ఈట‌ల జాగ్ర‌త్త‌గా మాట్లాడు హ‌రీష్ హెచ్చ‌రిక‌

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై మంత్రి హారీష్‌రావు మండిప‌డ్డారు. నోరు అదుపులో పెట్టి మాట్లాడాల‌ని హెచ్చరించారు. ‘ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్‌ను ఈటల రాజేందర్‌ ..‘రా’ అంటున్నాడు.. బీజేపీలో చేరాక ఆయన మాట మారింది.. ఓటమి భయంతోనే ఈటల మాట తూలుతున్నాడు’’ అంటూ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచి పెద్ద చేసిన కొడుకు గుండెల మీద తంతే ఎలా ఉంటుందో.. ఈటల వ్యవహారం అలానే ఉందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ తరపున హరీశ్‌రావు ప్రచారం నిర్వహించారు.