PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpgరాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడు శరవేగంగా మలుపు తిరుగుతోంది. వైఎస్ వివేకానంద హత్య కేసు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా దానికి సంబంధించిన నాయకులు ఈ పనికి పూనుకున్నారు అని అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే హంతకులను శిక్షిస్తామని కూడా ఆయన ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చాక వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు మందగించింది అనే ఆరోపణలు ఉన్నాయి. ముందుగా ys vivekananda reddy{#}devineni avinash;Y S Vivekananda Reddy;Sakshi;Heart;Jagan;CBI;Murder.;News;local language;Telugu Desam Party;District;Minister;Partyవివేకా 'గుండెపోటు' ఎందుకు?వివేకా 'గుండెపోటు' ఎందుకు?ys vivekananda reddy{#}devineni avinash;Y S Vivekananda Reddy;Sakshi;Heart;Jagan;CBI;Murder.;News;local language;Telugu Desam Party;District;Minister;PartyWed, 11 Aug 2021 14:13:05 GMTరాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడు శరవేగంగా మలుపు తిరుగుతోంది. వైఎస్ వివేకానంద హత్య కేసు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా దానికి సంబంధించిన నాయకులు ఈ పనికి పూనుకున్నారు అని అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే హంతకులను శిక్షిస్తామని కూడా ఆయన ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చాక వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు మందగించింది అనే ఆరోపణలు ఉన్నాయి. 


ముందుగా ఈ కేసును సిఐడికి అప్పగించారు. ఆ తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినా ఏ మాత్రం ఆధారాలు కనుగొనలేకపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అయిన సునీత ఢిల్లీకి వెళ్లి అక్కడ కోర్టులో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరడంతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే ఇప్పుడు కొద్దిరోజులుగా సిబిఐ రకరకాల వ్యక్తులను విచారిస్తూ ఈ కేసును తేల్చే పనిలో పడింది. అయితే మరో సారి వివేకానంద గుండె పోటు వ్యవహారం ఇప్పుడు తెర మీదకు వచ్చింది.


 నిజానికి వివేకానంద రెడ్డి చనిపోయిన వెంటనే మీడియాకు గుండెపోటుతో చనిపోయారు అని ముందు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఇంట్లో రక్తం మరకలు చూసి అప్పుడు ఏమిటి అని ఆరా తీయగా హత్య అని వెల్లడైంది. ఈ క్రమంలోనే ఆ రోజు అసలు గుండెపోటు గా ఎందుకు చిత్రీకరించారు అనే వ్యవహారం మీద సీబీఐ బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డిని హత్య చేసి చంపేస్తే గుండెపోటుతో మృతి చెందినట్లు ముందు ఎందుకు ప్రసారం చేశారని సాక్షి ప్రతినిధిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వీరినే కాక లోకల్ ఎంపీ అవినాష్ రెడ్డి పర్సనల్ అసిస్టెంట్ లను కూడా ఈ వ్యవహారంపై ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం మారినట్టు తెలుస్తోంది ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది చూడాల్సి ఉంది.

 




రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు.. !

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>