక్ష్మ స్పూన్‌ రికార్డు కెక్కింది. తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు దొంతంశెట్టి బాలనాగేశ్వరరావు చెక్క స్పూన్ తో గిన్నిస్‌ రికార్డులోకెక్కారు. స్వర్ణకారుడిగా పని చేస్తున్న ఆయనుకు చాలా ఏళ్లుగా ఇటువంటివి చేయడం అంటే ఇష్టం.

అందుకే ఆయన చిన్న చిన్న పరిమాణంలో కళాకృతులు తయారు చేస్తూ ఉంటారు. గతంలో ఇలా చాలా వస్తువులను ాయన తయారు చేసి అందర్నీ ఆక్టుకున్నారు. ఇది ఎలా సాధ్యం అని చుట్టు పక్కల వారంతా వచ్చి చూడటం ప్రారంభించారు. అలా ఆయన మండపేటలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అనేక రికార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తాజాగా మరో రికార్డును నెలకొల్పాడు.

బియ్యంపు గింజ పరిమాణంలో వస్తువు తయారు చేయాలంటేనే చాలా కష్టం. అంత సూక్ష్మ వస్తువు కంటికే కనిపించదు. దాన్ని చెక్కి అపురూప వస్తువుగా మరల్చాలంటే ఎంతో శ్రమ నైపుణ్యం ఉండాలి. కానీ అతడు పంచదార పలుకు కంటే చిన్న పరిమాణంలో చెక్క స్పూన్‌ ను తయారీ చేశాడు. ఇప్పుడు ఆ స్పూన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. విషయం తెలుసుకున్న గిన్నిస్ నిర్వాహకులు అతడి స్పూన్ ను రికార్డులకు ఎక్కించారు. ఈ ఏడాది జనవరి 10వ తేదిన మండపేట పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో ప్రభుత్వాధికారులు, గిన్నిస్‌ సంస్థ ప్రతినిధుల సమక్షంలో అతిసూక్ష్మ చెక్క స్పూన్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ఆయన తయారు చేసిన స్పూన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


టీఆర్ఎస్‌లో ఎంపీలకు స్వేచ్ఛలేదు: బీజేపీ ఎంపీ అరవింద్‌

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>