PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/who-is-the-mogul-of-bollywooddd9a5e55-65c9-4818-b2b7-2bedf67ecda0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/who-is-the-mogul-of-bollywooddd9a5e55-65c9-4818-b2b7-2bedf67ecda0-415x250-IndiaHerald.jpgఉత్తరాది సినిమా ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాలుగా ఖాన్‌ త్రయం ఏలుతోంది. కానీ ఇప్పుడు అలా జరుగడం లేదు. రానురానూ క్రేజ్ తగ్గిపోతోంది. వరుసగా వస్తున్న ఓటములతో చాలా నెమ్మదించారు. దీంతో బాలీవుడ్‌ సూపర్ స్టార్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తోంది. థియేటర్లలో సందడి తీసుకొచ్చి.. ప్రేక్షకులను ఆ వైపు నడిపించే హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టేసింది. Who is the mogul of Bollywood{#}Aamir Khan;Amitabh Bachchan;Salman Khan;Varun Dhawan;GEUM;Journey;Hindi;ajay;bollywood;Hero;Cinemaబాలీవుడ్ ను ఏలే ఆ మొనగాడు ఎవరో..?బాలీవుడ్ ను ఏలే ఆ మొనగాడు ఎవరో..?Who is the mogul of Bollywood{#}Aamir Khan;Amitabh Bachchan;Salman Khan;Varun Dhawan;GEUM;Journey;Hindi;ajay;bollywood;Hero;CinemaWed, 11 Aug 2021 07:03:21 GMTసాధారణంగా టాప్ హీరోలు.. ఒకరు ఒకసారి హిట్ కొట్టి టాప్ రేంజ్ లో ఉంటే.. మరొకరు స్లో అవుతారు. అలా సాగుతూనే ఉంటుంది. కానీ టాప్ హీరోలయిన ముగ్గురూ ఫ్లాప్ లు చవిచూసి స్లో అయిపోతే పరిస్థితి ఏంటి.. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే జరుగుతోంది. హిందీ ఇండస్ట్రీలో ఇదే జరుగుతోంది. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ముగ్గురూ మార్కెట్‌ని పెద్దగా ఇన్‌ఫ్లుయెన్స్‌ చేయలేకపోతున్నారు.  

బాలీవుడ్‌ బాద్‌షాగా పేరొందిన షారుఖ్ ఖాన్.. ఇప్పుడా బిరుదును కోల్పోయే ప్రమాదమున్నట్టు కనిపిస్తోంది.  'చెన్నై ఎక్స్‌ప్రెస్' తర్వాత షారుఖ్‌కి ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. ఇక సొంత బ్యానర్‌లో చేసిన 'జీరో' సినిమా షారుఖ్‌ని కోలుకోలేని దెబ్బతీసింది. ఆర్థికంగా కుంగదీసిందని ప్రచారం. దీంతో 'జీరో' నుంచి కోలుకోవడానికి షారుఖ్‌కి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. ఈ లాంగ్‌గ్యాప్ తర్వాత 'పఠాన్' అనే సినిమా స్టార్ట్ చేశాడు షారుఖ్ ఖాన్.

ఇక అమీర్ ఖాన్ విషయానికొస్తే.. 'బాహుబలి' రికార్డ్స్‌ని మించిపోవాలని పీరియాడికల్ డ్రామా 'థగ్స్‌ ఆఫ్ హిందుస్తాన్'లో నటించాడు. అమితాబ్ బచ్చన్, కత్రీన కైఫ్ ఇలా భారీ స్టార్స్‌తో కలిసి చేసిన ఈ సినిమా ఆమీర్‌కి పెద్ద డిజాస్టర్ నే మిగిల్చింది. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మాణమైన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌ని ముంచేసింది.

స్టార్ హీరోలు స్లో అవుతున్నారంటే రేసులో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నోళ్లు స్పీడ్‌ పెంచాలి. నంబర్ గేమ్‌లో దూసుకెళ్లాలి. కానీ బాలీవుడ్‌ టాప్ హీరోలు స్లో అవుతోంటే, యంగ్‌స్టర్స్‌ కూడా నెమ్మదిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌ 'టైగర్ జిందాహై' వరకు బ్లాక్‌బస్టర్స్‌తో జర్నీ చేశాడు. అయితే ఆ తర్వాత వచ్చిన 'ట్యూబ్‌లైట్, భారత్, దబాంగ్3, రాధే' సినిమాలు ఆడియన్స్‌ని మెప్పించలేకపోయాయి. దీంతో సల్మాన్ మార్కెట్‌ కూడా డౌన్ అయ్యింది. ఓటీటీలో పే పర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అయిన 'రాధే' సినిమా అయితే సల్మాన్‌ ఇమేజ్‌ని కూడా డ్యామేజ్ చేసింది.

ఖాన్ త్రయంతో పరుగులు పెడుతోన్న అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్‌ ఇద్దరూ టాప్‌ ఛైర్‌కి దూరంగానే ఉన్నారు. మాస్, యాక్షన్ మూవీస్‌తో సందడి చేస్తున్నా, అక్షయ్, అజయ్ ఇద్దరినీ టాప్ స్టార్స్‌గా కన్సిడర్ చేయలేకపోతోంది  బాక్సాఫీస్. రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్‌సింగ్ లాంటి స్టార్స్‌ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నా, గేమ్ చేంజర్స్‌గా మారడం లేదు. ఇక యంగ్‌స్టర్స్ సిద్ధార్థ్‌ మల్హోత్రా, వరుణ్ ధావన్ అయితే కంప్లీట్‌గా వెనకబడిపోయారు. దీంతో బాక్సాఫీస్‌కి ధైర్యమిచ్చే సూపర్‌స్టార్ కోసం వెతుకుతోంది బాలీవుడ్. చూద్దాం.. ఆ హీరో ఎవరో.





రైతన్నలపై టీఆర్ఎస్ ప్రేమ.. అసలు కథేంటి..?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>