CrimePaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tamilanadu188fab93-5657-4325-8d40-347736b13dc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tamilanadu188fab93-5657-4325-8d40-347736b13dc8-415x250-IndiaHerald.jpgరోజురోజుకు దేశంలో అత్యాచార ఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. మ‌నుషులు ప‌శువులుగా మారి వికృత క్రీడ‌లు ఆడుతున్నారు. ఎన్ని సంఘ‌ట‌న‌లు జ‌రిగినా దుర్మార్గులు మార‌డం లేదు. ఆడ పిల్ల‌ల జీవితాల‌తో ఆడుకుంటూ వారి పాలిట మృత్యుశాపాలు గా మారుతున్నారు. ముక్కుప‌చ్చ‌లు ఆర‌ని ప‌సి పాప‌ల నుంచి ముస‌లి వాళ్ల వ‌రకు ఎవ‌రిని వ‌ద‌ల‌డం లేదు ఈ కామాందులు. ఒళ్లు మ‌రిచి స్త్రీ జాతికి పెనుముప్పుగా మారుతున్నారు. చేయని పాపానికి త‌మ జీవితాలు అర్థాంత‌రంగా ముగిసిపోతున్నాయి. తాజాగా హర్యానా రాష్ట్రం సోనిపట్ పరిధిలోని ఓ గ్రామంలో దారుణం జ‌రrape{#}WOMEN;deepak;Haryana;Police Station;Stree;policeత‌ల్లిని బెదిరించి కూతుళ్ల‌పై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..!త‌ల్లిని బెదిరించి కూతుళ్ల‌పై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..!rape{#}WOMEN;deepak;Haryana;Police Station;Stree;policeWed, 11 Aug 2021 08:08:00 GMT రోజురోజుకు దేశంలో అత్యాచార ఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. మ‌నుషులు ప‌శువులుగా మారి వికృత క్రీడ‌లు ఆడుతున్నారు. ఎన్ని సంఘ‌ట‌న‌లు జ‌రిగినా దుర్మార్గులు మార‌డం లేదు. ఆడ పిల్ల‌ల జీవితాల‌తో ఆడుకుంటూ వారి పాలిట మృత్యుశాపాలు గా మారుతున్నారు. ముక్కుప‌చ్చ‌లు ఆర‌ని ప‌సి పాప‌ల నుంచి ముస‌లి వాళ్ల వ‌రకు ఎవ‌రిని వ‌ద‌ల‌డం లేదు ఈ కామాందులు. ఒళ్లు మ‌రిచి స్త్రీ జాతికి పెనుముప్పుగా మారుతున్నారు. చేయని పాపానికి త‌మ జీవితాలు అర్థాంత‌రంగా ముగిసిపోతున్నాయి.

తాజాగా హర్యానా రాష్ట్రం సోనిపట్ పరిధిలోని ఓ గ్రామంలో దారుణం జ‌రిగింది. తల్లిని బెదిరించి ఇద్దరు మైనర్ బాలికపై నలుగురు దుర్మార్గులు అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. ఆ త‌రువాత వాళ్ల‌తో పురుగుల మందు తాగించి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి ప్రోత్స‌హించారు ఆ న‌లుగురు. ఈ సంఘ‌ట‌నకు సంబంధించి కుండ్లీ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 22 నుంచి 25 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న న‌లుగురు నిందితులు ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. వాళ్లు ఇత‌ర ప్రాంతం నుంచి వ‌ల‌స వ‌చ్చి కార్మికులుగా జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. వారి ఇంటి ప‌క్క‌నే మైన‌ర్ బాలిక‌లు త‌మ త‌ల్లితో క‌లిసి అద్దెకు ఉంటున్నారు.

  ఈ క్రమంలో ఆగస్టు 5, 6 తేదీన అర్థ‌ రాత్రి ఈ న‌లుగురు నిందితులు బలవంతంగా బాలికల ఇంట్లోకి వెళ్లి  వారి తల్లిని బెదిరించి మైనర్ బాలికలపై అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. ఆ తరువాత వారితో బ‌ల‌వంతంగా పురుగుల మందు తాగించారు. దీంతో బాలిక‌ల ప‌రిస్థితి విష‌మించ‌డంతో బాలిక‌ల‌కు పాము క‌రిచిన‌ట్లు  పోలీసుల‌కు చెప్పాల‌ని బాలిక‌ల త‌ల్లిని బెదిరించారు. ఢిల్లీలోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు అనుమానం రాగా.. బాలిక‌ల త‌ల్లిని గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. పోస్టు మార్టం చేసిన త‌రువాత ఇద్ద‌రు మైన‌ర్ బాలిక‌లు లైంగిక దాడి, విష ప్ర‌యోగం ద్వారా మ‌ర‌ణించిన‌ట్టు వెల్ల‌డ‌యింది.  దీనిపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేశారు.


ఇదిలాఉండగా.. మరో ఘటనలో ఓ యువకుడి వేధింపుల కారణంగా మైనర్ బాలిక (17) ఆత్మహత్యకు చేసుకుని చ‌నిపోయింది. పటౌడీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ దీపక్ సంధు మాట్లాడుతూ.. యువకుడి వేధింపులు తాళలేక బాలిక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య పాల్ప‌డింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు.



రాజ్ కుంద్రాకు షాక్... ట్రబుల్స్ కంటిన్యూ

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>