BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag7ec6c8ad-c46f-4135-a624-329e701f7e81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag7ec6c8ad-c46f-4135-a624-329e701f7e81-415x250-IndiaHerald.jpg ఎన్ని బ్యాంకుల ఏటీఎంల చుట్టూ తిరిగినా అన్నీ ఖాళీగానే ద‌ర్శ‌న‌మిస్తాయి. పోనీ బ‌య‌ట బోర్డు ఏమైనా ఏర్పాటు చేస్తారా? అంటే అదీ లేదు. ఏటీఎంలో లావాదేవీల‌న్నీ పూర్త‌యిన త‌ర్వాత న‌గ‌దు లేదు.. ఏమీ అనుకోవ‌ద్దు.. మీకు ద‌గ్గ‌ర‌లోని మ‌రో ఏటీఎంను సంద‌ర్శించండి అంటూ తెర‌పై చూపిస్తుంది. దీనికోసం ప‌ది నిముష‌ల నుంచి 15 నిముషాల స‌మ‌యం వృథా అవుతుంది. శ‌నివారం, ఆదివారం వ‌స్తే ఈ స‌మ‌స్య ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకొని రిజ‌ర్వు బ్యాంకు తాజాగా ఒక నిర్ణ‌యం తీసుకుంది. న‌వ‌రంబ‌రు1 నుంచి ఏటీఎంtag{#}sundayఏటీఎం ఖాళీగా ఉంటే బ్యాంకుల‌కు జ‌రిమానా?ఏటీఎం ఖాళీగా ఉంటే బ్యాంకుల‌కు జ‌రిమానా?tag{#}sundayWed, 11 Aug 2021 08:12:00 GMTఎన్ని బ్యాంకుల ఏటీఎంల చుట్టూ తిరిగినా అన్నీ ఖాళీగానే ద‌ర్శ‌న‌మిస్తాయి. పోనీ బ‌య‌ట బోర్డు ఏమైనా ఏర్పాటు చేస్తారా? అంటే అదీ లేదు. ఏటీఎంలో లావాదేవీల‌న్నీ పూర్త‌యిన త‌ర్వాత న‌గ‌దు లేదు.. ఏమీ అనుకోవ‌ద్దు.. మీకు ద‌గ్గ‌ర‌లోని మ‌రో ఏటీఎంను సంద‌ర్శించండి అంటూ తెర‌పై చూపిస్తుంది. దీనికోసం ప‌ది నిముష‌ల నుంచి 15 నిముషాల స‌మ‌యం వృథా అవుతుంది. శ‌నివారం, ఆదివారం వ‌స్తే ఈ స‌మ‌స్య ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకొని రిజ‌ర్వు బ్యాంకు తాజాగా ఒక నిర్ణ‌యం తీసుకుంది. అక్టోబ‌రు1 నుంచి ఏటీఎంలో డ‌బ్బులు లేక‌పోతే సంబంధిత బ్యాంకుల‌కు జ‌రిమానా విధించ‌నుంది. ఏటీఎంలో న‌గ‌దు లేని స‌మ‌యం నెల‌కు ప‌దిగంట‌లు దాటితే ఈ జ‌రిమానా విధిస్తారు. మిష‌న్ల‌లో డ‌బ్బులు నింపేవారికి న‌గ‌దు అందుబాటులో లేక‌పోతే ఆయా బ్యాంకులు వారికి త‌క్ష‌ణ‌మే న‌గ‌దు అందుబాటులోకి తీసుకురావాల‌ని ఆదేశించింది. నోట్ల ల‌భ్య‌త‌ను ప‌ర్య‌వేక్షించే వ్య‌వ‌స్థ‌ను కూడా బ‌లోపేతం చేసుకోవాల‌ని ఆర్‌బీఐ బ్యాంకుల‌కు సూచించింది.


రాజ్ కుంద్రాకు షాక్... ట్రబుల్స్ కంటిన్యూ

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>