Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila2ae54987-f9c8-485e-a273-dd561ca143ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila2ae54987-f9c8-485e-a273-dd561ca143ad-415x250-IndiaHerald.jpgవైయస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే కొత్తపార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయవేత్తగా ఎదగాలని అనుకుంటున్నారు. కానీ మొదటి నుంచి వైయస్ షర్మిల కెసిఆర్ ప్రయోగించిన ఒక అస్త్రం అనే టాక్ వినిపిస్తోంది. కానీ షర్మిల మాత్రం అప్పుడప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ.. ఉండడం గమనార్హం. అయితే ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రస్తుతం అన్ని పార్టీలు తమతమ వ్యూహాలు అమలులోకి తెస్తున్నాయి.Sharmila{#}mandalam;un employment;Karimnagar;Sharmila;Hyderabad;Huzurabad;Bharatiya Janata Party;Telangana;job;Congress;KCR;Partyషర్మిల అస్త్రం.. కేసిఆర్ కి ప్రయోజనం.. టార్గెట్ అదేనా?షర్మిల అస్త్రం.. కేసిఆర్ కి ప్రయోజనం.. టార్గెట్ అదేనా?Sharmila{#}mandalam;un employment;Karimnagar;Sharmila;Hyderabad;Huzurabad;Bharatiya Janata Party;Telangana;job;Congress;KCR;PartyWed, 11 Aug 2021 10:03:00 GMTవైయస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే కొత్తపార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయవేత్తగా ఎదగాలని అనుకుంటున్నారు. కానీ మొదటి నుంచి వైయస్ షర్మిల కెసిఆర్ ప్రయోగించిన ఒక అస్త్రం అనే టాక్ వినిపిస్తోంది. కానీ షర్మిల మాత్రం అప్పుడప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ..  ఉండడం గమనార్హం. అయితే ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం హుజురాబాద్  నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రస్తుతం అన్ని పార్టీలు తమతమ వ్యూహాలు అమలులోకి తెస్తున్నాయి.


 ఇలాంటి సమయంలో ఇప్పటికే హైదరాబాద్ లో తమ పార్టీ పోటీలోకి దిగదు అని ప్రకటించిన వైయస్ షర్మిల..  ఇటీవలే దీక్షకు దిగడం సంచలనంగా మారిపోయింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో నిరుద్యోగ నిరాహారదీక్ష పూనారు వైయస్ షర్మిల. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించి దీక్ష ప్రారంభించారు. ఇక ఇటీవలే  హుజరాబాద్ ఎన్నికలపై కూడా వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అందరూ హుజూరాబాద్లో నామినేషన్లు వేయాలి అంటూ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఇప్పటికే నేతన్నలు  నామినేషన్లు వేస్తామని అంటున్నారు. ఇక ఫీల్డ్ అసిస్టెంట్ లు కూడా నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారూ. ఇక ఇప్పుడు నిరుద్యోగులు కూడా నామినేషన్లు వేస్తే హుజురాబాద్ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చకు వస్తుందని చెబుతున్నారు.



 ఇక కెసిఆర్ నిరంకుశ పాలన పై చర్చ జరగాలని అంటూ షర్మిల చెప్పుకొచ్చారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ నిరుద్యోగులు అందరిని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేయాలి అంటూ పిలుపు నిచ్చిన షర్మిల కేసిఆర్ కు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అటు బిజెపి లేదా కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.  ఇలాంటి నేపథ్యంలో ఇక నిరుద్యోగులు అందరూ కూడా నామినేషన్ వేస్తే ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం చీలిపోయే ఆవకాశం ఉంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఓట్లు ప్రభుత్వానికి వస్తాయి. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అటు బిజెపి ఇటు కాంగ్రెస్ కు రాకుండా పూర్తిగా చీలిపోతాయి. దీంతో  కెసిఆర్ కు ఎంతో లబ్ధి చేకూరుతుంది. అందుకే షర్మిల నిరుద్యోగులు అందరిని నామినేషన్లు వేయాలి అని పిలుపునిచ్చారు అనే టాక్ వినిపిస్తోంది.



సరదాగా స్నానం చేస్తున్న వీడియో తీసింది.. కాబోయే భర్తకు పంపబోయి. మరొకరికి..!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>