PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5721e74b-ec77-496f-a7a1-eb23b80d8677-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5721e74b-ec77-496f-a7a1-eb23b80d8677-415x250-IndiaHerald.jpgఉంటామా... పోతామా... ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో తీవ్ర చర్చ జరుగుతున్న అంశం. 2019 మే నెలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తొలి శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతలకు క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు ఉన్న మంత్రులంతా రెండున్నరేళ్ల పాటు ఉంటారని. అవకాశం రాని వారికి సెకండ్ ఫేజ్ లో తప్పనిసరిగా బెర్త్ ఖరారు అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్ లో వీరికి తప్పకుండా ఛాన్స్ దక్కుతుందని భావించిన వారికి రాకుండా .. కొంతవారికి అవకాశం దక్కింది. అయినా సరే... జగనcabinet{#}November;Hanu Raghavapudi;Reddy;YCP;Jagan;Minister;Party;Yevaru;Andhra Pradesh;Octoberఉంటామా... పోతామా... పాత మంత్రుల్లో కలవరంఉంటామా... పోతామా... పాత మంత్రుల్లో కలవరంcabinet{#}November;Hanu Raghavapudi;Reddy;YCP;Jagan;Minister;Party;Yevaru;Andhra Pradesh;OctoberWed, 11 Aug 2021 10:37:00 GMTఉంటామా... పోతామా... ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో తీవ్ర చర్చ జరుగుతున్న అంశం. 2019 మే నెలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తొలి శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతలకు క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు ఉన్న మంత్రులంతా రెండున్నరేళ్ల పాటు ఉంటారని. అవకాశం రాని వారికి సెకండ్ ఫేజ్ లో తప్పనిసరిగా బెర్త్ ఖరారు అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్ లో వీరికి తప్పకుండా ఛాన్స్ దక్కుతుందని భావించిన వారికి రాకుండా .. కొంతవారికి అవకాశం దక్కింది. అయినా సరే... జగన్ మాటకు కట్టుబడి... చాలా మంది అలాగే కొనసాగారు. అయితే రెండున్నరేళ్ల గడువు ఈ ఏడాది అక్టోబర్ తో ముగుస్తుంది. నవంబర్ నెలలో కొత్త మంత్రివర్గ కూర్పు ఉంటుందని ఇప్పటికే పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది.

ఈ రెండున్నరేళ్లలో ఎన్నో మార్పులు... మరెన్నో చేర్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అమాత్య పదవి అనుభవిస్తున్న వారిలో చాలా మందికి ఉద్వాసన తప్పదనే విషయం జోరుగా వినిపిస్తోంది. అలాగే ప్రతిపక్ష నేతలను ఎదుర్కోవాలంటే బలంగా పోరాడే నేతలకే అవకాశం ఇవ్వాలని కూడా జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది సీనియర్లకు ఉన్న కార్పోరేషన్ పదవులు కూడా తొలగించారు జగన్. అంటే వీరికి బెర్త్ ఖరారు అయినట్లే అని వారి వారి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు కూడా. ఇదే సమయంలో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అమాత్య పదవి అనుభవిస్తున్న నేతల్లో గుబులు మొదలైంది. నన్ను తప్పుకోమంటారా అని అభిమానుల దగ్గర విచారం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి నిలుపుకునేందుకు ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఎన్ని పైరవీలు చేసినా... జగన్ అనుకున్నదే చేస్తాడనేది కొత్త వారి ఆశ. చూడాలి మరి... అక్టోబర్  నెల తర్వాత.. ఎవరు ఉంటారో.. ఎవరు పోతారో పాపం.





దారుణం : అన్న‌ను ముక్క‌లుగా న‌రికి పాతిపెట్టిన‌ త‌మ్ముడు.. అస‌లేం జ‌రిగింది?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>