PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/actress-into-sharmila-partya412b56f-5b2c-4a87-8919-3147e8ded239-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/actress-into-sharmila-partya412b56f-5b2c-4a87-8919-3147e8ded239-415x250-IndiaHerald.jpgతెలంగాణలో వై ఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారు అని ప్రకటించిన మొదటి రోజు నుండి నేటి వరకు నిత్యం ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ తో తెలంగాణ నాయకులకు షాక్ ఇస్తూనే ఉన్నారు. తమ పార్టీ పేరు వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుండి రాజకీయాల్లో పూర్తిగా యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు మెల్ల మెల్లగా అడుగులు పడుతున్నాయి.ACTRESS INTO SHARMILA PARTY{#}Vijayashanti;Roja;Y. S. Rajasekhara Reddy;Legend;Yatra;Sharmila;Telangana;Yevaru;Party;News;Teluguషర్మిల పార్టీలోకి ప్రముఖ సినీ నటి ?షర్మిల పార్టీలోకి ప్రముఖ సినీ నటి ?ACTRESS INTO SHARMILA PARTY{#}Vijayashanti;Roja;Y. S. Rajasekhara Reddy;Legend;Yatra;Sharmila;Telangana;Yevaru;Party;News;TeluguWed, 11 Aug 2021 13:00:00 GMTతెలంగాణలో వై ఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారు అని ప్రకటించిన మొదటి రోజు నుండి నేటి వరకు నిత్యం ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ తో తెలంగాణ నాయకులకు షాక్ ఇస్తూనే ఉన్నారు. తమ పార్టీ పేరు వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుండి రాజకీయాల్లో పూర్తిగా యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు మెల్ల మెల్లగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే తాను కూడా తన తండ్రిలా, తన సోదరుడిలా పాద యాత్ర చేసి ప్రజల మనసును దగ్గరగా చూసి తెలుసుకుంటాను, వారి కష్టాలను హృదయంతో విని వారి కన్నీళ్లు తుడిచేందుకు ప్రణాళికలు రచిస్తాను అంటూ పాదయాత్రను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్తతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సెగలు పుట్టుకొచ్చాయి.

అయితే ఇప్పుడు వైఎస్సార్ తెలంగాణ పార్టీకి సంబంధించిన మరో వార్త సంచలనంగా మారింది. ఫైర్ బ్రాండ్ గా పిలువబడుతున్న నటి రోజా  ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత కీలకమో తెలిసిందే. అదే విధంగా అటు తెలంగాణ బీజేపీ లోనూ నటి విజయశాంతి రాజకీయ నేతగా తన మార్క్ వేసుకున్నారు. పార్టీకి ప్లస్ గా మారారు. అయితే ఇప్పుడు ఇదే తరహాలో మరో ప్రముఖ తెలుగు సినీ నటి, పవర్ ఫుల్ లేడీ లెజెండ్ వైయస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం.  ఆమె రాక పార్టీకి మరింత ప్లస్ కానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ తెలంగాణ రాజకీయాల హీట్ ను అమాంతం పెంచేసింది. అందరి దృష్టి ఇపుడు షర్మిల పార్టీలోకి రానున్న ఆ లేడీ డాన్ ఎవరా అన్న దానిపై పడింది.

ఈ వార్త ఒక ప్రచారమేనా లేక సైలెంట్ గా ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరిగిపోతుందా అన్నది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇదే కనుక నిజమైతే అగ్గికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. వైయస్సార్ తెలంగాణ పార్టీ తెలంగాణలో కొత్త ఉత్సాహంతో మరింత వేగంతో  దూసుకుపోతుంది అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ ఇది వాస్తవమేనా... ఒకవేళ నిజమే అయితే ఆ కీలక నటి ఎవరు అన్న వివరాలు తెలియాల్సి ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ తన దైన ముద్ర వేస్తుందని తెలుస్తోంది. ప్రజలు కూడా వైఎస్సార్ రాజకీయ వారసురాలిగా షర్మిలను ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అనేది తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.



కథ ఒకటే.. ఒకేరోజు విడుదల..వెంకీ హిట్‌... బాల‌య్య ఫ‌ట్ ?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>