MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gear-march-intensified-now-it-is-a-festival-for-the-fans-4991c4aa-c409-4056-879c-6aa01e340e91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gear-march-intensified-now-it-is-a-festival-for-the-fans-4991c4aa-c409-4056-879c-6aa01e340e91-415x250-IndiaHerald.jpgమన హీరోలు ఇప్పుడు చాలా మారిపోయారు. ఒకప్పుడు ఏడాదికి అరకొర సినిమాలు చేసేవాళ్లు.. ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ పెంచారు. ఒకేసారి రెండు మూడు సినిమా షూటింగుల్లో పాల్గొంటూ అన్నింటికీ న్యాయం చేస్తున్నారు. అభిమానులను సినిమా లోకంలో విహరింపజేసేందుకు సిద్ధమయ్యారు.Gear march intensified now it is a festival for the fans {#}anil ravipudi;shankar;festival;krishnam raju;Pawan Kalyan;CBN;Prabhas;trivikram srinivas;Coronavirus;Cinemaగేర్ మార్చి జోరు పెంచారు.. ఇక ఫ్యాన్స్ కు పండుగే..!గేర్ మార్చి జోరు పెంచారు.. ఇక ఫ్యాన్స్ కు పండుగే..!Gear march intensified now it is a festival for the fans {#}anil ravipudi;shankar;festival;krishnam raju;Pawan Kalyan;CBN;Prabhas;trivikram srinivas;Coronavirus;CinemaWed, 11 Aug 2021 06:00:00 GMTఈ కాలం కథానాయకులకు హీరోలకు వేగం అనే మాటకు అర్థమే తెలియకుండా పోయింది. వాళ్ల  సినీ జీవితం మొత్తంలో దాదాపు 50సినిమాలు కూడా చేయడం కష్టమే అనిపించేలా ఉంది. సాధారణంగా టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేస్తే సినిమా ఇండస్ట్రీ మరో విధంగా ఉండేది. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇలాంటి విమర్శలు తరుచుగా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇన్నాళ్లకీ ఆ విమర్శలు టాప్ హీరోలకి గట్టిగా తగిలినట్టుగానే ఉన్నాయి. పాత పద్ధతులకి స్వస్తి చెప్పి పార్లల్ మూవీస్‌తో బిజీ అవుతున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ 'బాహుబలి'కి ముందు ఏడాదికి ఒక సినిమా అయినా చేసేవాడు. కానీ 'బాహుబలి' తర్వాత మినిమం రెండేళ్లు తీసుకుంటున్నాడు. 'సాహో, రాధేశ్యామ్' పూర్తి చేసేందుకు రెండేళ్లు పట్టింది. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ప్రభాస్ చాలా వేగం పెంచాడు. 'సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె' మూడు సినిమాలని సమానంగా పూర్తి చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఎప్పుడు సినిమా విడుదల చేస్తే.. అప్పుడు అభిమానులకి పండుగ అనేలా ఉండేది. కానీ ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో పండుగకి ఒక సినిమా విడుదల చేయాలని ఆరాటపడుతున్నాడు. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నాడు. అలాగే 'హరిహర వీరమల్లు'తో పాటు హరీశ్ శంకర్ సినిమాని కూడా త్వరగా పూర్తి చేయాలనే ప్లాన్ చేస్తున్నాడు ఈ హీరో.  

మహేశ్‌ బాబు 'బిజినెస్‌మెన్' వరకు చాలా లేట్‌గా సినిమాలు చేస్తాడనే కంప్లైంట్ ఉండేది. అయితే పూరీ జగన్నాథ్‌ తక్కువ సమయంలో మహేశ్‌తో 'బిజినెస్‌మెన్' తీసి ఈ విమర్శలకి సమాధానం చెప్పాడు. తర్వాత అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాని ఇలాగే స్పీడ్‌గా పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు మహేశ్ ఏకంగా రెండు సినిమాల షూటింగ్స్‌ని సమానంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. 'సర్కారువారి పాట'తో పాటు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో కూడా బిజీ అవుతాడట ఈ సూపర్ స్టార్. మొత్తానికి టాప్  హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమా షూటింగుల్లో పాల్గొంటూ.. అన్నింటికీ న్యాయం చేయాలని చూస్తున్నారు. ప్రేక్షకులను ఉత్సాహంలో నింపాలని ఆరాటపడుతున్నారు.  





ఏడేళ్లలో కేంద్రం ఏపీకి ఎన్ని కోట్లు ఇచ్చిందంటే..? ఇవిగో లెక్కలు..!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>