PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedమారుతున్న కాలానికి తగినట్లుగా మన దేశ పరిపాలనా వ్యవస్థలో అప్లు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలకు రకరకాల సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తూ వస్తున్నారు. ఇలా బ్యాంకు అకౌంట్ ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లావాదేవీలను జరుపుకోవడానికి మీ బ్యాంక్ ఖాతాకు పాన్ కార్డుని అనుసంధానం చేయడం తప్పనిసరి అయింది. PAN WITH AADHAR LINK{#}Google;Press;Bank;Indian;Government;Coronavirus;Serviceక్షణంలో ఆధార్ తో పాన్ లింకింగ్... ఎలా అంటే ?క్షణంలో ఆధార్ తో పాన్ లింకింగ్... ఎలా అంటే ?PAN WITH AADHAR LINK{#}Google;Press;Bank;Indian;Government;Coronavirus;ServiceWed, 11 Aug 2021 11:00:00 GMTబ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తూ వస్తున్నారు. ఇలా బ్యాంకు అకౌంట్ ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లావాదేవీలను జరుపుకోవడానికి మీ బ్యాంక్ ఖాతాకు పాన్ కార్డుని అనుసంధానం చేయడం తప్పనిసరి అయింది. ఇదే సమయంలో ఆ పాన్ కార్డుకు ఆధార్ కూడా తప్పక లింక్ చేయాల్సి ఉంది. ఇలా లింక్ చేయడానికి ప్రభుత్వం అనేక పద్దతులను ప్రవేశ పెట్టింది. ఇది బ్యాంకులలో చేస్తున్నారు, ఇంతకు ముందు ఉన్న మీ సేవ కార్యాలయాల్లోనూ చేస్తూ ఉండేవారు. అయితే గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన విజయం తెలిసిందే. అయితే దీని వలన కొన్ని సేవలను పౌరులు కోల్పోయారు. 

అందుకోసం ప్రతి ఒక్కటి ఇంటి దగ్గర నుండి చేసుకోవడానికి వీలుగా యాప్ రూపంలోనూ, ఒక వెబ్ సైట్ రూపంలోనో తీసుకువస్తుంది. అదే విధంగా ప్రస్తుతం ఇండియన్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరికి వారే వీరు కొత్తగా డిజైన్ చేసిన ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్ సైట్ లో కొన్ని సులభమైన స్టెప్స్ పాటించడం వలన మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు. మరి ఏ విధంగా మీ ఆధార్ పాన్ లింక్ చేసుకోవాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

* ముందుగా మీ కంప్యూటర్ లో గూగుల్ సెర్చ్ లో ఈ - ఫైలింగ్ పోర్టల్ 2.0 కి వెళ్ళండి.

* అందులో "మన సేవలు" అనే టాబ్ పై నొక్కండి. అక్కడే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి... వాటిలో "లింక్ ఆధార్" పై క్లిక్ చేయండి.

* ఆ తర్వాత ఒక ఆన్లైన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో అడిగిన విధంగా అన్ని వివరాలను పూర్తి చేయండి. ఇందులో మీ పేరు, పాన్ నంబర్, ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్ లాంటి వివరాలను నింపాల్సి ఉంటుంది.

* మీరు అన్ని వివరాలను నింపిన తరువాత లాస్ట్ లో ఇచ్చిన వివరాలు అన్నీ కరెక్ట్ అని తెలపడానికి అగ్రీ బటన్ ను ప్రెస్ చేయండి.

* ఇది ప్రెస్ చేయగానే మీ మొబైల్ నంబర్ కు ఆరు అంకెల ఓటిపి వస్తుంది. ఈ నంబర్ ను ఎంటర్ చేసి మళ్లీ వ్యాలిడేట్ బటన్ ను ప్రెస్ చేయండి.

* ఆ తరువాత స్క్రీన్ పై మీరు ఆధార్ పాన్ లింక్ చేయడానికి రిక్వెస్ట్ కు సంబంధించిన  కన్ఫర్మేషన్  మేసేజ్ వస్తుంది.

 మీరు నింపిన వివరాలు అన్నీ ఆధార్ లో ఎలా ఉన్నాయో అలాగే ఉండేలా చూసుకోండి.

ఈ విధంగా చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవడం ద్వారా ఫాన్ ను ఆధార్ తో లింక్ చేసుకోవచ్చు.


కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్లు రావా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>