PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/is-deputy-cms-allout-in-jagan-cabinet-13dd35b3-54b6-4e82-b51f-f8024cea25f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/is-deputy-cms-allout-in-jagan-cabinet-13dd35b3-54b6-4e82-b51f-f8024cea25f5-415x250-IndiaHerald.jpgఅన్నీ సామాజికవర్గాలకు న్యాయం చేయడంలో సీఎం జగన్ ఎప్పుడు ముందే ఉంటారని చెప్పొచ్చు. అటు పార్టీలో కావొచ్చు...ఇటు ప్రభుత్వంలో కావొచ్చు.. అన్నీ వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే తన క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎంల విషయంలో కూడా అన్నీ కులాలకు న్యాయం చేశారు. ఓసీ వర్గానికి చెందిన ఆళ్ళ నానికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అలాగే ఈయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. jagan{#}Scheduled Tribes;Deputy Chief Minister;Backward Classes;Cabinet;Alla Ramakrishna Reddy;krishna;Scheduled caste;CMడిప్యూటీ సీఎంలు ఆలౌట్?డిప్యూటీ సీఎంలు ఆలౌట్?jagan{#}Scheduled Tribes;Deputy Chief Minister;Backward Classes;Cabinet;Alla Ramakrishna Reddy;krishna;Scheduled caste;CMWed, 11 Aug 2021 00:00:00 GMTఅన్నీ సామాజికవర్గాలకు న్యాయం చేయడంలో సీఎం జగన్ ఎప్పుడు ముందే ఉంటారని చెప్పొచ్చు. అటు పార్టీలో కావొచ్చు...ఇటు ప్రభుత్వంలో కావొచ్చు.. అన్నీ వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే తన క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎంల విషయంలో కూడా అన్నీ కులాలకు న్యాయం చేశారు. ఓసీ వర్గానికి చెందిన ఆళ్ళ నానికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అలాగే ఈయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

అటు  బీసీ వర్గానికి చెందిన ధర్మాన కృష్ణ డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు రెవిన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక ఎస్సీ వర్గానికి చెందిన నారాయణస్వామికి డిప్యూటీ సీఎం పదవితో పాటు, ఎక్సైజ్ శాఖని కూడా చూసుకుంటున్నారు. అలాగే ఎస్టీ వర్గానికి చెందిన పుష్పశ్రీవాణికి కూడా డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. అలాగే ఈమె గిరిజన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక మైనారిటీ శాఖతో పాటు అంజాద్ బాషకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించారు.

ఇలా అన్నీ కులాలకు సమ ప్రాధాన్యత ఇచ్చేలా జగన్.. ఐదుగురుకి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. అయితే త్వరలో జరగబోయే మంత్రివర్గ మార్పుల నేపథ్యంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలని క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశాలు లేకపోలేదని అధికార వైసీపీలో చర్చ నడుస్తోంది. అయితే ఈ ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఈ రెండు ఏళ్లలో మెరుగైన పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పైగా ఇందులో కొందరు డిప్యూటీ సీఎంలు అనే సంగతి రాష్ట్రంలో చాలామంది ప్రజలకు తెలియదనే అంటున్నారు. అంటే వీరు అంతగా హైలైట్ అవ్వలేదని తెలుస్తోంది. ఇక జగన్...మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ, రిపోర్టులు తయారుచేసుకుంటున్నారని తెలుస్తోంది. ఆ రిపోర్టుల్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు మంచి మార్కులు తెచ్చుకోవడంలో వెనుకబడి ఉన్నారని సమాచారం. అంటే నెక్స్ట్ ఈ ఐదుగురు క్యాబినెట్ నుంచి ఔట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి జగన్..అయిదుగురుకి మళ్ళీ అవకాశం ఇస్తారో...లేక పక్కన పెట్టేస్తారో?



డిప్యూటీ సీఎంలు ఆలౌట్?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>